pizza
Aaradugula Bullet release on 9 June
'అరగడుల బుల్లెట్‌' ప్రెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

27 May 2017
Hyderabad

గోపీచంద్‌, నయనతార జంటగా బి.గోపాల్‌ దర్శకత్వంలో జయ బాలాజీ రియల్‌ మీడియా పతాకంప రూపొందుతోన్న ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'అరడుగుల బుల్లెట్‌. ఈ సినిమా జూన్‌ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

నిర్మాత తాండ్ర రమేష్‌ మాట్లాడుతూ - ''మా అరడుగుల బుల్లెట్‌ సినిమా కోసం హీరో, హీరోయిన్‌ సహా నటీనటులు, టెక్నిషియన్స్‌కు థాంక్స్‌.

అబ్బూరి రవి మాట్లాడుతూ - ''గోపీచంద్‌ యాక్షన్స్‌, ఎమోషన్స్‌ ఎలా ఉంటాయో ప్రేక్షకులకు తెలిసిందే. అవన్నీ సినిమాలో ఉంటాయి. అలాగే వక్కంతం వంశీగారు, బి.గోపాల్‌గారి ఆలోచనలు కలగలిసిన సినిమా ఇది. ఓ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని, కుటుంబమే ఆస్థి అని నమ్మే ఓ హీరో క్యారెక్టర్‌. ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ముందు నిలబడి చాతీ చూపించే హీరోగా గోపీచంద్‌ కనపడతారు. ఇంటర్వెల్‌ బ్లాక్‌, సెకండాఫ్‌లో ఓ బ్లాక్‌ నాకు చాలా ఇష్టం. ఆ రెండూ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతాయి'' అన్నారు.

బి.గోపాల్‌ మాట్లాడుతూ - ''అరడుగుల అందగాడైన గోపీచంద్‌కు తగిన టైటిల్‌ అని అందరూ అంటున్నారు. టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ట్రైలర్‌ కూడా బావుందని అంటున్నారు. నేను మాస్‌ సినిమాలే చేస్తానని అంటారు కానీ, నా సినిమాల్లో చాలా మంచి కామెడి ఉంటుంది. నా సినిమాల్లో అన్ని ఎలిమెంట్స్‌ ఉండేలా చూసుకుంటాను. గోపీచంద్‌, నయనతార, ప్రకాష్‌రాజ్‌, అభిమన్యుసింగ్‌ సహా పెద్ద క్యాస్ట్‌ ఉంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. పివిపి వరప్రసాద్‌గారు మాకు అండ దండగా నిలబడ్డారు. వక్కంతం వంశీ మంచి కథను ఇస్తే అబ్బూరి రవి చక్కటి మాటలు రాశారు. మణిశర్మగారు అద్భుతమైన మ్యూజిక్‌ అందించారు. గోపీచంద్‌ చాలా మంచి హీరో. జూన్‌ రెండో వారం సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. మా యూనిట్‌కు ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

గోపీచంద్‌ మాట్లాడుతూ - ''గోపాల్‌గారి దర్శకత్వంలో సినిమా చేయాలని నాకు చాలా రోజుల కోరిక. బుజ్జిగారి నిర్మాణంలో గోపాల్‌గారితో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు. తర్వాత ఓ రోజు గోపాల్‌గారు ఫోన్‌ చేసి వక్కంతం వంశీ మంచి కథ చెప్పారు. వినమన్నారు. నేను కథ విన్నాను. గోపాల్‌గారితో ఇలాంటి కథనే చేయాలనుకున్నాను. వంశీ అద్భుతంగా కథను నెరేట్‌ చేశారు. రవి ఎమోషన్స్‌ సీన్స్‌కు అద్భుతంగా డైలాగ్స్‌ రాశారు. గోపాల్‌గారు పెద్ద పెద్ద హీరోలతో పనిచేశారు కదా, ఎలా ఉంటుందోనని అనుకున్నాను. కానీ ఆయన చాలా కూల్‌ పర్సన్‌. అన్ని సీన్స్‌ బాగా వచ్చాయి. కొన్ని కారణాలతో సినిమా డిలే అయినా జూన్‌ 9న సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. నయనతార లవ్‌లీ క్యారెక్టర్‌లో నటించింది. మణిశర్మగారు మంచి ట్యూన్స్‌తోపాటు మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. గోపాల్‌గారి నుండి ఎలాంటి సినిమాను ఎక్స్‌పెక్ట్‌ చేస్తారో అలాంటి సినిమా ఇది. ఈ సినిమా ఈ స్టేజ్‌కు రావడానికి కారణమైన పివిపిగారికి థాంక్స్‌'' అన్నారు.

ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అభిమన్యు సింగ్, చలపతిరావ్, సలీం బేగ్, ఉత్తేజ్, జయప్రకాష్ రెడ్డి, ఫిరోజ్ అబ్బాసి, రమాప్రభ, సురేఖావాణి, సన, సంధ్యా జనక్, మధునందన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, ఫైట్స్: కనల్ కణ్ణన్, సినిమాటోగ్రఫీ: బాల మురుగన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర్రావు, ఆర్ట్: నారాయణ రెడ్డి, నిర్మాత: తాండ్ర రమేష్, దర్శకత్వం: బి.గోపాల్.Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved