pizza
Veda Enterprises production No.2 movie launch
వేదా ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై నూతన చిత్రం ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

17 March 2016
Hyderabad

శ్రీనివాస రెడ్డి, ధీరేంద్ర, ప్రవీణ్, బిందు బార్భీ ప్రధాన తారాగణంగా వేదా ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా నూతన చిత్రం గురువారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. శ్రీకర బాబు దర్శకత్వంలో దగ్గుబాటి వరుణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి అశోక్ కుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, టి.ప్రసన్నకుమార్ క్లాప్ కొట్టారు. రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....

డి.సురేష్ బాబు మాట్లాడుతూ ‘’నిర్మాత వరుణ్ మా కజిన్. మొదటి సినిమా విడుదల కాకముందే రెండో సినిమా స్టార్ట్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. మాటల రచయిత దివాకర్ బాబు తనయుడు శ్రీకర బాబుతో రెండో సినిమా వరుసగా చేయడం మంచి పరిణామం. డిఫరెంట్ సినిమాలను ఇండస్ట్రీ ఎప్పుడూ ఆదరిస్తుంది. అందుకు ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రాల విజయాలే ఉదాహరణ’’ అన్నారు.

రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ‘’ప్రొడ్యూసర్ దగ్గర దర్శకుడికి గుడ్ విల్ ఎంతో అవసరం. ఓకే ప్రొడక్షన్ లో రెండో సినిమాకు వరుసగా డైరెక్రర్ గా మూవీ చేయడం చాలా సంతోషం. శ్రీకర బాబు మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకోవాలి. మంచి అవగాహన ఉన్నవ్యక్తి’’ అన్నారు.

దర్శకుడు శ్రీకరబాబు మాట్లాడుతూ ‘’ఈ బ్యానర్ లో ముసుగు తర్వాత నేను చేస్తున్న రెండో సినిమా. పస్ట్ షెడ్యూల్ లో సాంగ్ కొన్ని సీన్స్ చేస్తాం. మా బ్యానర్ లో ముసుగు విడుదలైన తర్వాత సెకండ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాం. నా మీదున్న నమ్మకంతో రెండో సినిమా కూడా నాకే ఇవ్వడం గర్వకారణంగా ఉంది. ఈ సినిమాకు గంగోత్రి విశ్వనాథ్ మాటలు, పాటలు అందిస్తుండగా, అమోఘ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా’’ అన్నారు.

నిర్మాత దగ్గుబాటి వరుణ్ మాట్లాడుతూ ‘’మా బ్యానర్ లో చేస్తున్న రెండో సినిమా ఇది. శ్రీకర బాబు వర్కింగ్ స్టయిల్ నచ్చడంతో ఆయనతోనే రెండో సినిమా చేస్తున్నాను. మార్చి 18 నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరో శ్రీనివాస్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ అమోఘ్ దేశ్ పతి, హీరోయిన్ బిందు బార్బీ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి లిరిక్స్, డైలాగ్స్: గంగోత్రి విశ్వనాథ్, నిర్మాత: దగ్గుబాటి వరుణ్, స్టోరీ, డైరెక్షన్: శ్రీకర బాబు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved