pizza
We didn't attack Puri Jagan, say distributors
పూరి జగన్ పై దాడి చేయడమనేది అవాస్తవం – డిస్ట్రిబ్యూటర్స్ ముత్యాల రాందాస్, అభిషేక్ శ్రీధర్, సుధీర్
ou are at idlebrain.com > News > Functions
Follow Us

18 April 2016
Hyderabad

లోఫ‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్స్ అభిషేక్, ముత్యాల రాందాసు, సుధీర్ లు తనపై దాడి చేశారని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వారిపై నిన్న పోలీసులకు పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాము పూరి జగన్ పై ఎటువంటి దాడి చేయలేదని, సదరు ముగ్గురు నిర్మాతలు హైదరాబాద్ లో జరిగిన మీటింగ్ లో తెలియజేశారు.

ముత్యాల రాందాసు మాట్లాడుతూ ‘’ లోఫ‌ర్ సినిమాని నైజాంలో అభిషేక్ పిక్చ‌ర్స్ పంపిణీ చేస్తే నేను తూర్పు గోదావ‌రి జిల్లాలో పంపిణి చేశాను. పూరి జ‌గ‌న్నాథ్, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం.అలాంటిది మాపై ఎందుకు కేసులు పెట్టాడో అర్ధం కావ‌డం లేదు. నైజాం లో లోఫ‌ర్ సినిమాకి రెండున్న‌ర కోట్లు న‌ష్టం వ‌చ్చింది. ఈ విష‌యాన్ని మూడు నెల‌ల క్రితం పూరికి చెబితే ఆయన నిర్మాత సి.క‌ళ్యాణ్ గార్నిఅడ‌మన్నారు. ఆత‌ర్వాత పూరి పై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. కానీ..మేము దాడి చేసాం అంటూ ఫిర్యాదు చేయ‌డం ఎంత వ‌ర‌కు కరెక్ట్. మాపై ఆరు సెక్ష‌న్ ల కింద కేసు పెట్టారు. ఇలా కేసులు పెట్ట‌డం క‌రెక్ట్ కాదు. పోలీసులు ఎలాంటి ఆధారాలు చూడ‌కుండా కేసులు పెట్ట‌డం బాధాక‌రం. గ‌తంలో జానీ సినిమా ఫ్లాప్ అయిన‌ప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్, బాబా ప్లాప్ అయితే ర‌జ‌నీకాంత్, ఆగ‌డు సినిమా ఫ్లాప్ అయిన‌ప్పుడు మ‌హేష్ బాబు, సికింద‌ర్ ఫ్లాప్ అయితే సూర్య డిస్ట్రిబ్యూట‌ర్స్ కి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించి ఆదుకున్నారు. అలాగే డైరెక్ట‌ర్స్ వినాయ‌క్, శ్రీను వైట్ల కూడా డిస్ట్రిబ్యూట‌ర్స్ కి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించారు. లోఫ‌ర్ సినిమా విష‌యంలో పూరి జ‌గ‌న్నాథ్ కూడా ఈ విష‌యం పై ఆలోచించి స్పందిస్తే బాగుంటుంది’’ అన్నారు.

డిస్ట్రిబ్యూట‌ర్ శ్రీధర్ మాట్లాడుతూ హార్ట్ ఎటాక్ సినిమాకి సంబంధించిన ట్యాక్స్ స‌ర్టిఫికెట్ విష‌య‌మై పూరితో మాట్లాడామే తప్ప ఎలాంటి బ్లాక్ మెయిల్ చేయ‌లేదు. కానీ మేం వారిపై దాడి చేస్తున్నట్లు మాపై అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తూ త‌ప్పుడు కేసులు పెట్టారు, ఎటువంటి విచారణ చేయకుండా ఏకపక్షంగా కేసులెలా తీసుకుంటారోఅదెంత వరకు న్యాయమే పోలీసులే చెప్పాలి. ఒకవేళ నిజంగానే మేము దాడి చేసి ఉంటే పూరి జ‌గ‌న్నాథ్ ఆఫీస్ లో సిసి కెమెరాలు ఆధారాలు ఉండాలి కదా ఒకవేళ మేం త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిస్తే ఎలాంటి శిక్ష వేసినా అనుభ‌విస్తాం. అలా కాకుండే మేం దాడి చేయలదేదని తెలితే మేం పూరి కేసు వేయడానికి సిద్ధం’’ అన్నారు.

సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ ‘’ఏ సినిమా అయినా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూట‌ర్ ఇర‌వై శాతం మాత్ర‌మే రిస్క్ తీసుకుంటాడు. యాభైశాతం న‌ష్టం వ‌స్తే నిర్మాత కానీ, ద‌ర్శ‌కుడు కానీ, హీరో కానీ న‌ష్ట ప‌రిహారం చెల్లించాలి. నిర్మాత న‌ష్టాల్లో ఉంటే డిస్ట్రిబ్యూట‌ర్ ద‌ర్శ‌కుడు ద‌గ్గ‌ర‌కే వెళ‌తారు. అయితే మా డిస్ట్రిబ్యూట‌ర్స్ పూరి ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేదు. పోలీసులు ఈ విష‌యం పై విచార‌ణ జ‌రిపి మా డిస్ట్రిబ్యూట‌ర్స్ త‌ప్పు ఉంటే శిక్షించండి. మా వాళ్ల త‌ప్పులేక‌పోతే పూరి పై యాక్ష‌న్ తీసుకోవాలి’’ అన్నారు.


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved