pizza
Jeelakarra Bellam release on 29 April
ఏప్రిల్ 29న ‘జీలక్ర బెల్లం’
ou are at idlebrain.com > News > Functions
Follow Us

26 April 2016
Hyderabad

శ్రీ చరణ్ కార్తికేయ మూవీస్ బ్యానర్ పై అభిజీత్, రేష్మ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం జీలకర్ర బెల్లం. వజియ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శోభారాణి, నౌరోజీ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 29న విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....

నిర్మాతల్లో ఒకరైన నౌరోజీ రెడ్డి మాట్లాడుతూ ‘’వందేమాతరం శ్రీనివాస్ గారు అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం యువత ఫేస్ చేస్తున్న ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. విడాకులు కూడా వెంటనే తీసేసుకుంటున్నారు. మంచి చదువు, సంపాదన ఉండటంతో తల్లిదండ్రులు కూడా అడగలేని పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి ఓ సిచ్చువేషన్ కు మెసేజ్ ను యాడ్ చేసి నిర్మించిన చిత్రమే ఇది. తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటకలో కూడా సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.

Glam gallery from the event

రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు మాట్లాడుతూ ‘’గోవిందా గోవిందా సినిమా తర్వాత నేను డైలాగ్స్ రాసిన సినిమా ఇది. ప్రతి ఇంట్లో జరిగే కథ. నేటి యువతరానికి చెందిన సబ్జెక్ట్ ఇది. ఏప్రిల్ 29న విడుదలకానున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

అభిజీత్ మాట్లాడుతూ ‘’ ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య ఈగో వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి. చివరకు ప్రేమ గెలిచిందా, ఈగో గెలిచిందా అనేదే సినిమా ఆడియో రెస్పాన్స్ బావుంది. ఏప్రిల్ 29న విడుదలవుతున్నఈ సినిమాను కూడా పెద్ద హిట్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు.

రేష్మ మాట్లాడుతూ ‘’ప్రేమ, పెళ్లిపై చిన్న మెసేజ్ తో చేసిన సినిమా. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved