pizza
Pelli Choopulu Releasing on July 29th
జూలై 29న `పెళ్ళిచూపులు`
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 July 2016
Hyderabad

డి.సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కందుకూరి(ధ‌ర్మ ప‌థ క్రియేష‌న్స్‌), య‌ష్ రంగినేని(బిగ్ బెన్ సినిమాస్‌) నిర్మాతలుగా త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర కొండ‌, రీతూ వర్మ జంటగా రూపొందిన చిత్రం `పెళ్ళిచూపులు`. ఈ చిత్రం జూలై 29న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో....

డి.సురేష్‌బాబు మాట్లాడుతూ ``పెళ్ళి చూపులు సినిమాను ఇటీవ‌లే చూశాను. చాలా బాగా న‌చ్చ‌డంతో సినిమా రిలీజ్ విష‌యంలో అసోసియేట్ అయ్యాను. త‌రుణ్ భాస్క‌ర్ అండ్ టీం బౌండెడ్ స్క్రిప్ట్‌తో, స్టోరీ బోర్డ్‌తో ప‌క్కా ప్లానింగ్‌తో చేసిన ఈ సినిమా చూస్తుంటే ప్లెజెంట్ ఫీలింగ్ క‌లిగింది. నిజానికి త‌రుణ్‌భాస్క‌ర్ న‌న్ను క‌లిసిన‌ప్పుడు త‌న‌ని వేరే సినిమా చేయ‌మ‌న్న‌ప్ప‌టికీ త‌ను మాత్రం ఈ పెళ్ళిచూపులు సినిమా చేయ‌డానికి ఫిక్స్ అయిపోయి నా సినిమా చేయ‌న‌ని నాతో చెప్పాడు అప్పుడు త‌న క‌మిట్‌మెంట్ నాకు బాగా న‌చ్చింది. ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే త‌రుణ్ భాస్క‌ర్ సినిమాను రియ‌లిస్టిక్‌గా, మ‌న ఇళ్ళ‌లో జ‌రుగుతున్న‌ట్టుగా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. సినిమాను ప్యామిలీ అంతా క‌లిసి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. వివేక్ సాగ‌ర్ మంచి సంగీతంతో పాటు, మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సినిమా చూసి ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత కూడా సినిమాను మ‌న‌ల్ని హంట్ చేస్తుంటుంది. మా బ్యానర్లో తరుణ్ భాస్కర్ తో ఓ సినిమా చేస్తాం`` అన్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ ``సినిమా చూడ‌గానే సురేష్‌బాబు నీకేం కావాలో చెప్ప‌మంటూ ముందుకు వ‌చ్చి స‌పోర్ట్ చేశారు. సినిమా ప్రారంభం నుండే ఆయ‌న అండ‌గా నిల‌బ‌డుతున్నారు. ఇక త‌రుణ్ భాస్క‌ర్ గ‌తంలో అనుకోకుండా, సైన్మా అనే రెండు షార్ట్ ఫిలింస్ చేశాడు. కానీ ఫీచ‌ర్ ఫిలింను చ‌క్క‌గా డెలివ‌రీ చేశాడు. గ్రేట్ ఫిలిం అని చెప్ప‌గ‌ల‌ను. య‌ష్ రంగినేని క‌థ విని ఈ సినిమా చేయ‌డానికి ముందుకు వ‌చ్చాడు. విజ‌య్ దేవ‌ర కొండ‌, రీతూవ‌ర్మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. వివేక్ ఎక్స‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. యూనిట్‌లో ప్ర‌తి ఒక్క‌రూ మంచి అవుట్‌పుట్ కోసం ప్ర‌య‌త్నించి మంచి సినిమాను రూపొందించారు. సినిమాను జూలై 29న విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.

Ritu Varma Glam gallery from the event

ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ మాట్లాడుతూ ``షార్ట్ పిలింకు, ఫీచ‌ర్ ఫిలింకు నాకు తెలిసి పెద్ద తేడా క‌న‌ప‌డ‌లేదు. ఈ సినిమాను అనుకున్న బ‌డ్జెట్‌లో చేయ‌డానికి ప్లానింగ్‌తో ముందుకెళ్లాం. ప్రొడ‌క్ష‌న్ మైండ్ అనే సాఫ్ట్‌వేర్‌ను ఉప‌యోగించాం. దీనివ‌ల్ల ఎక్క‌డా డిస్ట్ర‌బెన్స్ రాలేదు. అనుకున్న స‌మ‌యంలో అనుకున్న‌ట్టుగా పూర్తి చేశాం. అంద‌రూ ఓ టీంలా కలిసి ప‌నిచేశాం. అలాగే సినిమా చూడ‌గానే సురేష్‌బాబుగారు సినిమా చేయ‌డానికి ముందుకు రావ‌డం ఆనందంగా ఉంది. నేను ఫ‌స్ట్‌టైమ్ డైరెక్ట్ చేస్తున్న సినిమాను అంద‌రూ క‌లిసి చూసేలా చేయాల‌నే ఉద్దేశంతో ఈ సినిమాను చేశాను. ఈ సినిమా నా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కు నేను ఇచ్చే గిఫ్ట్‌లా భావిస్తున్నాను. జూలై 29న సినిమా విడుద‌ల‌వుతుంది`` అన్నారు.

య‌ష్ రంగినేని మాట్లాడుతూ ``మూడు నాలుగేళ్ళుగా సినిమా చేయాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో రాజ్ కందుకూరి ఈ క‌థ విన‌మంటే విన్నాను. చాలా బాగా న‌చ్చ‌డంతో వెంటనే సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను. ఈ సినిమాను 6 నుండి 60 ఏళ్ళ వ‌ర‌కు అంద‌రూ చూడ‌వ‌చ్చు. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్ర‌మిది. విజ‌య్‌, రీతూ వారి పాత్ర‌ల్లో జీవించారు. నందు కీ రోల్ చేశాడు`` అన్నారు.

విజ‌య్ దేవ‌ర కొండ మాట్లాడుతూ ``డిగ్రీ చ‌దివే రోజుల్లోనే నేను సురేష్‌బాబుగారిని తేజ గారి ఆఫీస్‌లో ఓ సినిమా ఆడిష‌న్ కోసం వెళ్ళిన‌ప్పుడు చూశాను. నేను నా యాక్టింగ్ దృష్టితో ఉండేవాడినే త‌ప్ప సినిమాల‌ను పెద్ద‌గా చూసేవాడిని కాను. సినిమా యాక్ట‌ర్ కావడం ఈజీయేమీ కాదు. చాలా కృషి, ప‌ట్టుద‌ల‌, కోరిక‌తో పాటు ప్ర‌య‌త్నం కూడా ఉండాలి. నేను అనే కాదు. ఎవ‌రు ఏం చేయాల‌నుకున్నా ప్ర‌య‌త్నం చేస్తూ ఉండాలి. ఎప్పుడో అప్పుడు క‌చ్చితంగా స‌క్సెస్ సాధిస్తారు. ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే టీం అంద‌రం క‌లిసి చేసిన ప్ర‌య‌త్న‌మిది`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో మ‌ధుర శ్రీధ‌ర్‌, రీతూ వ‌ర్మ‌, నందు, ప్రియ‌ద‌ర్శిన్‌, అభ‌య్‌, వివేక్ సాగ‌ర్‌, త‌దితరులు పాల్గొన్నారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved