pizza
Ichata Vahanamulu Niluparadu movie launch
సుశాంత్ హీరోగా 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రం ప్రారంభం!!
You are at idlebrain.com > News > Functions
Follow Us


30 January 2020
Hyderabad

యువ కథానాయకుడు సుశాంత్ హీరోగా ఎస్.దర్శన్ దర్శకత్వంలోఎఐ స్టూడియోస్, శాస్త్రా మూవీస్ పతాకాలపై రవిశంకర్ శాస్రి, హరీష్ కోయలగుండ్ల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. ఈ చిత్రం ద్వారా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. వెంకట్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 30న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి యోగేశ్వరి క్లాప్ నివ్వగా వెంకటరత్నం కెమెరా స్విచాన్ చేశారు. నాగసుశీల మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..

హీరో సుశాంత్ మాట్లాడుతూ - " ఈ ఏడాది ఆరంభంలోనే అలవైకుంఠపురములో..చిత్రంతో మంచి బ్యాంగ్ దక్కింది. ఈ మూవీ ఒక మంచి థ్రిల్లర్. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. అలాగే మంచి టీమ్ కుదిరింది. యంగ్ అండ్ టాలెంటెడ్ టీమ్ ఈ సినిమాకి వర్క్ చేయబోతున్నారు. చి.ల.సౌ తరువాత ఈ సినిమా చేయాల్సింది. మంచి ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ దొరకడం సంతోషంగా ఉంది. నేను మీనాక్షిని బాంబే లో కలిశాను. ఇద్దరం కలిసి యాక్టింగ్ వర్క్ షాప్స్ చేశాం. చాలా టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కర్. ఇంతమంచి అవకాశం ఇచ్చిన రవి శాస్రి, హరీష్ గారికి దన్యవాదాలు. నా ప్రతి సినిమా కొత్తదనం తో చేద్దాం అనుకుంటున్నా డెఫినెట్ గా ఈ సినిమాలో ఆ కొత్తద‌నం ఉంది" అన్నారు.

నిర్మాత రవిశంకర్ శాస్త్రి మాట్లాడుతూ - "చాలా రోజులనుండి ఒక మంచి సినిమా తీయాలని అనుకుంటున్నారు. అలాంటి సమయంలో హరీష్ ఒక మంచి కాన్సెప్ట్ ని తీసుకువచ్చాడు. అలాగే దర్శన్ స్క్రిప్ట్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. 2020 దశాబ్దం ప్రారంభం అయింది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఈ స్క్రిప్ట్ ని ఎంచుకున్నాం. హీరోగా సుశాంత్ పర్ఫెక్ట్ ఛాయిస్. అలాగే మీనాక్షి ముల్టీటాలెంటెడ్. తనపాత్రకి యాప్ట్ అని అనుకుంటున్నాం. అలాగే దర్శన్ టెక్నికల్ గా బ్రిలియంట్. ఈ సినిమా తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను' అన్నారు.

నిర్మాత హరీష్ కోయలగుండ్ల మాట్లాడుతూ - " నటుడిగా ఈ పరిశ్రమకి వచ్చి నిర్మాతగా మారతానని కలలో కూడా ఊహించలేదు. అలాగే భానుమతి గారి మనవడు రవిశంకర్ శాస్త్రి గారితో కలిసి ఈ సినిమా నిర్మించడం ఒక పెద్ద అచీవ్ మెంట్. ఈ అవకాశం ఇచ్చిన సుశాంత్ గారికి, రవిశంకర్ శాస్త్రి గారికి నా హృదయపూర్వక దన్యవాదాలు.

హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ - " హీరోయిన్ గా నా ఫస్ట్ మూవీ. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకి థాంక్స్. ఈ చిత్రం ద్వారా దర్శన్ నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాను అనుకుంటున్నాను. సుశాంత్ గారితో కలిసి నటించడానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను" అన్నారు.

సుశాంత్, మీనాక్షి చౌదరి, వెంకట్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, ఐశ్వర్య, రవివర్మ, హరీష్ కోయలగుండ్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

దర్శకత్వం: ఎస్.దర్శన్,
నిర్మాతలు: రవిశంకర్ శాస్రి, హరీష్ కోయలగుండ్ల,
సినిమాటోగ్రాఫర్: ఎం. సుకుమార్,
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు,
ఎడిటర్: గ్యారీ బి హెచ్,
ఆర్ట్: వి. వి,
మాటలు : సురేష్, భాస్కర్,
పి.ఆర్.ఓ: వంశీ - శేఖర్.



Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved