pizza
NTR - Koratala Siva - Janatha Garage on September 2nd
సెప్టెంబ‌ర్ 2న విడుద‌ల‌వుతున్న `జ‌న‌తాగ్యారేజ్‌`
You are at idlebrain.com > News > Functions
Follow Us

15 July 2016
Hyderabad

Young Tiger NTR and acclaimed director Koratala Siva have teamed up for the high voltage emotional entertainer 'Janatha Garage'. Samantha and Nithya Menen will be seen as the heroines in this movie and the iconic Malayalee actor Mohan Lal will be seen in an important role.

The movie was originally supposed to hit the screens on August 12th. But the release date has now been shifted to September 2nd. The audio launch will take place in August. Director Koratala Siva explained that the delay of three weeks is to ensure high quality output.

"I know that fans will be disappointed with this delay and we apologise to them. But this decision has been taken to ensure the very best output. The movie has an excellent span and NTR has performed brilliantly. When we have such good material, we should do full justice in post production. We have the very best technicians in the form of DOP Thiru and Music director Devi Sri Prasad. These three weeks will give them the required time to deliver the best technical output. We may be delayed a bit but we will come with a superb film", said Koratala Siva.

Echoing the statements of the director, Producers Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan (C.V.M.) stated that the delay is to ensure a good film. "Heavy rains disrupted the shoot on some days. This has led to a slight delay, leaving very little time for post production. After making such a high budget film with a good story, we did not want to rush in with a hurried output. This delay is only to give the best possible film for fans and movie lovers", they said.

Well known actors like Sai Kumar, Unni Mukundhan, Brahmaji, Benarjee, Ajay, Sitara, Devayani, Gunaji etc. will be seen in this movie.

Crew Details :
Writing - Direction - Koratala Siva
Producers : Naveen Yerneni, Mohan (CVM), Y. Ravi Shankar
Executive Producer : Chandrasekhar Ravipati
Music - Devi Sri Prasad
Editing - Kotagiri Venkateswara Rao
Fights : Anal Arasu
Cameraman - Thiru
Art - A.S. Prakash

 

ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌(సి.వి.ఎం)లు నిర్మిస్తోన్న చిత్రం `జ‌న‌తాగ్యారేజ్‌`. సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సంద‌ర్భంగా విడుద‌ల తేది గురించి చిత్ర‌యూనిట్ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో పాత్రికేయుల స‌మావేశాన్ని నిర్వ‌హించింది. ఈ సంద‌ర్బంగా...

చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన వై.ర‌విశంక‌ర్ మాట్లాడుతూ ``మా సినిమా జ‌న‌తాగ్యారేజ్ చిత్రాన్ని ఆగ‌స్ట్ 12న విడుద‌ల చేయాల‌ని అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల సినిమాను సెప్టెంబ‌ర్ 2కు వాయిదా వేశాం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో జాప్యం జ‌ర‌గ‌డ‌మే అందుక్కార‌ణం. ఎన్టీఆర్ అభిమానులు ఈ విష‌యాన్ని అర్థం చేసుకుంటార‌ని భావిస్తున్నాను. ఆడియో ఆగ‌స్ట్ మొద‌టి లేదా రెండో వారంలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేసుకుంటున్నాం. ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది`` అన్నారు.

ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ మాట్లాడుతూ ``సినిమాను ముందుగా ఆగ‌స్టు 12న విడుద‌ల చేయాల‌ని అనుకున్నాం. కానీ అనుకోకుండా వ‌ర్షాలు కుర‌వ‌డంతో షూటింగ్ కొద్దిగా అప్‌సెట్ అయ్యింది. దాంతో యాక్ట‌ర్స్ డేట్స్ అడ్జ‌స్ట్ కాలేదు. దాని వ‌ల్ల షూటింగ్ వెనక్కి వెళ్ల‌డం జ‌రిగింది. ఈ సినిమాకు ప‌నిచేసే టెక్నిషియ‌న్స్ అంద‌రూ టాప్ టెక్నిషియ‌న్సే. అంద‌రూ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా వ‌ర్క్‌చేస్తున్నారు. ఇంకా బెస్ట్ ఇవ్వాల‌ని అంద‌రం క‌ష్ట‌పడుతున్నాం. ఈ సినిమా రిలీజ్ విష‌యంలో ఫ్యాన్స్‌ను బాగా డిస్ట్ర‌బ్ చేశామ‌ని తెలుసు. కానీ వారు న‌చ్చే చిత్ర‌మ‌వుతుంది. ఎన్టీఆర్ స‌రికొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాం. ఆగ‌స్ట్ మొద‌టి లేదా రెండో వారంలో ఆడియో విడుద‌ల ఉంటుంది. సినిమాను సెప్టెంబ‌ర్‌2న విడుద‌ల చేస్తాం. అలాగే తెలుగు, మ‌ల‌యాళంలో సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. మోహ‌న్‌లాల్‌గారు న‌టించ‌డంతో మ‌ల‌యాళంలో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌ల‌యాళంలో స్ట్ర‌యిట్ మూవీలో ఉంటుందే కానీ డ‌బ్బింగ్ మూవీలా ఉండ‌దు. సినిమా బెస్ట్ కంటెంట్‌తో ఉంటుంద‌ని బ‌ల్ల‌గుద్ది చెబుతున్నాను. ఎన్టీఆర్ ఎప్పుడో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చుండాల్సింద‌ని మోహ‌న్‌లాల్‌గారు అన్నారు. అయితే ఈ సినిమాకు త‌న‌కు మంచి ప్లాట్‌ఫాం అవుతుంద‌ని ఆయ‌న బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఎన్టీఆర్ డ్యాన్స్‌ల‌కు, న‌ట‌న‌కు మ‌ల‌యాళంలో అభిమానులున్నారు. త‌న‌కు మంచి ఫ్యూచ‌ర్ ఉంద‌ని ఆయ‌న ఎన్టీఆర్‌ను మెచ్చుకున్నారు. మోహ‌న్‌లాల్‌, ఎన్టీఆర్‌గారితో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం మంచి అనుభ‌వాన్నిచ్చింది. ఎన్టీఆర్‌ను ఎలా చూడాల‌నుకుంటున్నారో అలా చూపించాను. అంద‌రికీ న‌చ్చే చిత్ర‌మ‌వుతుంది`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved