pizza
Budugu release on 17 April
You are at idlebrain.com > News > Functions
Follow Us

07 April 2015
Hyderabad

ఏప్రిల్ 17న వస్తున్న 'బుడుగు'..!
లక్ష్మీ మంచు, మాస్టర్‌ ప్రేమ్‌బాబు ప్రధాన పాత్రల్లో హైదరాబాద్‌ ఇన్నోవేటీస్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై మన్‌మోహన్‌ దర్శకత్వంలో భాస్కర్‌, సారికా శ్రీనివాస్‌ నిర్మించిన హార్రర్‌ థ్రిల్లర్‌ ‘బుడుగు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్‌ 17న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నటుడు శ్రీధర్‌రావు, మాస్టర్‌ ప్రేమ్‌బాబు, బేబీ డాలీ, నిర్మాత భాస్కర్‌, దర్శకుడు మన్‌మోహన్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీధర్‌రావు మాట్లాడుతూ "ఒక మంచి కథతో చేసిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి థ్రిల్‌ అవుతారు. ఈ సినిమా చెయ్యడం ద్వారా మా డైరెక్టర్‌గారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమా కోసం అన్ని డిపార్ట్‌మెంట్స్‌వారు ఎంతో కృషి చేశారు. అందరం ఒక ఫ్యామిలీలా పనిచేశాం. ఫైనల్‌గా ఒక మంచి సినిమా చేశామన్న తృప్తి మాకు కలిగింది" అన్నారు.

దర్శకుడు మన్‌మోహన్‌ మాట్లాడుతూ "మా సినిమా ఫస్ట్‌ కాపీ వచ్చింది. ముంబాయిలోని అనురాగ్‌శర్మగారికి ఈ సినిమాని ప్రదర్శించాం. సినిమా చూసి ఆయన ఎంతో ప్రశంసించారు. చెన్నయ్‌లోని మీడియా మ్యాజిక్‌ వారికి కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించడం జరిగింది. వారు ఈ చిత్రాన్ని తమిళ్‌లో రీమేక్‌ చెయ్యబోతున్నారు. ఈ సినిమా మీద మేం చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ, ఆర్ట్‌ చాలా ప్లస్‌ అయింది. చాలా రిచ్‌గా సినిమా వచ్చింది. అలాగే సాయికార్తీక్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్‌ అని చెప్పాలి. ముఖ్యంగా రీరికార్డింగ్‌ చాలా అద్భుతంగా చేశాడు. అన్నింటినీ మించి లక్ష్మీ మంచుగారి క్యారెక్టర్‌ అందర్నీ అలరిస్తుంది. ప్రేమ్‌బాబు పెర్‌ఫార్మెన్స్‌ గురించి చెప్పాలంటే ఒక ప్రకాష్‌రాజ్‌, పృథ్విరాజ్‌ వంటి ఆర్టిస్టులతో అతని పెర్‌ఫార్మెన్స్‌ని కంపేర్‌ చెయ్యవచ్చు. ఏప్రిల్‌ 17న విడుదలవుతున్న ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుంది" అని తెలిపారు.

మాస్టర్ ప్రేమ్‌బాబు మాట్లాడుతూ "బుడుగు టైటిల్‌ రోల్‌ నేనే చేశాను. ఇంత వండర్‌ఫుల్‌ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్‌ అంకుల్‌కి థాంక్స్‌ చెప్తున్నాను. అందరం ఎంతో హార్డ్‌ వర్క్‌ చేశాం. తప్పకుండా ఈ సినిమా బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది" అని చెప్పారు.

నిర్మాత భాస్కర్‌ మాట్లాడుతూ "మా డైరెక్టర్‌ మన్‌మోహన్‌ తను ఏదైతే చెప్పాడో దాన్ని అద్భుతంగా విజువలైజ్‌ చేసి చూపించారు. ఆర్టిస్టుల నుంచి హండ్రెడ్‌ పర్సెంట్‌ పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకున్నారు. తల్లి పాత్ర పోషించిన లక్ష్మీ మంచుగారికి ఆమె కెరీర్‌లో ది బెస్ట్‌ మూవీ అవుతుంది. అలాగే ప్రేమ్‌బాబు ఎంతో సెటిల్డ్‌గా తన క్యారెక్టర్‌ని చేశాడు. ఈ సినిమాకి అవార్డులు వస్తాయని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాం. అలాగే ప్రేమ్‌బాబుకి కూడా అవార్డు వస్తుందనుకుంటున్నాం" అన్నారు.

లక్ష్మీ మంచు, ఇంద్రజ, శ్రీధర్‌రావు, మాస్టర్‌ ప్రేమ్‌బాబు, బేబీ డాలీ, సన, ఇందు ఆనంద్‌, శైలజావాణి, అల్తాఫ్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: సురేష్‌ రఘుతు, ఎడిటింగ్‌: శ్యామ్‌ మేనగ, ఆర్ట్‌: ఎ.రామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వంశీ పులూరి, సమర్పణ: సుధీర్‌.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved