pizza
Titanic movie launch
టైటానిక్ సినిమా ప్రారంభోత్స‌వం
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 November 2015
Hyderabad

రాజీవ్ సాలూరి, యామిని భాస్క‌ర్ హీరో హీరోయిన్లుగా క‌న్నా సినీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నూత‌న చిత్రం ‘టైటానిక్’. ‘అంత‌ర్వేది టు అమ‌లాపురం’ ట్యాగ్ లైన్. ఈ చిత్రం బుధ‌వారం రాజ‌మండ్రిలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. జి.రాజ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో కె.శ్రీనివాస‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజమండ్రి కార్పొరేట‌ర్‌ మ‌డ‌పాక విజ‌య‌ల‌క్ష్మి జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేశారు. తొలి స‌న్నివేశానికి రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే బుచ్చ‌య్య‌చౌద‌రి క్లాప్ కొట్ట‌గా, రాజ‌మండ్రి మేయ‌ర్ పంతం ర‌జ‌నీ శేష‌సాయి కెమెరా స్విచ్చాన్ చేశారు. ముహుర్త‌పు స‌న్నివేశానికి మ‌డ‌పాక విజ‌య‌ల‌క్ష్మిగౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా...

స‌హ నిర్మాత అట్టూరి సురేష్‌బాబు మాట్లాడుతూ ‘’’టైటానిక్’ చిత్రం ఫుల్ ప్యామిలీ కామెడి ఎంటర్‌టైన‌ర్‌. ‘అంత‌ర్వేది నుండి అమ‌లాపురం’ వ‌ర‌కు గోదావ‌రి న‌దిలో టైటానిక్ అనే లాంచీలో జ‌రిగే క‌థే ఇది. పెళ్ళి బృందం కామెడితో సినిమా సరదాగా సాగుతుంది. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇందులో పెళ్ళి కొడుకుగా న‌టిస్తున్నాడు. రాజీవ్ సాలూరి హీరోగా న‌టిస్తున్నాడు. ర‌ఘుబాబు విల‌న్‌గా న‌టిస్తున్నాడు. అలాగే జ‌బ‌ర్‌ద‌స్త్ టీం కామెడి సినిమాకు ప్ల‌స్ అవుతుంది. సినిమా రెగ్యుల‌ర్ షూటిగంగ్ ఈరోజు నుండి స్టార్ట‌వుతుంది. 35రోజుల్లో చిత్రీకర‌ణ‌ను పూర్తి చేసి సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. రాజ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌కు వినోద్ యాజ‌మాన్య సంగీతం అందిస్తున్నారు’’ అన్నారు.

పృథ్వీ, ర‌ఘుబాబు, కాదంబ‌రి కిర‌ణ్ త‌దిత‌రులు ఇత‌ర తారాగణం. ఈ చిత్రానికి డ్యాన్స్ః స‌త్య‌, ఫైట్స్ః రాం సుంక‌ర‌, ఆర్ట్ః ర‌ఘుకుల‌క‌ర్ణి.కె, మ్యూజిక్ః వినోద్ యాజ‌మాన్య‌, ఎడిట‌ర్ః ఎమ్‌.ఆర్‌.వ‌ర్మ‌, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫీః రామ‌రాజు, స‌హా నిర్మాతః అట్లూరి సురేష్ బాబు, నిర్మాతః కె.శ్రీనివాస‌రావు, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: జి.రాజ‌వంశీ.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved