pizza
Golmaal Gullu Press Meet
'గోల్‌మాల్ గుల్లు' ప్రెస్ మీట్‌
ou are at idlebrain.com > News > Functions
Follow Us

11 April 2016
Hyderabad

హైద‌రాబాద్ మూవీస్ సూప‌ర్‌స్టార్ గుల్లుదాదా(అద్నాస్ సాజిద్ ఖాన్‌) తెలుగు సినిమాలో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. దావూద్ మూవీ ద‌ర్శ‌కుడు రాజేష్  పుత్ర దర్శ‌క‌త్వంలో డిక్కి ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్ ఫిలిం బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోన్న చిత్రం `గోల్‌మాల్ గుల్లు`. ఈ సినిమా ప్రెస్‌మీట్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్రమంలో 

డైరెక్ట‌ర్ రాజేష్ పుత్ర మాట్లాడుతూ ``కామెడి అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌. తెలుగు, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నాం. ఈ చిత్రంతో గుల్లుదాదాను టాలీవుడ్‌లో ప‌రిచ‌యం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది`` అన్నారు. 

ర‌ఘుబాబు మాట్లాడుతూ ``హైద‌రాబాద్ మూవీస్‌లో సూప‌ర్ స్టార్ అయిన గుల్లుదాదా ఈచిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగులో టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నేను సైంటిస్ట్ రోల్ చేస్తున్నాను. రెండు నెలల్లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది`` అన్నారు. 

గుల్లుదాదా మాట్లాడుతూ ``తెలుగులో నేను చేస్తున్న మొద‌టి ప్ర‌య‌త్నం. సినిమా చిత్రీక‌ర‌ణ వేగంగా జ‌రుగుతుంది. రెండు నెలల్లో అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు. 

గుల్లుదాదా(అద్నాస్ సాజిద్ ఖాన్‌), ర‌ఘుబాబు, పెంటాలి సేన్‌, ప్రియాంక‌, వి.ఎస్.ప‌ద్మావ‌తి, అక్బ‌ర్ ష‌రీఫ్‌, హ‌సఫ్ స‌మీర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి క‌థః ప్రశాంత్ రూత్‌, కెమెరాః చ‌క్రి, మ్యూజిక్ః కున్ని, ఎడిట‌ర్ః స‌ర్తాజ్‌, ఆర్ట్ః డేవిడ్‌, డైలాగ్స్ః శ్రీహ‌ర్ష పిల్లా, స్క్రీన్‌ప్లే, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వంః బెజ్జం రాజేష్ పుత్ర‌

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved