pizza
Animal Pre Release Event
Mahesh Babu and SS Rajamouli add charm to the already magnificent Animal Pre-Release event in Hyderabad
రణ్‌బీర్ కపూర్ నా ఫేవరేట్ యాక్టర్. ‘యానిమల్’ తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తుంది: యానిమల్ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు
You are at idlebrain.com > News > Functions
Follow Us


27 November 2023
Hyderabad

Film’s cast- Anil Kapoor, Ranbir Kapoor, Rashmika Mandanna, Bobby Deol, Producer Bhushan Kumar & Sandeep Reddy Vanga along with Pranay Reddy Vanga and Shiv Chanana were also present at the grand event

The grandeur of Animal has been reaching a new height with every passing day, and now with the pre-release event in Hyderabad, the team took things up a notch! The incredible cast of the film- Anil Kapoor, Ranbir Kapoor, Rashmika Mandanna, Bobby Deol, director Sandeep Reddy Vanga and producer Bhushan Kumar were joined by the maverick film director SS Rajamouli and superstar Mahesh Babu adding to the grandness of the event. It was a picture perfect moment for the cinema lovers across the country as it’s rare to see all the stalwarts under one roof.

Right from powerful dance acts and impressive performances by the musicians of the film, to the actors revisiting their journeys through some sweet videos, the event had it all. But this magnanimous event only got bigger when Mahesh Babu and SS Rajamouli joined the cast and spoke a few things about this Sandeep Reddy Vanga directorial Animal.

Animal is the magnum opus this year needed, and having stalwarts gracing the event only made it bigger increasing the anticipation for the film.

Bhushan Kumar and Krishan Kumar’s T-Series, Murad Khetani’s Cine1 Studios and Pranay Reddy Vanga’s Bhadrakali Pictures have backed Animal. The film is in the crime drama genre and promises to take viewers on a thrilling ride on 1st December 2023.

రణ్‌బీర్ కపూర్ నా ఫేవరేట్ యాక్టర్. ‘యానిమల్’ తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తుంది: యానిమల్ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు

రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'యానిమల్' ప్రమోషనల్ కంటెంట్ తో సెన్సేషన్ సృష్టించింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. 'యానిమల్'లో ర‌ణ్‌బీర్ క‌పూర్ కు జోడిగా ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ లో నిర్వహించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘యానిమల్‌’ కు మీరు ఇంతగా ఆదరణ చూపిస్తుంటే చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా ట్రైలర్‌ చూశా.. మెంటలొచ్చేసింది. ఇంత ఒరిజినల్ ట్రైలర్ నేను ఇప్పటివరకూ చూడలేదు. నేను ఎప్పుడూ ఇలా చెప్పను. మనస్పూర్తిగా ఫీలైతేనే చెబుతాను. సందీప్‌ ఫోన్‌ చేసి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆహ్వానించగానే రావాలనిపించింది. సందీప్ అంటే నాకు ఇష్టం. తను చాలా యునిక్, ఒరిజినల్ ఫిల్మ్ మేకర్. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఈ సినిమా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందని విన్నా. ఇది ప్రీ రీలిజ్ ఈవెంట్ లా లేదు. వందరోజుల వేడుకలా వుంది. ట్రైలర్‌లోని అనిల్‌ కపూర్‌ గారి నటన చూసిగూస్ బంప్స్ వచ్చాయి. బాబీ దేవోల్‌ యాక్టింగ్ స్టన్నింగ్ గా వుంది. రష్మిక అన్ని భాషల్లో నటిస్తోంది. ట్రైలర్ లో అద్భుతంగా వుంది. తన ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా వుంది. రణ్‌బీర్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయనతో ఈ విషయం ఎప్పుడో చెప్పా గానీ ఆయన సీరియస్ గా తీసుకోలేదు. అందుకే ఈ వేదికపై మరోసారి చెబుతున్నా. నేను తన అభిమానిని, రణ్‌బీర్‌ ఇండియాలో ది బెస్ట్‌ యాక్టర్‌ అని నా అభిప్రాయం. యానిమల్ ఇప్పటివరకూ తన బెస్ట్ వర్క్ అని నా భావన. ఈ సినిమా పెద్ద విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డిసెంబర్ 1న యానిమల్ విడుదలౌతుంది. తప్పకుండా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. యానిమల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అందరినీ ధన్యవాదాలు’’ తెలిపారు.

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. మన ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ ఎలా వుంటుందో మనకి తెలుసు. కానీ ముంబై నుంచి ఎవరైనా వచ్చినపుడు మా ప్రేక్షకులు ఇలా వుంటారని చూపించాలని అనిపిస్తుంటుంది. ఇవాళ రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, భూషణ్ కుమార్ ఈ వేదికపై వున్నారు. వారికి మీ అందరినీ ప్రేమ, ఆదరణ చూపించడం చాలా ఆనందంగా వుంది. ప్రతి ఏడాది కొత్త దర్శకులు వస్తారు, పెద్ద సినిమాలు తీస్తారు, విజయాలు అందుకుంటారు, చాలా పేరు సాధిస్తారు. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం ప్రేక్షకులని ఇండస్ట్రీనే కాదు సినిమా ఫార్ములాని కూడా షేక్ చేసే దర్శకులు వస్తారు. వొకప్పుడు రామ్ గోపాల్ వర్మ వచ్చారు. దాని తర్వాత ఈ ఫార్ములాని పక్కన పెట్టి సినిమా చేయగలనని నిరూపించిన దర్శకుడు సందీప్ వంగా. సందీప్ ని చూస్తుంటే చాలా గర్వంగా వుంది. యానిమల్ టీజర్ వచ్చిన వెంటనే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలనిపించింది. రణ్‌బీర్ కపూర్ ఇంటెన్స్ యాక్టర్. బాలీవుడ్ లో నా ఫేవరేట్ యాక్టర్ తను. తనలో చాలా ఇంటెన్సిటీ వుంటుంది. తన ప్రతిభ చూపించుకునే సినిమాలు చాలా తక్కువ పడ్డాయని నా అభిప్రాయం. యానిమల్ తో రణ్‌బీర్ కపూర్ ఇండస్ట్రీలో అగ్రస్థానంలోకి వెళ్తారని భావిస్తున్నాను. యానిమల్ కోసం టీం చాలా హార్డ్ వర్క్ చేసింది. చాలా అద్భుతంగా సినిమా వచ్చింది. డిసెంబర్ 1న అందరూ సినిమాని థియేటర్ లో చూడాలి’ అని కోరారు.

రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. నిర్మాతలు భూషణ్, ప్రణయ్, దిల్ రాజు, యానిమల్ చిత్ర యూనిట్ అందరికీ ధన్యవాదాలు. సందీప్ రెడ్డి వంగా చాలా స్పెషల్ డైరెక్టర్. ఆయనతో కలసి వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అనిల్ కపూర్ గారికి ధన్యవాదాలు. నేను నటుడిని అయితే నీ తండ్రి పాత్ర చేస్తానని ఆయన అనేవారు. ఆ కల ఈ సినిమాతో నిజమైయింది. రష్మిక బ్యూటీఫుల్ ఆర్టిస్ట్, పర్శన్. తనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. బాబీ డియోల్ ని లైఫ్ లాంగ్ ఇష్టపడుతూనే వుంటాను. రాజమౌళి గొప్ప హ్యూమన్ బీయింగ్. ప్రతి సినిమాని ఆయన సపోర్ట్ చేస్తారు. నేను కలసి మొదటి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఒక్కడు సినిమా చూసి ఆయనకి మెసేజ్ చేశాను. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది. డిసెంబర్ 1న యానిమల్ చిత్రాన్ని అందరూ థియేటర్ లో చూడాలి. అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.

సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. రాజమౌళి గారు మనందరికీ స్ఫూర్తి. మహేష్ బాబు గారు ఈ వేడుకకు రావడం చాలా అనందంగా వుంది. యానిమల్ ఇప్పటివరకూ చూడని తండ్రికొడుల బెస్ట్ లవ్ స్టొరీ. ప్రతి ఫ్రేం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. రన్బీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక, బాబీ ఇలా అద్భుతమైన తారాగణం తమ గొప్ప పెర్ఫార్మెన్స్ లతో అలరిస్తారు. డిసెంబర్ 1న అందరూ థియేటర్స్ కి వచ్చి ప్రతి ఫ్రేం ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఎక్స్ పీరియన్స్ మీకు ఎప్పుడూ కలిగివుండదు. ఇది నా ప్రామిస్. భూషణ్, ప్రణయ్ కి థాంక్స్. రన్బీర్ కపూర్ ఈ కథపై ఎంతో నమ్మకం ఉంచారు. మూడేళ్ళ జర్నీ చాలా అద్భుతంగా జరిగింది. ఇక సినిమా మీ చేతిల్లో వుంది. సినిమా బిగినింగ్, ఎండింగ్ మిస్ కావద్దు. తండ్రికొడుకుల గొప్ప ప్రేమకథ తీశానని భావిస్తున్నాను. మీ అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుతున్నాను’’ అన్నారు

రష్మిక మాట్లాడుతూ.. మహేష్ బాబు గారికి, రాజమౌళి గారికి ధన్యవాదాలు. వారు ఈ వేడుకకి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంతపెద్ద స్టార్స్ తో వేదిక పంచుకోవడం ఆనందంగా వుంది. యానిమల్ వైలెంట్ ఫిల్మ్ మాత్రమే కాదు.. మంచి ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్. చాలా అద్భుతమైన పాత్రలు, పెర్ఫార్మెన్స్ లు వున్నాయి. డిసెంబర్ 1న అందరూ యానిమల్ చూసి ఎంజాయ్ చేయండి’ అన్నారు.

నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. మహేష్ బాబు గారు, రాజమౌళి గారికి కృతజ్ఞతలు. రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక, బాబీ, సందీప్ అందరికీ థాంక్స్. అందరూ అద్భుతంగా చేశారు. సందీప్ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. డిసెంబర్ 1న అందరూ థియేటర్ లో యానిమల్ చిత్రాన్ని చూసి మమ్మల్ని ఆశీర్వాదించాలి’ అని కోరారు

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఇండియన్ సినిమాని గర్వపడేలా చేసిన రాజమౌళి గారికి మొత్తం పరిశ్రమ తరపున ధన్యవాదాలు. రాజమౌళి గారు , సుకుమార్, ప్రశాంత్ నీల్ .. ఇప్పుడు సందీప్ వంగా మన సినిమాని ఎక్కడికో తీసుకెళుతున్నారు. రన్బీర్ కపూర్ గారిని బ్రహ్మాస్త్రతో తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. ఇప్పుడు సందీప్ తో చేస్తున్న యానిమల్ తో బిగ్ ట్రెమండస్ రెవెన్యూస్ ఇస్తారు. ట్రైలర్ చూడగానే ఆ వైబ్ వచ్చింది. ఇండియన్ సినిమాలోనే యానిమల్ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది’ అన్నారు.

మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాజమౌళి, మహేష్ బాబు, రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, దిల్ రాజు, సందీప్ వంగా ఇలా బిగ్గెస్ట్ స్టార్స్ ఈ వేడుకలో వుండటం చాలా ఆనందంగా వుంది. మహేష్ బాబు గారి బిజినెస్ మ్యాన్ సినిమా చూసి నేను ఎంపీ అయ్యాను. మరో ఐదేళ్ళతో తెలుగు చిత్ర పరిశ్రమ యావత్ సినీ పరిశ్రమనే రూలింగ్ చేస్తుంది. రన్బీర్ కూడా హైదరాబాద్ షిఫ్ట్ కావాలి.(నవ్వుతూ). యానిమల్ తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. 500 కోట్లు పైగా వసూళ్ళు సాధిస్తుంది’’ అన్నారు

అనిల్ కపూర్ మాట్లాడుతూ..ఒక నటుడిగా నాకు జన్మనిచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమ, నామొదటి సినిమా వంశవృక్షం ది గ్రేట్ బాపు గారి దర్శకత్వంలో చేశాను. మళ్ళీ ఇప్పుడు యానిమల్ తో మీ ముందుకు వస్తున్నా. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చా. ఇది నాకు స్పెషల్ ఫీలింగ్. సందీప్ వంగా క్రేజీ, బ్రిలియంట్ దర్శకుడు. భూషణ్ గారు చిన్న వయసులోనే టీసిరిస్ సామ్రాజ్యాన్ని అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ యానిమల్ లో ఏం చేశారో తెరపై చూడాల్సిందే. రష్మిక అదృష్టం ఈ చిత్రానికి కావాలి. దాదాపు 43ఏళ్ల తర్వాత నేను చేసిన తెలుగు సినిమా ఇది. ఈ సినిమా బాబీ డియోల్ జీవితాన్ని మారుస్తుంది. మహేష్ బాబు గారితో ఎప్పటినుంచో మంచి అనుబంధం వుంది. మేమంతా ఒక ఫ్యామిలీలా వుంటాం. గ్లోబల్ సూపర్ డూపర్ డైరెక్టర్ రాజమౌళి గారు మనందరినీ గర్వపడేలా చేశారు. వారు ఈ వేడుకకు రావడం చాలా అనందంగా వుంది. డిసెంబర్ 1న ‘యానిమల్’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది''అన్నారు

బాబీ డియోల్ మాట్లాడుతూ..తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా అనందంగా వుంది. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. దర్శకుడు సందీప్ వంగా, టీసిరిస్ కు ధన్యవాదాలు. మహేష్ బాబు, రాజమౌళి గారు ఈవేడుకలో వుండటం ఆనందంగా వుంది. మహేష్ బాబు గారు మొదటి సినిమా ముహూర్తానికి నేను హజరయ్యాను. అప్పుడు వారి స్టూడియోలోనే ఓ సినిమా చేస్తున్నా. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. యానిమల్ ని డిసెంబర్ 1న అందరూ చూడాలి' అని కోరారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ మిగతా సభ్యులు పాల్గున్నారు.

 

Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved