pizza
Pesarattu movie launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

05 September 2014
Hyderabad

నందు, నికిత నారాయన్ జంటగా , కత్తి మహేష్ దర్శకత్వం లో క్లాప్ బోర్డ్ స్టుడియో, రాం ప్రియాంక మీడియా ఎంటర్ టైన్మెంట్స్, రిచెజ్జ మీడియా ఎంటర్ టైన్మెంట్స్, పింక్ పాక్డి సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ 'పెసరట్టు'. ఈ సినిమా హైదరాబాద్ లోని గండిపేటలో ప్రారంభం అయింది. ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచాన్ చేయగా, మరో దర్శక నిర్మాత స్టీవన్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా టాలీవుడ్ లోనే తొలిసారిగా క్రౌడ్ ఫండింగ్ పద్దతిలో నిర్మాణం జరుపుకుంటోంది. రామ్ గోపాల్ వర్మ.. ఫ్లో-కాం టెక్నాలజీ ని ఇన్స్పిరషన్ గా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో, హీరోయిన్ మినహా నటీనటులందరినీ సోషల్ మీడియా నెట్ వర్క్ ద్వారా ఎంపిక చేసుకుని వారం రోజులు వారందరికీ వర్క షాప్ నిర్వహించారు. ఈ రోజు నుంచి సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసి.. అక్టోబర్ లో సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది.

నిర్మాతలు: శ్రీనివాస్ గునిసెట్టి, ఈడుపుగంటి శేషగిరి రావు, డీజీ సుకుమర్, సంగీతం: ఘంటశాల విశ్వనాథ్, కెమెరా: కమలాకర్, లైన్-ప్రొడ్యూసర్ : డీ కే. విశ్వనాథ్, మాటలు: అరిపాల సత్య ప్రసాద్, పాటలు: సుభాష్, స్టైలీస్ట్: నిహారిక కన్నన్, కో-డైరెక్టర్: -పవిత్రం మీసాల, కథ-దర్శకత్వం : కత్తి మహేష్


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved