pizza
Manchu entertainment production No.3 film launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 November 2014
Hyderabad

మంచు ఎంటర్ టైనర్ లో మరో ఎంటర్ టైనర్ ప్రొడక్షన్ నెం.౩

ఊ కొడతారా ఉలిక్కిపడాతారా గుండెల్లో గోదారి వంటి విభిన్న కథా చిత్రాలతో ఉత్తమ అభిరుచి గల నిర్మాతగా అనతి కాలంలోనే పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న మంచు లక్ష్మి మరో సరికొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. మంచు ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ఫైవ్ ఎలిమెంట్స్ సంస్థతో కలిసి ప్రొడక్షన్ నెం.౩ని ప్రారంభించారు. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రం హైదరాబాద్ లోని ఓ ఇంట్లో ప్రారంభమైంది. దేవుడి చిత్ర పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి శ్రీనివాస్ నాయుడు క్లాప్ నివ్వగా..మంచు లక్ష్మి భర్త ఆండి, పాప విద్యా నిర్వాణ కెమెరా స్విచ్ఛాన్ చేసారు. తొలి షాట్ కు మంచు మనోజ్ గౌరవ దర్శకత్వం వహించారు. క్రైం కామెడీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వ శాఖలో పనిచేశిన ఎన్.వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి బి.శ్రీనికేత్ ఫొటొగ్రఫీ అందిస్తుండగా సత్య సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

నటీనటులు
మంచు లక్ష్మి, ఆడవి శేషు, బ్రహ్మానందం, శాంతిప్రియ(భానుప్రియ సోదరి), పృథ్వి, మధునందన్, ప్రబాకర్

సాంకేతిక వర్గం
కథ, దర్శకత్వం - ఎన్.వంశీకృష్ణ, స్క్రీన్ ప్లే - ఎన్.వంశీకృష్ణ, మోహన్ భరద్వాజ్

నిర్మాత - మంచు లక్ష్మి
డైరెక్టర్ ఆప్ ఫొటొగ్రఫి - బి.శ్రినికేత్
డైలాగ్స్ - సాయిమాధవ్ బుర్రా (కృష్ణం వందే జగద్గురుం )
ఆర్ట్ డైరెక్టర్ - హరి వర్మ
సంగీతం - సత్య
పిఆర్‌ఓ - జి.శ్రీనివాస్ (జి.ఎస్.మీడియా) నుంచి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - జి.వి.రావ్
కొ డైరెక్టర్ - గోపికృష్ణ
కాస్ట్యూమ్స్ - తోట సతీష్
మేకప్ ఆర్టిస్ట్ - బద్రి శ్రీను
ఎడిటింగ్ - మధు

Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved