pizza

Vikram Pre Release Event
క‌మ‌ల్ సార్‌ లో దశావతారాలు కాదు. శతావతారాలు కనపడతాయి - తొలి పాన్ ఇండియా స్టార్ క‌మ‌ల్ సారే- విక్ట‌రీ వెంక‌టేష్

You are at idlebrain.com > News > Functions
Follow Us


31 May 2022
Hyderabad

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం స‌మ‌కూర్చారు. జూన్ 3న విడుద‌ల‌కానున్న'విక్రమ్ ప్రీ రిలీజ్ వేడుక మంగ‌ళ‌వారం రాత్రి హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో అభిమానులు, శ్రేయోభిలాషుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది.

ఈ సందర్భంగా జరిగిన ‘విక్రమ్‌: హిట్‌ లిస్ట్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంక‌టేష్ మాట్లాడుతూ –క‌మ‌ల్ సార్ విక్ర‌మ్ ఫంక్ష‌న్‌ కు ర‌మ్మ‌న్నారు అంటే రాకుండా ఎవ‌ర‌న్నా వుంటారా? అంతేగా! అంటూ ఫ్యాన్స్‌ను ఉత్తేజ‌ప‌రిచారు. క‌మ‌ల్‌ సార్ న‌ట‌న‌కు 60 ఏళ్ళు. కానీ మ‌న‌స్సు 16 ఏళ్ళ వ‌య‌స్సు.. కమల్‌ గారి ‘పదినారు వయదినిలే’ (పదహారేళ్ల వయసు) చూసిన తర్వాత నేను క్లీన్‌ బౌల్డ్ అయ్యాను. ఆయ‌న మాత్రం ఇంకా 16 ఏళ్ళ వ‌య‌స్సులో వుండిపోయారు. ‘మరో చరిత్ర’ ప్రతి యాక్టర్‌ కు జీపీఎస్‌. లాంటి సినిమా. ఇక ‘దశావతారం’ చూస్తే అలాంటి సినిమా చేయాలంటే ఓ యాక్టర్‌ కూ ధైర్యం సరిపోదు. ఆయ‌న నాకు అపూర్వ స‌హోద‌రులు.లాంటివారు. ‘ఏక్‌ దూజే కేలియే’తో ఆయన ఫస్ట్‌ పాన్‌ ఇండియా స్టార్‌. ఈ రోజు కమల్‌ గారు గ్లోబల్‌ స్టార్‌. క‌మ‌ల్ సార్ లో యూనిక్ క్వాలిటీ వుంది. కె.విశ్వ‌నాథ్‌, బాల‌చంద‌ర్ వంటివారే కాదు క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్లు, యంగ్ డైరెక్ట‌ర్లు ఆయ‌న‌తో ప‌నిచేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతారు. నాయ‌గ‌న్ సినిమా ఆయ‌న న‌ట‌న‌కే నాయ‌గ‌న్ చేసేసింది. ద‌క్షిణాది సినిమాలో రెండు శకాలు ఉంటే.. ఒకటి కమల్‌హాసన్‌ గారికి ముందు.. మరొకటి కమల్‌ గారు వచ్చిన తర్వాత. ఆయ‌న వ‌చ్చాక అన్ని స్ట‌యిల్స్ మార్చేశారు. యాక్టర్, డైరెక్టర్, రైటర్, సింగర్, కొరియోగ్రాఫర్, పొలిటీషియన్, మంచి మానవతావాది.. ఇలా చెబితే.. దశావతారాలు కాదు.. ఆయనలో శతావతారాలు కనపడతాయి. నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. యాక్ష‌న్‌, కామెడీ చేశాను. సెంటిమెంట్ చేయాలంటే గ‌ణేష్‌, ధ‌ర్మ‌చ‌క్రం. కానీ నాకు ఎక్క‌డైనా సీన్‌ లో బ్లాంక్ వ‌స్తే క‌మ‌ల్ హాస‌న్ ఎక్సె్ప్రెష‌న్స్‌ చూసి చేస్తాను. ఈరోజు చాలా ఆనందంగా వుంది. లోకేష్ క‌న‌క‌రాజ్‌ కు థ్యాంక్స్‌. క‌మ‌ల్‌ సార్‌ తో ఓ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేయాలని ఉంది. నితిన్‌, సుధాక‌ర్‌రెడ్డిగారు ఈ సినిమాను విడుద‌ల‌చేస్తున్నారు. జూన్ 3న వ‌స్తుంది. అంద‌రూ చూడాలి అన్నారు.

యూనివర్సల్ హీరో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ – ‘‘దాదాపు 45 ఏళ్ల క్రితం ఏయన్నార్‌ గారి ‘శ్రీమంతుడు’ సినిమాకు డ్యాన్స్‌ అసిస్టెంట్‌ గా హైదరాబాద్‌ వచ్చాను. అప్పట్నుంచి నేను తెలుగు ఫుడ్‌ తింటున్నాను. తెలుగులో నాకు ప్రేక్ష‌కులు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. నేను ఇది ఒంట‌రిగా చేసింది కాదు. నా కుటుంబం ప్రోత్సాహంతో ద‌ర్శ‌కుడుని అయ్యాను. మిగిలిన క్రాఫ్ట్‌ ను చేశాను. డైరెక్టర్‌ బాలచందర్‌గారితో నేను 36 సినిమాలు చేశాను. అదే నా పీహెచ్‌డీ. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నా స్టైల్, రజనీకాంత్‌ స్టైల్‌ ఆయన్నుంచే వచ్చాయి. న‌గేష్‌ గారి స్ట‌యిల్‌కూడా బాలచందర్‌ గా రు చెప్పిందే.

వెంకీగారి వెనుక రామానాయుడుగారు వున్నారు. అయినా వెంకీ గారు కూడా చాలా హార్డ్ వ‌ర్క్ చేశారు. వెంకీ గారు గోవాకు వ‌చ్చారు. ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కు వచ్చారా? అన్నాను. మిమ్మల్ని చూడటానికి వచ్చానన్నారు. అప్పుడు ఓ మాట అన్నారు. నాకు స‌క్సెస్ వ‌చ్చింది. ఏం చేయాల‌ని అడిగారు. నాకు తెలిసింది చెప్పాను. ఆయనకు మరో వేవ్ వ‌చ్చింది. ఇప్పుడు నా బ్రదర్‌ ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను, వెంకీగారు ‘మర్మయోగి’ సినిమా చేయాల్సింది. ఫొటో షూట్ కూడా చేశాం. ఆ సినిమా చేసి ఉంటే మా కెరీర్‌ లో మంచి హిట్‌గా నిలిచి ఉండేది. ‘విక్రమ్‌’ సినిమాకు మంచి టీమ్‌ కుదిరింది. త‌మిళ్‌, తెలుగు ర‌చ‌యిత‌లు లిప్‌ సింక్ అన్నీ చ‌క్క‌గా కుదిరేలా చేశారు. స్ట్రెయిట్ సినిమాలు, డ‌బ్బింగ్ సినిమా చేశాను. కానీ గీత ర‌చ‌యిత‌గా రాయ‌డం చాలా క‌ష్టం. అలాంటి వీరులు మా సినిమాకు ప‌నిచేశారు. సుధాక‌ర్ రెడ్డిగారు విక్ర‌మ్ ఫ్యామిలీ అయినందుకు చాలా ఆనందంగా వుంది. స‌క్సెస్‌కాదు. ప్లీజ్ ట్రై అండ్ మేక్ హిట్ అని సుధాక‌ర్‌రెడ్డిగారికి చెప్పాను. త‌మిళ్‌ లో చాలా సినిమాలు చేశాను. తెలుగులో కొన్నే చేశాను. అన్నీ హిట్ చేశారు ప్రేక్ష‌కులు. ప్ర‌తిసారీ హిట్ కోసం ట్రై చేస్తున్నాను. విక్ర‌మ్ కూడా మీ చేతుల్లోనే వుంది. ఒంట‌రిగా ఏదీ ఎవ‌రూ చేయ‌లేరు. మంచి ద‌ర్శ‌కుడు, పంపిణీదారులు కూడా ఒంట‌రిగా చేయ‌లేరు. దానికి ప్రేక్ష‌కులు బ‌లం కావాలి. అది జూన్ 3న మీరు ఇస్తార‌ని ఆశిస్తున్నాను.

ఇక అనిరుద్‌ ను చూస్తే చిన్న పిల్లాడు. కానీ మాట్లాడితే అమితాబ్ వాయిస్‌ లా వుంటుంది. ఆయ‌న మ్యూజిక్ చాలా పెద్ద‌ది.. ఇళ‌య‌రాజాగారు బ్యాక్ గ్రౌండ్ బాగా ఇస్తారు. అనిరుద్ అంత‌టివాడు. నితిన్‌ కు ఒక‌టే చెబుతున్నాను. క‌మ‌ల్ ని చూసి నేర్చుకోకు.. వెంకీని చూసి నేర్చుకోండి. వెంకీలా హార్డ్ వ‌ర్క్ చేస్తే నువ్వు సూప‌ర్ స్టార్ అవుతావు. నాయుడుగారి లాంటి ఫాద‌ర్ వుంటే నేను స్పాయిల్ అయ్యేవాడిని. చెన్నై చాలామంది తెలుగువారిని ఇచ్చింది. అందులో వెంకీ ఒక‌రు. ఇక ఈ సినిమాలో విజ‌య్‌సేతుప‌తి, ఫాజిల్ బాగా న‌టించారు. కాంపీటీష‌న్‌ గా చేశారు.

విక్ర‌మ్ సినిమా హిట్‌ మీ (ప్రేక్షకులు) చేతుల్లోనే ఉంది. డైరెక్టర్‌ లోకేశ్‌ గారు నాలాగే (బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా) ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలాంటివారిని నేను మరింత గౌరవిస్తాను. ఇండియన్‌ ఫిల్మ్స్‌... పాన్‌ ఇండియా చాలదు.. పాన్‌ వరల్డ్‌. అది ప్రేక్షకులు సహకారం లేకుండా జరగదు. మంచి సినిమాలు ఇవ్వండని మీరు డిమాండ్‌ చేయాలి. ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. నేను మంచి సినిమాకు అభిమానిని. మీరు కూడా అలాగే వుండాల‌నేది నా కోరిక‌. ఇది యాక్ష‌న్ ప్యాక్డ్ సినిమా. అందులో ఎవ‌రికీ ఎటువంటి ఇబ్బంది క‌లుగకుండా చేశాం. అది ఫ‌స్ట్ ఎచీవ్‌మెంట్ ద‌ర్శ‌కుడు, యాక్షన్ మాస్ట‌ర్ వ‌ల్లే సాధ్య ప‌డింది. మా సెట్లో ఒక ప్ర‌మాదం జ‌రిగింది. కానీ అలా జ‌ర‌గాల్సిందికాదు. ఈ సినిమాకు రాత్రి, ప‌గ‌లు క‌ష్ట‌ప‌డి చేశాం. దుబాయ్‌, చెన్నై టూర్ వెళుతున్నాను. సినిమా స‌క్సెస్ చేశాక మ‌ర‌లా వ‌చ్చేలా మీరే చేయాల‌ని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు లోకేశ్‌ కనగరాజ్ మాట్లాడుతూ, విక్ర‌మ్ ఇప్పుడు కంప్లీట్ ఫైన‌ల్ మిక్సింగ్ అయిపోయింది. చాలా అద్భుతంగా వ‌చ్చింది. ఈ వేడుక‌కు వ‌చ్చిన వెంక‌టేస్‌ కు, నితిన్‌ కు థ్యాంక్స్‌. తెలుగు ఆడియ‌న్స్‌కు ధ‌న్య‌వాదాలు. నా మొద‌టి సినిమా నుంచి మీరు ప్రోత్స‌హిస్తున్నారు. విక్ర‌మ్ కూడా అలానే చేస్తార‌ని ఆశిస్తున్నాను. జూన్ 3న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాలో కమల్‌ గారి అద్భుతమైన యాక్షన్‌ను మీరు చూస్తారు ' అన్నారు

సంగీత ద‌ర్శ‌కుడు అనిరుద్ మాట్లాడుతూ, క‌మ‌ల్ గారి ల‌వ్ అండ్ ఎఫెక్ష‌న్ సినిమాలోనూ క‌నిపిస్తుంది. విక్ర‌మ్‌ లో నేప‌థ్య‌సంగీతం క‌థ‌ప‌రంగా హైలైట్ కానుంది. ఇది నాకు చాలా స్పెష‌ల్ మూవీ. క‌మ‌ల్ సార్‌ కు థ్యాంక్‌యూ.`అన్నారు.

నితిన్ మాట్లాడుతూ, కమల్‌హాసన్‌గారు ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా. ఆయ‌న రేర్ పీస్‌. మాస్ట‌ర్ పీస్‌. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న్ను ఎవ‌రూ బీట్ చేయ‌లేరు. ఈ సినిమాను తెలుగులో మా సంస్థ విడుద‌ల‌చేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. ఎ.ఆర్‌. రెహ‌మాన్ త‌ర్వాత నాకు ఇష్ట‌మైన సంగీత ద‌ర్శ‌కుడు అనిరుద్‌. నా ఫోన్‌ లో ప్లే లిస్ట్‌ లో అన్నీ త‌న పాట‌లే వుంటాయి. మంచి ఫ్రెండ్‌. ఆయ‌న‌తో సినిమా చేయ‌బోతున్నా. ద‌ర్శ‌కుడు లోకేశ్‌ గారి ఖైదీ నా ఫేవ‌రేట్‌. ఖైదీ, మాస్ట‌ర్ కంటే పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఫ్యాన్స్ కి నచ్చే సినిమా తీస్తే అఖండ‌, గ‌బ్బ‌ర్ సింగ్, భీష్మ అవుతుంది. ఫ్యాన్‌కు హీరోను ఎలా చూపాలో తెలుసు. లాస్ట్ వీక్ వెంకీమామ ఎఫ్‌3తో సూప‌ర్ హిట్ కొట్టారు. జూన్‌3న తెలుగులో విడుద‌ల‌చేస్తున్న మా విక్ర‌మ్ కు ఆ హిట్ ను మాకు కూడా అందించాల‌ని చ‌మ‌త్క‌రించారు. రాజ్‌క‌మ‌ల్ ఫిలింస్ కి థ్యాంక్స్‌. క‌మ‌ల్ గారి గురించి మాట్లాడే స్థాయిలేదు. ఇండియ‌న్ సినిమాలో లెజెండ్‌. ఆయ‌న చేసిన ప్ర‌యోగాలు ఎవ్వ‌రూ చేయ‌లేరు. సెల్యూట్ చేస్తున్నా.అన్నారు.

‘‘తెలుగులో ‘విక్రమ్‌’ను రిలీజ్‌ చేసే చాన్స్ ఇచ్చినందుకు కమల్‌గారికి థ్యాంక్స్‌' అన్నారు సుధాకర్‌ రెడ్డి.

గీత ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి మాట్లాడుతూ, క‌మ‌ల్ సార్‌ కు నేను పెద్ద ఫ్యాన్‌ ను. ఆయ‌న విక్ర‌మ్ సినిమాలో పాట‌లు రాసే అదృష్టం నాకు ద‌క్కింది. ఆయ‌న యాక్ష‌న్‌, న‌ట‌న కొల‌మానాలు లేనివి. ఆయ‌న మ‌రింత ఉజ్వ‌లంగా వెల‌గాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

నేను సినిమాల్లో కి రావ‌డానికి మీరే స్పూర్తి - హ‌రీశ్ శంక‌ర్
హ‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ, వెంకీ గారికి థ్యాంక్స్‌. ప్రేమ సినిమాను మ‌ళ్ళీ చేస్తే మీరే చేయాల‌నిపిస్తుంది. ఇక క‌మ‌ల్‌సార్ గురించి చెప్పాలంటే చాలా క‌ష్టం. ఆక‌లిరాజ్యం, భార‌తీయుడు, స్వాతిముత్యం చూస్తే ఎన్నో భావాలు వుంటాయి. మాట్లాడ‌డానికి భాష స‌రిపోదు. వెస్ట్‌ లో ఆల్‌బెర్ట్ ఎలా వున్నారో. ఇండియాలో క‌మ‌ల్ సార్ వున్నార‌ని గ‌ర్వంగా చెప్పుకుంటా. మీరు వెస్ట్‌లో పుట్టివుంటే వంద‌రెట్లు పేరు వ‌చ్చేదని భావిస్తున్నా. గ‌బ్బ‌ర్‌సింగ్ షూటింగ్ లో వుండ‌గా శ్రుతిహాస‌న్‌ గారిని అడిగేవాడిని. క‌మ‌ల్‌సార్‌.. ద‌ర్శ‌క‌త్వం చేస్తే ఎలా చేస్తారు. ఎలా ప్రిపేర్ అవుతారు. ఆయ‌న డైట్ ఏమిటి? అని అడిగితే నాన్న‌గారి గురించి చెప్పేదికాదు. ఓన్లీ సినిమా అనేది. త‌న‌తో ప‌ని చేసేట‌ప్పుడు మీతోనే చేశాన‌ని అనుకున్నాను. మీరు ఎన్ని సినిమాలు చేసినా ప్ర‌తి కుటుంబంలోనూ మీరు వున్నారు. నేను సాగ‌ర‌సంగ‌మం చాలాసార్లు చూశాను. భార‌తీయుడు చూశాక సినిమాల్లోకి రావాల‌ని కోరిక క‌లిగింది. భార‌తీయుడు ఫంక్ష‌న్‌ కు సికింద్రాబాద్ థియేట‌ర్‌ లో జ‌రిగితే లోప‌లికి రాలేక బ‌య‌టే వున్నాను. కానీ ఈరోజు మీ ఫంక్ష‌న్‌ కు రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఆక‌లిరాజ్యంలో ఓ డైలాగ్ వుంటుంది. ఎలాగొలా బ‌త‌కాలంటే బ‌త‌కొచ్చు. కానీ ఇలా బ‌త‌కాలంటే ఇలానే వుండాలి అన్న డైలాగ్ న‌చ్చింది. మీరు ఇలాగే వుండాలి. లోకేస్ వ‌ర్క్ చాలా ఇష్టం. ట్రెండ్‌ ను బ్రేక్ చేశారు. క‌ల‌మ్‌సార్‌ తో చేయ‌డం అదృష్టం మీకు. ఇందాక‌.. ప‌త్తాలే ప‌త్తాలే.. సాంగ్ చూశాక జ‌ల‌సీ వ‌చ్చింది. లోకేష్‌, అనిరుద్‌ కు థ్యాంక్స్ చెబుతున్నాను అన్నారు.

వెంకీ కుడుముల మాట్లాడుతూ, క‌మ‌ల్‌ సార్ మాకు ఆద‌ర్శం. ఆయ‌న ముందు మాట్లాడే అవ‌కాశం వ‌స్తుంద‌ని అస్స‌లు అనుకోలేదు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం వ‌ల్ల వ‌చ్చింది. నితిన్‌ కు థ్యాంక్స్‌. వెంక‌టేష్‌గారికి థ్యాంక్స్‌. విక్ర‌మ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

శైలేష్ కొల‌ను మాట్లాడుతూ, చిన్న‌ప్ప‌టినుంచి క‌మ‌ల్‌సార్‌ సినిమాలు చూసి పెరిగాను. అపూర్వ స‌హోద‌రులు చూశాక ఎంతో నేర్చుకున‌నాను. హే రామ్ చూశాక నేను ఫిలిం మేకింగ్‌ను అర్థం చేసుకోవాల‌ని ఆలోచ‌న వ‌చ్చింది. అందుకే ఈ రంగంలోకి వ‌చ్చాను. స్టూడెంట్స్‌కు విక్ర‌మ్ గైడ్ ఎలాంటిదో హే రామ్ ఔత్సాహిక ద‌ర్శ‌కుల‌కు అలాంటిది. ర‌చ‌న‌లోకూడా నాకు ఆద‌ర్శం. నా కొడుకుకు అభ‌య్ అనే పేరు పెట్టుకున్నాను. ఇలా మీ ముందు మాట్లాడే అవ‌కాశం క‌లిగినందుకు చెప్ప‌లేని ఆనందం క‌లిగింది అన్నారు.

 


Photo Gallery

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved