pizza
Kedi Billa Killadi Ranga trailer launch
‘కేడీ బిల్లా - కిలాడి రంగా’ ట్రైలర్ విడుదల
ou are at idlebrain.com > News > Functions
Follow Us

03 May 2016
Hyderabad

రాజ్ కందుకూరి సమర్పణలో విమల్,శివ కార్తికేయన్, రెజీనా, బిందు మాధవి హీరో హీరోయిన్లుగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘కేడీ బిల్లా – కిలాడి రంగా’ తమిళ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో భీమవరం టాకీస్ బ్యానర్ పై తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని మంగళవారం హైదరాబాద్ నిర్వహించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 13న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా..

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ‘’2015లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాలతో కుదరలేదు. ఎన్.వి.ప్రసాద్ గారు విడుదల చేద్దామనుకున్న ఈ చిత్రాన్ని కొంత ఆలస్యమైనా మా బ్యానర్ పై తెలుగులో విడుదలవుతుండటం ఆనందంగా ఉంది. మంచి ఎంటర్ టైనర్. తప్పకుండా అందరికీ నచ్చే చిత్రమవుతుంది’’ అన్నారు.

మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ‘’తమిళంలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్నారు. మంచి చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నాను.

ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘’నిర్మాణం గురించి అవగాహన వచ్చిన తర్వాత ఇండస్ట్రీలోకి ఎంటర్ కావాలి. అలాగే చిన్న సినిమాలకు సంబంధించిన మినీ థియేటర్స్ నిర్మాణంలో భాగంగా కొన్ని ఏరియాస్ లో థియేటర్స్ నిర్మాణాన్ని స్టార్ట్ చేసేశాం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

కృష్ణతేజ మాట్లాడుతూ ‘’సినిమాలో ఐదు సాంగ్స్ ఉన్నాయి. సినిమాలో కామెడితో పాటు మంచి మెసేజ్ కూడా ఉంది. ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుతున్నాను’’ అన్నారు.

విమల్, శివకార్తికేయన్, రెజీనా, బిందుమాధవి హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి డైలాగ్స్: కృష్ణతేజ, సాహిత్యం: పోతుల రవికిరణ్, సంగీతం: యువన్ శంకర్ రాజా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: డా.శివ వై.ప్రసాద్, బి.సత్యనారాయణ, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకత్వం: పాండిరాజ్.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved