pizza
Satyam Vaipu Margamu release on 25 December
You are at idlebrain.com > News > Functions
Follow Us

16 December 2014
Hyderabad

ఈ నెల 25న ‘సత్యం వైపు మార్గం’ విడుదల

ఎం.ఎస్.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘సత్యం వైపు మార్గం’. విజయ్ చందర్, రూపారెడ్డి బసవ, సూర్య, సంధ్యాఝనక్, శివ, జయశ్రీ నాయుడు, ముఖేష్, ప్రియాంక అగస్టియన్, చంద్రశేఖర్, నాగబాబు కీలక పాత్రధారులు. ఈ నెల 25న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో మంగళవారం ఉదయం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

జీవన్ థామస్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ‘కరుణామయుడు’కి సంగీత విభాగంలో పనిచేశాను. ఈ సినిమాకి సంగీతం చేయడం నా అదృష్టం. మంచి కథ ఇది. సందేశం ఉన్న సినిమా. యువతకు చక్కగా కనెక్ట్ అవుతుంది. ఈ నెల 25న విడుదల కానుంది’’ అని తెలిపారు.

రూపారెడ్డి మాట్లాడుతూ ‘‘యువతకు మంచి సందేశం ఇవ్వాలని చేసిన సినిమా ఇది. దర్శకుడు చక్కటి స్క్రిప్ట్ చేశారు. ఈ సినిమాలో విజయ్ చందర్ జీసస్ పాత్రలో కనిపిస్తారు. జీవన్ మంచి సంగీతాన్నిచ్చారు. ఈ నెల 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘నేను దర్శకత్వం చేసిన తొలి సినిమానే జీసస్ మీద చేయడం ఆనందంగా భావిస్తున్నాను. దేవుడంటే ఇష్టం లేని అమ్మాయికి, జీసస్ కి మధ్య జరిగే కథ ఇది. సోషల్ మెసేజ్ ఉంటుంది. జీసస్ అనగానే అందరికీ విజయ్ చందర్ గుర్తుకొస్తారు. ఈ సినిమాలో మరోసారి ఆయన జీసస్ గా కనిపిస్తారు’’ అని తెలిపారు.

విజయ్ చందర్ మాట్లాడుతూ ‘‘జీసస్ రోల్ చేస్తుంటే చాలా మంది వద్దని అప్పట్లో వారించారు. కానీ నన్ను ఓ శక్తి నడిపించింది. ఆ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత జీసస్ రోల్ ను నేను చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాలో జీసస్ పాత్ర చేశాను. రూపారెడ్డి మంచి నిర్మాత. దర్శకుడు చాలా మంచి వ్యక్తి. మంచి యూనిట్ చేసిన ప్రయత్నమిది. 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో శివ, సంధ్యాఝనక్ కూడా పాల్గొన్నారు.

 

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved