pizza
Neelimalai Movie Launch
`నీలిమ‌లై` ప్రారంభ‌మైంది
You are at idlebrain.com > News > Functions
Follow Us

3 August 2016
Hyderaba
d

నీలిమ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై `నీలిమ‌లై` అనే సినిమా బుధ‌వారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో మొద‌లైంది. ఆనంద్ కృష్ణ క‌థానాయ‌కుడు. శిల్ప నాయిక‌. సూర్య‌కిర‌ణ్ ఇలాది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆనంద్ కృష్ణ నిర్మాత‌. ముహూర్త‌పు స‌న్నివేశానికి సాయివెంక‌ట్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ క్లాప్‌నిచ్చారు. ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ `` ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం చేసే అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌కు ధ‌న్య‌వాదాలు. అయ్య‌ప్ప‌స్వామి బ్యాక్‌డ్రాప్లో జ‌రిగే చిత్రం. పంచ‌భూతాల‌కు ప‌ద్దెనిమిది మెట్ల‌కు ఉన్న సంబంధాన్ని తెలియ‌జేస్తుంది. అలాగ‌ని డివోష‌న‌ల్ చిత్రం కాదు. ల‌వ్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో స‌హా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నీలిమ‌లై అనేది శ‌బ‌రిమ‌లైకి వెళ్లేట‌ప్ప‌డు వ‌చ్చే కొండ‌. అందుకే ఆ పేరునే సినిమాకు పెట్టాం`` అని అన్నారు.

Shilpa Swetha Glam gallery from the event

హీరో మాట్లాడుతూ ``డిఫ‌రెంట్ చిత్ర‌మ‌వుతుంది. అన్ని ఎలిమెంట్స్ తో ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటుంద‌ని భావిస్తున్నాం`` అని తెలిపారు.

ఈ కార్య‌క్రమంలో హీరోయిన్ శిల్ప‌, సంగీత ద‌ర్శ‌కుడు దేవేంద్ర స‌దివే త‌దిత‌రులు పాల్గొన్నారు.

ముర‌ళీమోహ‌న్‌, అలీ, దేవిశ్రీ, బిత్తిరి స‌త్తి, అప్పారావు, రాథోడ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: దేవేంద్ర స‌దివే, కెమెరా: కాంతారావు, ఆర్ట్: విజ‌య్ కృష్ణ‌.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved