pizza
Abhishek Pictures press meet about Kabali
జూలై 22న నైజాంలో క‌బాలి చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 July 2016
Hyderabad

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా క‌లైపులి థాను స‌మ‌ర్ప‌ణ‌లో ష‌ణ్ముక ఫిలింస్ బ్యాన‌ర్‌పై పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో కె.పి.చౌద‌రి, కె.ప్ర‌వీణ్‌కుమార్ వ‌ర్మ నిర్మాత‌లుగా రూపొందిన చిత్రం `క‌బాలి` ఈ చిత్రం జూలై 22న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను నైజాం ఏరియాలో అభిషేక్ పిక్చ‌ర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

కె.పి.చౌద‌రి మాట్లాడుతూ ``క‌బాలి చిత్రాన్ని నైజాం ఏరియాలో అభిషేక్ పిక్చ‌ర్స్‌వారు విడుద‌లై చేయ‌డం ఆనందంగా ఉంది. ఇండ‌స్ట్రీలో అంద‌రూ క‌బాలి విష‌యంలో బాగా స‌పోర్ట్ చేశారు. తెలుగు రైట్స్‌ను 30 కోట్ల‌కు కోనుగోలు చేశాం. అంద‌రూ ఊహించిన విధంగానే సినిమాకు విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. బిజినెస్ కూడా బాగా అవుతుంది. సినిమా రిలీజ్ కంటే ముందే సంధ్య థియేట‌ర్ వారు ప్రీ రిలీజ్ బుకింగ్ ఓపెన్ చేస్తే మూడు రోజుల‌కు టికెట్స్ అయిపోయాయ‌ని చెబుతున్నారు. స‌పోర్ట్ చేస్తున్న అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

అభిషేక్ మాట్లాడుతూ ``ష‌ణ్ముక ఫిలింస్ బ్యాన‌ర్‌పై క‌బాలి చిత్రాన్ని తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో నైజాంలో 333 థియేట‌ర్స్ లో విడుద‌ల చేస్తున్నాం. సినిమాఈ నెల 22న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. సంధ్య‌లాంటి థియేట‌ర్స్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పూర్త‌య్యాయి. తెలుగు, త‌మిళం, హిందీ భాషల్లో సినిమాను అభిషేక్ పిక్చ‌ర్స్ పై రిలీజ్ చేస్తున్నాం. అలాగే కార్తికేయ డిస్ట్రిబ్యూట‌ర్స్ కూడా ఈసినిమా విడుద‌ల విష‌యంలో స‌పోర్టివ్‌గా ఉండ‌టం ఆనందంగా ఉంది`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved