pizza
Kalyan Fan of Pawan movie launch
`క‌ళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ ప‌వ‌న్‌` ప్రారంభోత్స‌వం
You are at idlebrain.com > News > Functions
Follow Us

10 May 2017
Hyderabad

క‌ళ్యాణ్‌, ల‌క్ష్మి శిల్ప హీరో హృరోయిన్లుగా శ్రీ ల‌క్ష్మి లోహిత క్రియేష‌న్స్‌, శ్రీ శ‌ర‌ణ్య సినీ చిత్ర కంబైన్స్ బ్యాన‌ర్స్‌పై రూపొంద‌నున్న కొత్త చిత్రం `క‌ళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ ప‌వ‌న్‌`. ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రిగింది. ముహుర్త‌పు స‌న్నివేశానికి క‌విత క్లాప్ కొట్ట‌గా, సాయివెంక‌ట్ కెమెరా స్విచ్చాన్ చేశారు. స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో టి.రామ‌కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనంతరం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో..

సాయివెంకట్ మాట్లాడుతూ - ``ఈ సినిమా హీరో క‌ళ్యాణ్ చాలా అద్భుత‌మైన స్టోరీని రాసుకున్నాడు. సినిమా క‌థ చాలా బావుంది. సినిమా రిలీజ్ విష‌యంలో కూడా నా వంతు స‌హ‌కారం నేను అందిస్తాను. టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

హీరో క‌ళ్యాణ్ మాట్లాడుతూ - ``నాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే పిచ్చి. ప్ర‌తిరోజు ఆయ‌న సినిమా కానీ, ఆయ‌న న‌టించిన ఏదేని సీన్ కానీ చూడందే రోజు ప్రార‌రంభించ‌ను. ఆయ‌న్ను దృష్టిలో పెట్టుకుని క‌థ రాసుకున్నాను. క‌థ విన‌గానే న‌మ్మకంతో సినిమా చేయ‌డానికి ముందుకు వ‌చ్చిన నిర్మాత‌గారికి థాంక్స్‌. ఆయ‌న రుణం మ‌ర‌చిపోలేనిది. ద‌ర్శ‌కుడు స‌త్య‌గారు సినిమాను బాగా తెర‌కెక్కిస్తార‌నే న‌మ్మ‌కంతో ఉన్నాం`` అన్నారు,

నిర్మాత రామ‌కృష్ణ మాట్లాడుతూ - ``ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఎంత్ర క్రేజ్ ఉందో మ‌న‌కు తెలిసిందే. ఆయ‌న‌కు ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు. అటువంటి అభిమానుల్లో క‌ళ్యాణ్ కూడా ఓ వీరాభిమాని. క‌థ విన‌గానే బాగా న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాను. మా బ్యాన‌ర్ వాల్యూ ఈ సినిమాతో పెరుగుతుంద‌ని బావిస్తున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కుడు స‌త్య మాట్లాడుతూ - ``క‌థ‌ను, న‌న్ను న‌మ్మి అవ‌కాశం ఇచ్చిన నిర్మాత రామ‌కృష్ణ‌గారికి థాంక్స్‌. ఓ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమానికి ఓ స‌మ‌స్య వ‌స్తే అత‌నెలా దాన్ని ప‌రిష్క‌రించుకున్నాడ‌నేదే క‌థ‌. అభిమానులు, ప్రేక్ష‌కులు అంద‌రికీ న‌చ్చేలా సినిమా ఉంటుంది`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved