pizza
Chaari 111 Press Meet
Chaari 111 Is a Fun Film, Will Be Enjoyed By Everyone: Producer Aditi Soni
'చారి 111' మంచి ఫన్ ఫిల్మ్... ఇందులో వెన్నెల కిశోర్ కామెడీని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు : నిర్మాత అదితి సోనీ 
You are at idlebrain.com > News > Functions
Follow Us


27 February 2024
Hyderabad

Vennela Kishore is awaiting the release of Chaari 111 which is hitting the theaters on the 1st of March. The film is produced by Aditi Soni. The lead cast and crew interacted with the media on the occasion of release.

Ramajogayya Sastry said "There is only one song in the film and I was entrusted with the job of penning the lyrics for it. It was a pleasant experience to work with Simon K King. Vennela Kishore is a loved actor and he will make everyone laugh.

Director Keerthi Kumar said "Vennela Kishore is an excellent performer and he will offer a hilarious ride for the audience with Chaari 111. This spy action comedy will entertain everyone. Vennela Kishore is busy with consecutive film shootings and hence he couldn't attend the press meet."

Producer Aditi Soni said "Chaari 111 is my first film as a producer and it was an enjoyable experience right from the start. Vennela Kishore is a brilliant actor and so as the rest of the clead cast. Murali Sharma, Thagubothu Ramesh, Satya and others delivered refined performances. I hope the audience will enjoy watching this film."

Female lead Samyuktha Viswanathan thanked the produced and the crew for entrusting her with her debut film. She thanked the entire cast and crew for their cooperation during the filming.

Music director Simon K King said it was a pleasurable experience working on the film. He said he wishes to make more films with producer Aditi Soni in the future.


'చారి 111' మంచి ఫన్ ఫిల్మ్... ఇందులో వెన్నెల కిశోర్ కామెడీని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు : నిర్మాత అదితి సోనీ


'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన సినిమా 'చారి 111'. 'మళ్ళీ మొదలైంది' ఫేమ్ టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వంలో బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మించారు. సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా, మురళీ శర్మ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మార్చి 1న థియేటర్లలో సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర బృందం విలేకరుల సమావేశం నిర్వహించారు.

సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ... ''ఈ సినిమాలో ఒక్కటే పాట ఉంది. అది రాసే బాధ్యత నాకు అప్పగించారు. నన్ను నమ్మి దర్శక నిర్మాతలు వచ్చారు. సంగీత దర్శకుడికి మన భాష కాదు. దర్శకుడు కీర్తి యాడ్ ఫిలిమ్స్ నుంచి వచ్చారు. ఈ పాట రాయడానికి మూడు నెలల సమయం తీసుకున్నా. వెంటనే రాయలేక కాదు... నన్ను నమ్మి రావడంతో అద్భుతంగా రాయాలని కృషి చేశా. సైమన్ కె కింగ్ మంచి బాణీ ఇచ్చారు. మంచి సాహిత్యం కుదిరింది. మార్చి 1న సినిమా విడుదల అవుతోంది. అందరూ వెళ్లి చూడాలని కోరుతున్నా. వెన్నెల కిశోర్ ప్రేక్షకులు అందరికీ ఇష్టమైన నటుడు. ఆయన తప్పకుండా నవ్విస్తారు'' అని అన్నారు.

దర్శకుడు టీజీ కీర్తీ కుమార్ మాట్లాడుతూ... ''నేను తెలుగు వాడిని. బెంగళూరులో పదేళ్లు యాడ్ ఫిలిమ్స్ చేసి సినిమాల్లోకి వచ్చా. 'చారి 111'కి ముందు 'మళ్ళీ మొదలైంది' సినిమా చేశా. అందులో వెన్నెల కిశోర్ గారు కమెడియన్ రోల్ చేశారు. ఆయనకు అప్పుడే ఈ సినిమా కథ చెప్పా. ఆయనకు నచ్చడంతో సినిమా స్టార్ట్ చేశాం. ఆయన ఫెంటాస్టిక్ కమెడియన్. ఆయనకు ఫ్యాన్ నేను. ఆయనకు టైలర్ మేడ్ క్యారెక్టర్ చారి. ఇదొక స్పై యాక్షన్ కామెడీ జానర్ ఫిల్మ్. కమర్షియల్ సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుంది. నేను రామ జోగయ్య శాస్త్రి గారి సాహిత్యానికి పెద్ద 'మళ్ళీ మొదలైంది' సినిమాలో పాటలు రాయించుకోవాలని అనుకున్నా. కానీ, కుదరలేదు. ఈ సినిమాతో కుదిరింది. థీమ్ సాంగ్ అద్భుతంగా రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ సైమన్ కె కింగ్, నేను బీటెక్ బ్యాచ్‌మేట్స్. కాలేజీలో చదుకోవడం తప్ప కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ చేశాం. మంచి మ్యూజిక్, రీ రికార్డింగ్ ఇచ్చాడు. సంయుక్తా విశ్వనాథన్ యాక్షన్ కూడా చేసింది. లాస్ట్ బట్ నా లీస్ట్... మా నిర్మాత అదితి గారు. ఆవిడ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తారు. కంటెంట్ రిచ్ సినిమాలు తీయాలని వచ్చారు. ముందు మే నెలలో సినిమా విడుదల చేయాలని అనుకున్నాం. నెల రోజుల ముందు మార్చి 1కి షిఫ్ట్ చేశాం. వెన్నెల కిశోర్ గారు బిజీ ఆర్టిస్ట్. వరుస షూటింగ్స్ ఉండటంతో ప్రెస్‌మీట్‌కి రాలేకపోయారు'' అని అన్నారు. 

నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ... ''నిర్మాతగా నా తొలి సినిమా ఇది. సంథింగ్ డిఫరెంట్, కొత్తగా ట్రై చేశాం. ఫెంటాస్టిక్ టీం కుదిరింది. సినిమాలో పాటకు రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. వెన్నెల కిశోర్ గారికి నేను పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. మార్చి 1న మా సినిమా విడుదల అవుతోంది. ప్రేక్షకులు అందరూ తప్పకుండా థియేటర్లకు వెళ్లి చూస్తారని ఆశిస్తున్నాను. మంచి ఫన్ ఫిల్మ్ ఇది. ఎంజాయ్ చేస్తారు'' అని అన్నారు. 

సంయుక్తా విశ్వనాథన్ మాట్లాడుతూ ''తెలుగులో నాకు తొలి అవకాశం ఇచ్చిన మా నిర్మాత అదితి సోని, దర్శకుడు కీర్తీ కుమార్, హీరో వెన్నెల కిశోర్ గారికి థాంక్స్. మా 'చారి 111' వెరీ కూల్ ఫిల్మ్. వెన్నెల కిశోర్ గారు బ్రిలియంట్ యాక్టర్. ఫెంటాస్టిక్ కమెడియన్. మురళీ శర్మ గారు, బ్రహ్మాజీ గారు, రాహుల్ రవీంద్రన్ గారు, తాగుబోతు రమేష్ గారు, సత్య గారు... మంచి నటులతో పని చేసే అవకాశం లభించింది. మా సినిమాలో ఒక్కటే పాట ఉంది. దానికి రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. సంజిత భట్టాచార్య అద్భుతంగా పాడింది. 'చారి 111'లో నేను స్టంట్స్ చేశారు. మా స్టంట్ మాస్టర్ కరుణాకరణ్ గారు, నాకు ట్రైనింగ్ ఇచ్చిన రాము గారికి థాంక్స్. నెక్స్ట్ ప్రెస్‌మీట్‌లో తెలుగులో మాట్లాడతాను. ప్రేక్షకులు అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను'' అని చెప్పారు. 

మ్యూజిక్ డైరెక్టర్ సైమన్ కె కింగ్ మాట్లాడుతూ ''నా స్నేహితుడు కీర్తి కుమార్ దర్శకత్వం వహించిన సినిమాకు మ్యూజిక్ అందించడం చాలా సంతోషంగా ఉంది. వెన్నెల కిశోర్ గారు అద్భుతమైన నటుడు. ఆయనతో పని చేయడం గ్రేట్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్. తమిళంలో సంయుక్తా విశ్వనాథన్ చేసిన సాంగ్‌ యూట్యూబ్‌లో వైరల్‌ అయ్యింది. ఈ సినిమాలో ఆమె స్టంట్స్ బాగా చేసింది. అదితి సోని గారితో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు.


 

Photo Gallery

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved