pizza
Charu Seela Promotional Song launch
'చారుశీల' ప్రమోషనల్‌ సాంగ్‌ రిలీజ్
You are at idlebrain.com > News > Functions
Follow Us

29 August 2016
Hyderaba
d

జ్యోత్స్న ఫిలింస్‌ బ్యానర్‌పై ప్రముఖ సీనియర్‌ దర్శకుడు సాగర్‌ నిర్మాతగా, సినిమాటోగ్రాఫర్‌ శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'చారుశీల'. బ్రహ్మానందం, రష్మీ, రాజీవ్‌ కనకాల, జశ్వంత్‌ ప్రధాన పాత్రలుగా ఈ సినిమా రూపొందుతోంది. సెప్టెంబర్‌లో సినిమాను రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషనల్‌ సాంగ్‌ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. బ్రహ్మానందం ప్రమోషనల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. నటుడు రాజీవ్‌ కనకాల టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా....

సాగర్‌ మాట్లాడుతూ ''1990లో స్టీఫెన్‌ కింగ్‌ రచించిన మిసెరీ అనే నవల ఆధారంగా తెలుగు నెటివిటీతో రూపొందిన సినిమా ఇది. మధ్యలో కొన్ని న్యాయపరమైన సమస్యలు ఎదురైనా కోర్టు తీర్పుతో ఆ అడ్డంకులు తొలిగిపోయాయి. సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఏ భాషలో అయినా తీయగల సబ్జెక్ట్‌ ఇది. ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురి చేయడం జరుగుతుంది'' అన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ ''శ్రీనివాస్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్‌ నుండి దర్శకుడిగా మారి చేసిన తొలి చిత్రమిది. ఇందులో మంచి పాత్ర చేశాను. చిన్న సినిమాలు, బడ్జెట్‌ సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్న తరుణంలో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ ''సినిమా కోసం శ్రీనివాస్‌రెడ్డిగారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఎగ్జయిట్‌మెంట్‌, థ్రిల్లింగ్‌గా సాగే చిత్రమిది. రష్మీ చాలా మంచి నటి. అద్భుతంగా నటించింది. నేను నటించిన సినిమాల్లో నటుడిగా నాకు సంతృప్తినిచ్చిన సినిమా అని చెప్పగలను'' అన్నారు.

శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ ''1990లో రాయబడ్డ నవల హాలీవుడ్‌లో కూడా ఈ నవల ఆధారంగా సినిమా తీశారు. ఆస్కార్‌ అవార్డులు కూడా వచ్చాయి. దాన్ని ఆధారంగా మన తెలుగు నెటివిటీకి తగిన మార్పులు చేర్పులు చేసి తీసిన సినిమా. మధ్యలో కొన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాం. సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేస్తాం'' అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: కుమార్‌ మల్లారపు, ఎడిటింగ్‌: నాగిరెడ్డి, సంగీతం: సుమన్‌ జూపూడి, ఆర్ట్‌: బాబ్జి, నిర్మాతలు: సాగర్‌, శిద్దిరెడ్డి జయశ్రీ అప్పారావు, కథ, స్క్రీన్‌ప్లే, యాక్షన్‌, దర్శకత్వం: శ్రీనివాస్‌ ఉయ్యూరు.

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved