pizza

Pakka Commercial film press meet
అందరికీ అందుబాటులోనే పక్కా కమర్షియల్, టిక్కెట్ల ధ‌రలు పై సృష్ట‌త ఇచ్చిన మెగా నిర్మాత అల్లుఅర‌వింద్, నిర్మాత బ‌న్నీవాసు - జూలై 1న థియేట‌ర్ల‌లో ప‌క్క క‌మ‌ర్షియ‌ల్

You are at idlebrain.com > News > Functions
Follow Us


3 June 2022
Hyderabad

మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో "పక్కా కమర్షియల్" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్’లో భాగంగా ఈ మూవీ టీం ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యాక్రమంలో హీరో గోపిచంద్, హీరోయిన్ రాశీఖన్నా, దర్శకుడు మారుతి, అగ్ర నిర్మాత అల్లు అరవింద్, నిర్మాత బన్నీ వాసు తో పాటు చాలామంది ప్రముఖులు హాజరయ్యారు.

టికెట్ ధరల గురించి ప్రస్తావిస్తూ నిర్మాత బన్నీ వాసు రేట్స్ అందుబాటులో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో అరవింద్ గారు ,తాను మొదటి వ్యక్తులమని. నైజంలో 160+gst, ఆంధ్ర మల్టిఫ్లెక్స్ లో 150+gst, సింగిల్ స్క్రీన్ లో 100+gst అని చెప్పుకొచ్చారు. అందరు టికెట్ కోసం పెట్టిన డబ్బులకి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తారు అని చెప్పుకొచ్చారు.

హీరోయిన్ రాశిఖన్నా మాట్లాడుతూ తెలుగులో నా సినిమా రిలీజై చాలా రోజులు అయింది, మారుతి గారు ఏంజిల్ ఆర్నా కంటే చాలా చాలా మంచి కేరక్టర్ రాసారు. సినిమాలో చాలా మంచి సీన్స్ ఉన్నాయ్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. గోపీచంద్ గారితో మూడు సినిమాలకి వర్క్ చేశాను చాలా హ్యాపీ గా ఉంది.

"పక్కా కమర్షియల్" సినిమా ఓటిటిలో అంత త్వరగా రాదు, f3 సినిమా ప్రస్తుతం బాగా ఆడుతుంది, దానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా కూడా ఉండబోతుందని మెగా నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు.

గోపిచంద్ మాట్లాడుతూ..నేను ఈ సినిమా చెయ్యడానికి కారణం వంశీ, జిల్ తరువాత ఎప్పటినుంచో సినిమా చెయ్యాలనుకున్నాం కానీ మంచి కథ దొరకలేదు. కథ బాగా నచ్చడంతో, చేసేద్దాం అని ఫిక్స్ అయ్యాం. మారుతి తో షూటింగ్ స్టార్ట్ అవ్వగానే మాకు వేవ్ లెన్త్ బాగా కుదిరింది. ఒక పాజిటివ్ పీపుల్ కలిసి సినిమా చేసినప్పుడు దాని రిజల్ట్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ పక్కా కమర్షియల్.


స‌మ‌ర్ప‌ణ - అల్లు అరవింద్
బ్యాన‌ర్ - జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్
నిర్మాత‌ - బ‌న్నీ వాస్
ద‌ర్శ‌కుడు - మారుతి
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ర‌వీంద‌ర్
మ్యూజిక్ - జ‌కేస్ బీజాయ్
స‌హ నిర్మాత - ఎస్ కే ఎన్
లైన్ ప్రొడ్యూసర్ - బాబు
ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - స‌‌త్య గ‌మిడి
ఎడిటింగ్ - ఎన్ పి ఉద్భ‌వ్
సినిమాటోగ్ర‌ఫి - క‌ర‌మ్ చావ్ల‌


Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved