pizza
'ల‌య‌న్' చిత్రాన్ని వీక్షించిన ఎమ్మెల్యే ప‌రిటాల సునీత‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 May 2015
Hyderabad

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా జె.రామాంజ‌నేయులు స‌మ‌ర్ప‌ణ‌లో రుద్ర‌పాటి ప్రేమ‌ల‌త నిర్మాణ సార‌థ్యంలో ఎస్‌.ఎల్‌.వి.సినిమా బ్యాన‌ర్‌పై స‌త్య‌దేవ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ల‌యన్‌. ఈ చిత్రం మే 14న వర‌ల్డ్ వైడ్‌గా విడుద‌లై సూప‌ర్‌హిట్ట‌యింది. మంచి క‌లెక్ష‌న్స్‌తో ర‌న్ అవుతున్న ఈ చిత్రాన్నిఎమ్మెల్యే ప‌రిటాల సునీత‌, ఆమె త‌న‌యుడు ప‌రిటాల శ్రీరామ్ హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో వీక్షించారు. షో అనంతరం...

ఎమ్మెల్యే ప‌రిటాల సునీత మాట్లాడుతూ ''ల‌య‌న్ చిత్రం చాలా బావుంది. రెండు షేడ్స్ లో బాల‌కృష్ణ అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌ప‌రిచారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో సిబిఐ ఆఫీసర్ పాత్ర‌లో ఆయ‌న చక్క‌ని పెర్‌ఫార్మెన్స్ చేశారు. సినిమా మంచి విజ‌యం సాధించినందుకు ఆనందంగా ఉంది. బాల‌కృష్ణ‌గారు మ‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను'' అన్నారు

నిర్మాత రుద్ర‌పాటి ర‌మ‌ణారావు మాట్లాడుతూ ''వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ నెల 14న విడుద‌లైన మా ల‌య‌న్ చిత్రం ఇటు అభిమానులను, ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ ముందుకు సాగుతుంది. క‌లెక్ష‌న్స్ స్ట‌డీగా సాగుతున్నాయి. ఇటువంటి మంచి సినిమాని చేసే అవ‌కాశం ఇచ్చిన బాల‌కృష్ణ‌గారికి ధ‌న్య‌వాదాలు. సినిమాని పెద్ద హిట్ చేసిన ప్రేక్ష‌కులకు, అభిమానులకు థాంక్స్'' అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved