pizza
Anando Brahma motion poster launch
`ఆనందో బ్ర‌హ్మ‌` మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

28 May 2017
Hyderabad

70 ఎం.ఎం.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై తాప్సీ, శ్రీనివాస‌రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, తాగుబోతు ర‌మేష్ త‌దిత‌రులు తారాగ‌ణంగా మ‌హి వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి నిర్మాత‌లుగా రూపొందుతోన్న హార్ర‌ర్ కామెడి చిత్రం `ఆనందో బ్ర‌హ్మ‌`. ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. మోష‌న్ పోస్ట‌ర్‌ను నిర్మాత‌ల్లో ఒక‌రైన విజ‌య్ చిల్లా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

ద‌ర్శ‌కుడ మ‌హి వి.రాఘ‌వ్ మాట్లాడుతూ - ``ఇది కామెడి హార్ర‌ర్ చిత్రం. సాధార‌ణంగా దెయ్యాల‌ను చూసి మ‌నుషులు భ‌య‌ప‌డుతుంటారు. కానీ మ‌నుషుల‌ను చూసి దెయ్యం ప‌డితే ఎలా ఉంటుంద‌నేదే సినిమా క‌థ‌. తెలుగులో తాప్సీ ఒక సంవ‌త్స‌రం క్రిత‌మే సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించింది. ఇందులో తాప్సీ మెయిన్ క్యారెక్ట‌ర్ చేస్తే వెన్నెల‌కిషోర్‌, శ్రీనివాస‌రెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్ ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు. సినిమా షూటింగ్ పూర్తయ్యింది`` అన్నారు.

Glam gallery from the event

సుధీర్ బాబు మాట్లాడుతూ - ``నాకు ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ మంచి పేరు తీసుకొచ్చింది. చాలా మంది ఆ సినిమాకు సీక్వెల్ చేస్తామ‌ని నా దగ్గ‌ర‌కు వ‌చ్చారు. అయితే అంతలా న‌వ్వించిన సినిమా త‌ర్వాత మ‌ళ్ళీ అలాంటి సినిమానే చేస్తే ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోన‌ని అనుకున్నాను. విజ‌య్ సినిమా స్టార్ట్ చేసిన‌ప్పుడు కూడా నేను అలాగే అనుకున్నాను. సినిమా అవుట్ పుట్ చేశాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌లా అంద‌రినీ న‌వ్వించే సినిమా. ఆ సినిమా కంటే ఆనందో బ్ర‌హ్మ ఇంకా బావుంది. విజ‌య్, శ‌శిలు హండ్రెడ్ పర్సెంట్ సినిమాల‌పై ప్యాష‌న్‌తో ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు`` అన్నారు.

తాప్సీ మాట్లాడుతూ - ``నాకు చిన్న‌, పెద్ద సినిమాల‌ని తేడాలుండ‌వు. కాన్సెప్ట్ న‌చ్చాలంతే. ఆనందో బ్ర‌హ్మ సినిమా విష‌యానికి వ‌స్తే ఇది హీరోయిన్ సెంట్రిక్ మూవీ కాదు. మంచి క‌థాబ‌లం ఉన్న సినిమా. నేను తెలుగు సినిమాల‌కు ఎప్పుడూ దూరం కాలేదు. మంచి సినిమాల కోసం వెయిట్ చేస్తున్నానంతే. ఈ సినిమాతో తెలుగులో నా ల‌క్ ట‌ర్న్ అవుతుంద‌ని అనుకుంటున్నాను`` అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ - ``ఈ సినిమా చేయ‌డానికి ముందు 30 క‌థ‌ల‌ను విన్నాం. మ‌హి మా ద‌గ్గ‌ర‌కు క‌థ చెబుతాన‌ని వ‌చ్చిన‌ప్పుడు మంచి హ‌ర్ర‌ర్ క‌థ‌తో సినిమా చేయాల‌ని ఉంద‌ని చెప్పాం. ఆయ‌న కూడా నా వ‌ద్ద హ‌ర్ర‌ర్ క‌థే ఉంద‌ని మ‌హి చెప్పాడు. త‌ను చెప్పిన క‌థ కొత్త‌గా అనిపించింది. తాప్సీ సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకోవ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved