pizza
Premikudu song launch at 92.7 Big FM
బిగ్ ఎఫ్.ఎమ్ లో ‘ప్రేమికుడు’ సాంగ్ రిలీజ్
You are at idlebrain.com > News > Functions
Follow Us

12 March 2016
Hyderabad

డిజి పోస్ట్ సమర్పణ లో ఎస్ ఎస్ సినిమా బ్యానర్ పై కళా సందీప్ బి ఏ దర్శకత్వంలో మానస్, సనమ్ శెట్టి హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న చిత్రం 'ప్రేమికుడు'. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాలో ఓ సాంగ్ బిగ్ ఎఫ్.ఎమ్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో మానస్, దర్శకుడు కళా సందీప్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బాలాజీ పాల్గొన్నారు.

లవ్ బ్యాక్ డ్రాప్ లో హృదయానికి హద్దుకునే ఫీల్ గుడ్ మూవీ లా చిత్రీకరించాం. ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రేమ అనేది మర్చిపోలేని అనుభూతి. అలాంటి ఒక అందమైన ప్రేమకధే 'ప్రేమికుడు'. ఈ చిత్రం చక్కని సంగీతంతో ఆహ్లాదంగా సాగిపోయే యూత్ ఫుల్ లవ్ స్టోరీ. ఈ కథలోని పాత్రలలో యువత తమని తాము చూసుకుంటారు. ప్రేమ స్వచ్చతకు అద్దంలా ఉండే మూవీ అని దర్శకుడు కళా సందీప్ బి.ఎ తెలిపారు. అలాగే మార్చి 13న హైదరాబాద్ రాక్ హైట్స్ లో ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరవుతున్నారని ఆయన తెలియజేశారు.

ఈ చిత్రానికి విజయ్ బాలాజీ సంగీతాన్ని సమకూర్చగా,శివ కె ఛాయాగ్రహణం, ఎడిటింగ్' కేరింత' మధు, అర్ కె డాన్సు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.


 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved