pizza
American Telugu Tv logo launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

30 March 2015
Hyderabad

హైదరాబాద్‌లో పుట్టి పెరిగి అమెరికాలో పారిశ్రామిక వేత్తగా ఎదిగిన మధుసూదనరెడ్డి 2007లో ‘అమెరికన్‌ తెలుగు టి.వి.’ ప్రారంభించారు. అమెరికాలో వుండే తెలుగు వారికి టైమ్‌ అనేది డిఫరెంట్‌గా వుండడం వల్ల వారికి అందుబాటులో వుండే ప్రోగ్రామ్స్‌ చెయ్యడం కష్టమవుతోందని భావించిన మధుసూదనరెడ్డి. అందుకే అమెరికన్‌ తెలుగు టెలివిజన్‌ ఆన్‌ డిమాండ్‌ని ప్రారంభిస్తున్నారు. ఇది పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో నడిచే టి.వి. ఈ టి.వి. ద్వారా ఫుడ్‌ ప్రోగ్రామ్స్‌, కాంటెస్ట్‌లు, షార్ట్‌ ఫిలింస్‌, సీరియల్స్‌.. లాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ని టెలికాస్ట్‌ చెయ్యబోతున్నారు. పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా వారికి నచ్చిన టైమ్‌, నచ్చిన ప్రోగ్రామ్స్‌ చూసే వీలుంది. ఈ టి.వి.ని ఇండియా, యు.ఎస్‌.ఎ., ఆస్ట్రేలియాలలో ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆఫీసులు హైదరాబాద్‌, చెన్నయ్‌లలో వుంటాయి. అమెరికన్‌ తెలుగు టి.వి.కి సంబంధించిన లోగో లాంచ్‌ సోమవారం హైదరాబాద్‌లోని నోవోటెల్‌ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్ట్‌ భగీరథ, అమెరికన్‌ తెలుగు టి.వి. అధినేత మధుసూదనరెడ్డి, పబ్లిసిటీ డిజైనర్‌ ధని ఏలే పాల్గొన్నారు. మధుసూదనరెడ్డి ‘అమెరికన్‌ తెలుగు టి.వి. లోగోను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా..

భగీరథ: హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మధుగారికి చాలా స్పష్టమైన ఆలోచనలు వున్నాయి. ఒక వ్యక్తి కంటే ఒక వ్యవస్థగా అంటే అమెరికన్‌ తెలుగు టి.వి. తరఫున ఆయన ఏమనుకుంటున్నారో, ఏం చెయ్యాలన్న బలమైన ఉద్దేశంతో వున్నారో చాలా కార్యక్రమాలు ఆయన మనసులో వున్నాయి. ఈరోజు అమెరికన్‌ తెలుగు టి.వి. లాంచ్‌ మాత్రమే. తర్వాత ప్రోగ్రామ్స్‌ వుంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా కార్యక్రమాలు రూపొందించాలన్నదే మధుగారి ఆలోచన. ఆయన ఆలోచనలతో నేను కూడా ఏకీభవించాను కాబట్టే మీ తరఫున నేను కూడా వుంటాను, మంచి ప్రోగ్రామ్స్‌, జనాన్ని ఎడ్యుకేట్‌ చేసే ప్రోగ్రామ్స్‌ చేద్దామని చెప్పాను. దానికి ఆయన కూడా ఒప్పుకున్నారు. 2007లో అమెరికన్‌ తెలుగు టి.వి. అనే పేరుని రిజిష్టర్‌ చేశారు కాబట్టి అదే పేరుని కంటిన్యూ చెయ్యడం జరుగుతోంది. ఇది పేరు కోసమో, వ్యాపారం కోసమో ఇండియాలో ప్రారంభిస్తున్న టి.వి. కాదు. ఒక పర్పస్‌తో ప్రజలకు జరిగిన నష్టాల్ని ఈ టి.వి. ద్వారా చెప్పాలన్న ఆలోచన ఆయనది.

మధుసూదనరెడ్డి: 2007లో అమెరికన్‌ తెలుగు టి.వి.ని స్టార్ట్‌ చేశాం. అక్కడ లోకల్‌ ప్రోగ్రామ్స్‌ చేసేవాళ్ళం. అప్పుడు అక్కడ తెలుగు టి.వి.లుగానీ, లైవ్‌ టెలికాస్ట్‌లు కానీ లేవు. ఇక్కడిలా కంటిన్యూగా ప్రోగ్రామ్స్‌ చెయ్యడానికి అక్కడ వీలు లేదు. చాలా ఖర్చుతో కూడుకున్నది. 2007కి, ఇప్పటికి చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు ఇష్టమైన ప్రోగ్రామ్‌ మొబైల్‌లోగానీ, ఐ ప్యాడ్‌లోగానీ, ల్యాప్‌లోగానీ ఎక్కడైనా చూడొచ్చు. అందుకే మేం వాల్యూ బేస్డ్‌ కంటెంట్‌ని ప్రొవైడ్‌ చెయ్యాలనుకుంటున్నాం. దాని వల్ల ప్రజలు వారికి వీలుగా వున్న టైమ్‌లో, వారికి నచ్చిన టైమ్‌లో ప్రోగ్రామ్స్‌ చూసే వీలు కలుగుతుంది. ఒక ప్రోగ్రామ్‌ టి.వి.లో టెలికాస్ట్‌ అయిపోయింది. మళ్ళీ చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ ప్రోగ్రామ్స్‌ అన్నీ మా సర్వర్‌లో వుంటాయి. పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా చూడొచ్చు. యాక్చువల్‌గా ఇప్పుడు లాంచ్‌ అనేది అనుకోలేదు. నేను ఇండియా వచ్చాను కాబట్టి భగీరథగారు, డిజైనర్‌ ధని ఏలేగారు వున్నారు కాబట్టి ఈ లాంచ్‌ ప్రోగ్రామ్‌ని చేస్తున్నాం. ధనిగారు చాలా టాలెంట్‌ వున్న డిజైనర్‌. మనకు వున్న ఐడియా ఏదైనా చెప్తే దాన్ని డెవలప్‌ చేసి మంచి డిజైన్‌ చెయ్యగల కెపాసిటీ ఆయనకు వుంది. ఈ టి.వి.లో ఏమేం ప్రోగ్రామ్స్‌ చెయ్యబోతున్నామనేది త్వరలోనే తెలియజేస్తాం. మొదటగా ఒక సింగింగ్‌ కాంపిటిషన్‌ పెట్టాలన్న ఆలోచన వుంది. ఇప్పటివరకు మీరు ఎన్నో సింగింగ్‌ కాంపిటిషన్‌ ప్రోగ్రామ్స్‌ చూసి వుంటారు. వాటికి భిన్నంగా సమ్‌థింగ్‌ న్యూ అన్నట్టుగా మేం ప్రోగ్రామ్‌ చెయ్యబోతున్నాం. ఇంతకుముందు చాలా ప్రోగ్రామ్స్‌ ప్లాన్‌ చేసి దానికి సంబంధించి కొంత వర్క్‌ కూడా చేశాం. మనం చేస్తున్న ప్రోగ్రామ్స్‌ ఇప్పటి ట్రెండ్‌కి సరిపోదు అనిపించింది. అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఒక ఖచ్చితమైన ఆలోచనకి వచ్చాం. అందుకే ఆన్‌ డిమాండ్‌ ప్రోగ్రామ్స్‌ చెయ్యాలన్న ఆలోచనకి వచ్చాం. ఇక నుంచి మా సొంత కంటెంట్‌తో కొత్త తరహా కార్యక్రమాలు రూపొందిస్తాం. అమెరికన్‌ తెలుగు టి.వి.కి సంబంధించి బ్రీఫ్‌గా చెప్పదలుచుకున్నది ఇది. అమెరికాలో వున్నవారు ఇక్కడి ఛానల్స్‌ ఏం చూపిస్తే అదే చూడాలి. మేం క్రిటిసైజ్‌ చేయడానికి వీలు లేదు. కానీ, మేం బాధపడతాం. వాళ్ళు ఒకటి చెప్తారు, జరిగేది వేరేలా వుంటుంది. అమెరికాలో మాదిరిగా ఎవరినైనా తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరిలా ఎందుకు చేస్తున్నారని స్ట్రెయిట్‌గా అడగరు. డిస్కషన్స్‌లో నలుగురైదుగురు కూర్చుంటారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ వుంటారు తప్ప ఏమీ జరగదు. మనం ఏం చెయ్యదలుచుకున్నాం, మన గురించి ప్యూచర్‌ జనరేషన్‌ వాళ్ళు ఏం అనుకుంటారు అనే దృష్టితో ఇప్పటివరకు ఎవరూ ప్రోగ్రామ్స్‌ చెయ్యలేదు. రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. 1960 ముందు ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. 1960లో పుట్టినవారు ఇప్పటికి పెద్దవారు అయిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో పుట్టారు. కలిసి వున్నారు. విడిపోవాలని ఎవరు చెప్పారు అంటే మాకు తెలీదు, మాకు తెలీదు అంటారు. ఇదంతా ఎవరు చేశారు అంటే మాకు తెలీదు అంటారు. అందుకే అలాంటి ఒక ప్రోగ్రామ్‌ చెయ్యాలని అనుకున్నాం. 2008లో ఆటా వరల్డ్‌ కోసం చాలా డబ్బులు ఖర్చుపెట్టాం. అలా చెయ్యడం వేస్ట్‌ అని మాకు తర్వాత తెలిసింది. అలా వెళ్తూ వుంటే ఒక్కో ప్రోగ్రామ్‌ తయారవుతూ వుంటుంది. మేం చేసిన ప్రోగ్రామ్స్‌ చూసిన తర్వాత మీ స్పందన తెలుసుకుంటాం.

ధని ఏలే: మధుగారు నాకు పదేళ్ళుగా పరిచయం. మధుగారు నాతో మొదట ‘తెలుగు సినిమా పీపుల్‌ ఛాయిస్‌ అవర్స్‌’ అనే లోగో చేయించారు. అది ఎలా వుండాలన్నది మధుగారు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్‌ చేశారు. అందరూ అంత క్లారిటీతో చెప్పలేరు. ఆయన ఎలా వుండాలో ఎక్స్‌ప్లెయిన్‌ చేయడం వల్ల మంచి ఔట్‌పుట్‌ వచ్చింది. ఇప్పుడు అమెరికన్‌ తెలుగు టి.వి. లోగో కూడా నేనే డిజైన్‌ చేశాను. ఈ సందర్భంగా మధుగారికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్తున్నాను. .

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved