
9 August 2025
Hyderabad
Ram Pothineni launched the gripping theatrical trailer of Paradha, starring Anupama Parameswaran, Darshana Rajendran, Sangeetha, Rag Mayur, and directed by Cinema Bandi fame Praveen Kandregula. The film is produced by Vijay Donkada, Srinivasulu PV, and Sridhar Makkuva under the Anand Media banner, with the support of The Family Man creators Raj & DK.
The story revolves around Subbu (Anupama Parameswaran), who feels suffocated by the rigid, male-dominated traditions of her village. Taking a bold step, she embarks on a spirited road trip with two strangers (Darshana Rajendran and Sangeetha). However, the narrative takes a dark turn when Subbu disappears, and danger lurks in her village.
Director Praveen tackles deep-rooted traditions with honesty, delivering a hard-hitting narrative. Anupama delivers one of the best performances of her career, portraying Subbu brilliantly. Darshana and Sangeetha impress with strong performances, while Rag Mayur leaves his own mark.
Cinematographer Mridul Sujith Sen beautifully contrasts rural life with the scenic Himalayan landscapes. Gopi Sundar’s background score adds perfect intensity, and the strong production values promise a powerful cinematic experience. Paradha releases in theatres on August 22.
At the trailer launch, Ram Pothineni said:
"The story of Paradha is amazing, and Anupama has given a fantastic performance. We must encourage such films. Just like Bollywood makes films like Laapataa Ladies, why can’t we do it here? I hope this film becomes a big hit and brings great profits to the producers. I loved Cinema Bandi, and I wish Praveen achieves another big success with this one. Anupama is a dear friend who puts 100% effort into any role, and she has delivered a fantastic performance here. Don’t miss it in theatres on August 22."
Anupama Parameswaran said:
"Ram is my best friend and knows how important this film is to me. He offered his support whenever I needed it. I’m lucky to have such a friend. I’m happy he launched the trailer despite his busy schedule. This is a very good film, and I request everyone to watch it in theatres on August 22."
Producer Vijay said:
"The film is releasing on Megastar Chiranjeevi’s birthday. Anupama has delivered an outstanding performance — you’ll see Anupama 2.0 in this movie. This film will not disappoint you."
Director Praveen said:
"This is my biggest project so far, starring three big names. It’s a proper commercial film with a powerful message. If this succeeds, more producers will invest in content like this. You’ll see a new version of Anupama in this film."
Producer Sridhar said:
"We released the trailer on Superstar Mahesh Babu’s birthday and the film will release on Megastar Chiranjeevi’s birthday. The response so far has been amazing, and I’m confident this film will offer a great theatre experience."
Cast: Anupama Parameswaran, Darshana Rajendran, Sangeetha, Rag Mayur
Crew:
Banner: Anand Media
Director: Praveen Kandregula
Producers: Vijay Donkada, Srinivasulu PV, Sridhar Makkuva
Music: Gopi Sundar
DOP: Mridul Sujith Sen
Editor: Dharmendra Kakarala
Lyrics: Vanamali
Sound Design: Varun Venugopal
Art Director: Srinivas Kaling
Costume Designer: Poojitha Thadikonda
'పరదా' కథ చాలా గొప్పగా ఉంటుంది. అనుపమ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ట్రైలర్ అదిరిపోయింది. ఆగస్ట్ 22న మిస్ అవ్వకుండా థియేటర్స్ లో చూడండి: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో రామ్ పోతినేని
అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
‘పరదా’ కథ సుబ్బు (అనుపమ పరమేశ్వరన్) చుట్టూ తిరుగుతుంది. తన ఊరిలోని కఠినమైన, మగవారికి మాత్రమే మద్దతు ఇచ్చే సంప్రదాయాల వల్ల విసిపోయిన సుబ్బు, ఓ ధైర్యమైన నిర్ణయం తీసుకుంటుంది. ఇద్దరు అపరిచితులు (దర్శన రాజేంద్రన్, సాంగీత) తో కలసి, ఓ ఎనర్జీతో నిండిన రోడ్ ట్రిప్‌కి వెళుతుంది. కానీ, కథ ఒక్కసారిగా సీరియస్ మలుపు తిప్పుతుంది. సుబ్బు అదృశ్యమవుతుంది. ఊరిలో ఆమె కోసం ఓ ప్రమాదం పొంచివ ఉంటుంది.
దర్శకుడు ప్రవీణ్ కండ్రెగుల తెరకెక్కించిన ఈ కథ, పాతుకుపోయిన సంప్రదాయాలపై నేరుగా ప్రశ్నలు వేస్తూ, నిజాయితీగా సాగుతుంది. అనుపమ పరమేశ్వరన్ తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సుబ్బు పాత్రలో అద్భుతంగా నటించింది. దర్శనరాజేంద్రన్, సంగీత కూడా బలమైన నటనతో మెప్పించారు. రాగ్ మయూర్ కూడా తనదైన ఇంపాక్ట్ క్రియేట్ చేశారు.
మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ, పల్లెజీవితానికి, హిమాలయాల అందాలకు మధ్య ఉన్న డిఫరెన్స్ అందంగా చూపించింది. గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి కావాల్సిన ఇంటెన్సిటీని పర్ఫెక్ట్‌గా అందించింది. బలమైన ప్రొడక్షన్ విల్యూస్‌తో ‘పరదా’ ఒక పవర్‌ఫుల్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. ‘పరదా’ ఆగస్ట్ 22న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా స్టోరీ లైన్ నాకు తెలుసు. చాలా అద్భుతమైన కథ. డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. బాలీవుడ్ లో లాపతలేడీస్ లాంటి సినిమాలు చూస్తుంటాం. మనం ఎందుకు అలాంటి సినిమాలు చేయలేమని ఆలోచిస్తుంటాం. ఇలాంటి సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతల్ని తప్పకుండా ప్రోత్సహించాలి. ఈ సినిమా హిట్ అయి నిర్మాతలకు చాలా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు విజయాలు సాధిస్తే నిర్మాతలకి ధైర్యం వస్తుంది. ప్రవీణ్ తీసిన సినిమా బండి సినిమా నాకు చాలా ఇష్టం. ఈ సినిమాతో అతను మరో అద్భుత విజయం సాధించాలని కోరుకుంటున్నాను. గోపీసుందర్ గారి మ్యూజిక్ అద్భుతంగా ఉంది. అనుపమ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఏ క్యారెక్టర్ ఇచ్చిన 100% ఎఫర్ట్ పెడుతుంది. తనకి సినిమా అంటే చాలా పాషన్. ఈ సినిమాలో ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఆగస్టు 22న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మిస్ అవ్వకుండా చూడండి'అన్నారు.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. రామ్ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్. పరదా సినిమా నాకు ఎంత ఇంపార్టెంటో ఆయనకు తెలుసు. ఆయనతో మాట్లాడినప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఏ సపోర్ట్ కావాలన్నా నన్ను అడుగు అని అన్నారు. రామ్ లాంటి ఫ్రెండు నాకు ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన బిజీ షెడ్యూల్ లో మా కోసం వచ్చి ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఆంధ్ర కింగ్ కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి సినిమా ఇది. ఆగస్టు 22న రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ విజయ్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ డే రోజున సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాని ప్రాణం పెట్టి పనిచేశాం. అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఈ సినిమాతో అనుపమ 2.0 చూడబోతున్నాం. మా ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ గారికి ధన్యవాదాలు. ఆయన ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేద్దామని రావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. 100% చెప్తున్నాను. ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఆగస్టు 22 అందరం థియేటర్స్ లో కలుద్దాం.
డైరెక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. మా ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ గారికి థాంక్యూ సో మచ్. మాకు చాలా పెద్ద సపోర్ట్ ఇచ్చారు. ప్రాణం పెట్టి సినిమా చేసాం. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. నా సినిమాలు శుభం, సినిమా బండి ఒక జోనర్ సినిమాలు. ఇది మాత్రం ఒక బిగ్ స్కేల్ మూవీ. ముగ్గురు పెద్ద స్టార్స్ తో సినిమా చేశాను. ఇది ప్రాపర్ కమర్షియల్ సినిమా. ఈ సినిమాకి ఖచ్చితంగా పేరు వస్తుంది. ఈ సినిమాకి డబ్బులు కూడా రావాలి. డబ్బులు వస్తే ఇలాంటి కంటెంట్ మీద ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు. ఈ సినిమాతో అనుపమ కొత్త వర్షన్ చూడబోతున్నారు. ఈ సినిమా రివ్యూ బాగుంటేనే సినిమా చూడండి' అన్నారు
ప్రొడ్యూసర్ శ్రీధర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్ డే రోజున ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజున సినిమా రిలీజ్ అవుతుంది. మా సినిమాని ప్రమోట్ చేయడానికి విచ్చేసిన రామ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటివరకు కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన తర్వాత మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇస్తుంది. అందరూ ఈ సినిమాకి తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను'అన్నారు. మూవీ యూనిట్ అంతా ఈ వేడుకలో పాల్గొన్నారు.
తారాగణం: అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: ఆనంద మీడియా
దర్శకత్వం: ప్రవీణ్ కాండ్రేగుల
నిర్మాతలు: విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రోహిత్ కొప్పు
సంగీతం: గోపీ సుందర్
సాహిత్యం: వనమాలి
రచయితలు: పూజిత శ్రీకాంతి, ప్రహాస్ బొప్పూడి
స్క్రిప్ట్ డాక్టర్: కృష్ణ ప్రత్యూష
డీవోపీ: మృదుల్ సుజిత్ సేన్
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
సౌండ్ డిజైన్: వరుణ్ వేణుగోపాల్
ఆర్ట్ డైరెక్టర్: శ్రీనివాస్ కళింగ
కాస్ట్యూమ్ డిజైనర్: పూజిత తాడికొండ

