pizza
Rakshaka Bhatudu pre-release function
`ర‌క్ష‌క‌భ‌టుడు` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

07 May 2017
Hyderabad

ర‌క్ష‌, జ‌క్క‌న్న వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాలు త‌ర్వాత ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ ద‌ర్శ‌క‌త్వంలో సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై ఎ.గురురాజ్ నిర్మించిన చిత్రం `ర‌క్ష‌క‌భ‌టుడు`. కంటెంట్‌ను హీరోగా పెట్టి ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ చేసిన ఈ చిత్రం మే 12న విడుదలకానుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత ఎ.గురురాజ్‌, ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ‌, రిచా ప‌న‌య్‌, బాహుబలి ప్ర‌భాక‌ర్‌, రామ్‌జ‌గ‌న్‌, మ‌ధు, జ్యోతి, కృష్ణేశ్వ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ - ``ర‌క్ష‌క‌భ‌టుడు సినిమా మే 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం తెర వెనుక టెక్నిషియ‌న్స్‌, తెర‌పై ఆర్టిస్టులు అంద‌రూ రాత్రింబ‌గ‌ళ్ళు ప‌నిచేశారు. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌నే స‌స్పెన్స్ అల్రెడి విడిపోయింది. అలాగే మా ర‌క్ష‌క‌భ‌టుడు సినిమాలో ఆంజ‌జేయు స్వామి గెట‌ప్ వేసిన హీరో ఎవ‌ర‌నే సస్పెన్స్ కూడా మ‌రో ఐదు రోజుల్లో తీరిపోతుంది. గ్రాఫిక్స్ మిళిత‌మైన సినిమా ఇది. కామెడి, హర్ర‌ర్‌, స‌స్పెన్స్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌ని కోరుకంటున్నాను`` అన్నారు.

Richa Panai Glam gallery from the event

వంశీకృష్ణ ఆకెళ్ళ మాట్లాడుతూ - ``రక్ష‌క‌భ‌టుడు సినిమా టైటిల్ మా సినిమాకు కుద‌ర‌డం మా అదృష్టంగా బావిస్తున్నాం. మంచి ఎన‌ర్జీ ఉన్న టైటిల్‌. లెజెండ్ క్యారెక్ట‌రైజేష‌న్ ఆంజనేయ‌స్వామి ఈ సినిమాలో కీల‌క‌పాత్రలో క‌నిపిస్తాడు. ఆయ‌నే ఈ సినిమాకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌నిచేయ‌డం నా పూర్వ‌జ‌న్మ సుకృతం. ప్రీ ప్రొడ‌క్ష‌న్ స‌మ‌యం కంటే ముందు నుండి చాలా మంది నాకు ఎంతో స‌పోర్ట్ చేస్తూ వ‌స్తున్నారు. వారిలో దిల్‌రాజు, శిరీష్‌, ఎం.ఎస్‌.రాజుగారు అంద‌రూ ఎంక‌రేజ్ చేస్తూ వ‌చ్చారు. అలాగే ఈ సమయంలో న‌న్ను ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన గ్రేట్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్‌వ‌ర్మ‌గారిని మ‌ర‌చిపోలేను. బ్ర‌హ్మానందం వంటి సీనియ‌ర్ ఆర్టిస్ట్ నీకు ఎలా కావాలంటే అలా చేస్తాను అంటూ ఈ సినిమా సమ‌యంలో చెప్ప‌డం గొప్ప విష‌యం. సినిమాటోగ్రాఫ‌ర్ మల్హ‌ర్‌భ‌ట్ జోషి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ చంద్ర‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ రాజీవ్ నాయ‌ర్ ఇలా అంద‌రూ టెక్నిషియ‌న్స్‌తో పాటు నిర్మాణ, నిర్వ‌హ‌ణ జె.శ్రీనివాస‌రాజుగారు ఎంతో స‌హ‌కారం అందించారు. ఇక న‌టీన‌టుల్లో హీరోయిన్ రిచాప‌న‌య్ చాలా మంచి పాత్ర‌లో క‌నిపిస్తుంది. కంటెంటే హీరోగా స్టార్ట్ అయిన మా సినిమాలో ధ‌న‌రాజ్‌, ప్ర‌భాక‌ర్‌, సుప్రీత్ ఇలా అంద‌రూ స‌పోర్ట్‌తో మంచి అప్లాజ్ వ‌చ్చింది. మోష‌న్ పోస్ట‌ర్‌. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆంజ‌నేయస్వామి గెట‌ప్‌లో ఓ స్టార్ హీరో న‌టించారు. ఆయ‌నెవ‌ర‌నేది మే 12న తెలిసిపోతుంది. మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కంతో ఉన్నాం`` అన్నారు.

రిచా ప‌న‌య్ మాట్లాడుతూ - ``సినిమాలో చాలా మంచి పాత్ర‌లో క‌నిపించాను య‌ముడికి మొగుడు త‌ర్వాత మ‌రో మంచి పాత్ర చేసే అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ‌గారికి, నిర్మాత గురురాజ్‌గారికి థాంక్స్‌. మే 12న సినిమా రిలీజ్ అవుతుంది`` అన్నారు.

రిచాపన‌య్‌, బ్రహ్మానందం, బాహుబలి ప్రభాకర్‌, బ్రహ్మాజీ, సుప్రీత్‌ (కాట్రాజు), అదుర్స్‌ రఘు, ధనరాజ్‌, నందు, చిత్రం శ్రీను, సత్తెన్న, జ్యోతి, క ష్ణేశ్వర్‌రావు, మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: మల్హర్‌ భట్‌ జోషి, ఆర్ట్‌: రాజీవ్‌నాయర్‌, ఎడిటింగ్‌: అమర్‌ రెడ్డి, ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాష్‌, నిర్మాణ, నిర్వహణ: జె. శ్రీనివాసరాజు, ప్రొడ్యూసర్‌: ఎ.గురురాజ్‌, రచన, దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved