pizza
Pelli Choopulu movie launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

1 November 2015
Hyderabad

`పెళ్లిచూపులు` మొద‌లైంది

ధ‌ర్మ‌ప‌థ క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న సినిమా `పెళ్లి చూపులు`. రాజ్ కందుకూరి, బిగ్ బెన్ సినిమాస్ (లండ‌న్‌) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు న‌వంబ‌ర్ 1న ఉద‌యం 10 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని అన్న పూర్ణ స్టూడియోలో జ‌రిగాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రీతు వ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న సినిమా ఇది. త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌కుడు. వినూత్న గీత కంపెనీ లైన్ ప్రొడ్యూస‌ర్‌. ఈ సినిమా ముహూర్త‌పు స‌న్నివేశానికి డి.సురేష్‌బాబు క్లాప్‌నిచ్చారు. అశోక్ కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అవ‌స‌రాల శ్రీనివాస్ గౌర‌వ‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ ``శ్రీ య‌ష్‌ రంగినేనితో క‌లిసి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో త‌రుణ్‌భాస్క‌ర్‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నాం. సైన్మా, అనుకోకుండా అనే షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తున్నాం. సురేష్‌బాబు మా స్టోరీలైన్ విని చాలా బావుంద‌ని, వెంట‌నే చేసేయ్య‌మ‌ని చెప్పారు. మ‌నం, ఉయ్యాలా జంపాలా వంటి సినిమాలు ఎలాంటి ఫ్రెష్ ఫీలింగ్ ను ఇచ్చాయో అలాంటి ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది ఈ సినిమా. ఈ రోజు నుంచి న‌వంబ‌ర్ 16 వ‌ర‌కు తొలి షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాం. న‌వంబ‌ర్ 20 నుంచి డిసెంబ‌ర్ 4వ‌ర‌కు రెండో షెడ్యూల్‌, వ‌చ్చే నెలాఖ‌రున మూడో షెడ్యూల్‌ని ప్లాన్ చేస్తున్నాం. సినిమా మొత్తాన్ని 42 రోజుల్లో పూర్త‌య్యేలా ప్లాన్ చేస్తున్నాం. పూర్తి స్థాయి క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఇది`` అని తెలిపారు.

శ్రీ య‌ష్‌ రంగినేని మాట్లాడుతూ ``ద‌ర్శ‌కుడు చెప్పిన పాయింట్ న‌చ్చింది. సినిమాలంటే నాకు చాలా ఇఫ్టం. రాజ్ కందుకూరితో క‌లిసి సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రీతూవ‌ర్మ మంచి జోడీగా పేరు తెచ్చుకుంటారు. యంగ్ టాలెంట్‌ని ప‌రిచ‌యం చేయ‌డానికి ఈ బ్యాన‌ర్ ను పెట్టాం`` అని తెలిపారు.

హీరో మాట్లాడుతూ ``క‌థ న‌చ్చింది. త‌రుణ్ తో మంచి ప‌రిచ‌యం ఉంది. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమా చూసి నాకు ఫోన్ చేసి బాగా చేశాన‌ని మెచ్చుకున్నాడు. నాతో సినిమా చేస్తాన‌ని ఈ సినిమా స్క్రిప్ట్ చేశాడు. నేనూ, త‌ను క‌లిసి నిర్మాత‌ల‌ను క‌లిశాం. ఫీల్ ఉన్న సినిమా అవుతుంది. సింపుల్ స్టోరీ ఇది`` అని తెలిపారు.

సంగీత ద‌ర్శ‌కుడు వివేక్ సాగ‌ర్‌ మాట్లాడుతూ ``ఇది నా తొలి సినిమా. త‌రుణ్‌తో ఇంత‌కు ముందు నేను ట్రావెల్ చేశాను. సంగీతానికి స్కోప్ ఉన్న సినిమా ఇది. సంగీతంలో కొత్త ప్ర‌యోగం చేస్తున్నాం. ఆన్ లొకేష‌న్‌లోనే రీరికార్డింగ్‌, సౌండ్ డిజైనింగ్ చేస్తున్నాం. ఇది ఎక్స్ పెరిమెంట్‌. టైమ్ కూడా సేవ్ అవుతుంది`` అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``నిర్మాత‌లకు ధ‌న్య‌వాదాలు. ఇన్నొవేటివ్‌గా ఏమైనా చేస్తామ‌ని చెప్పిన‌ప్పుడ‌ల్లా ఫ్రీడ‌మ్ ఇస్తున్నారు. మంచి టీమ్ కుదిరింది. ప‌క్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాం. విజ‌య్‌, రీతూ చ‌క్క‌గా న‌టిస్తారు. ట్రెడిష‌న‌ల్ ఎన్విరాన్‌మెంట్‌లో జ‌రిగే మోడ్ర‌న్ ల‌వ్ స్టోరీ ఇది. మోడ్ర‌న్ జంట ట్రెడిష‌న్‌కు ఎలా విలువిచ్చార‌నేది క‌థాంశం. స్వ‌ప్న‌క్క‌, ల‌క్ష్మీ మంచు మంచి స‌పోర్ట్ చేస్తున్నారు`` అని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో రీతూవ‌ర్మ‌, డీఓపీ న‌గేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved