pizza
Seesa release on 18 March
మార్చి 18న విడుదలవుతున్న ‘సీసా’
You are at idlebrain.com > News > Functions
Follow Us

12 March 2016
Hyderabad

లక్ష్మీ వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై ఇషాక్ దర్శకత్వంలో శివాజీ, నమ్రత, నిశాదేశ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘సీసా’. జగదీష్ నిర్మాత. సినిమా మార్చి 18న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....

శివాజీ మాట్లాడుతూ ‘’ఒక సంవత్సరానికి ముందు బూచమ్మ బూచోడు విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వన్ ఇయర్ గ్యాప్ తర్వాత నటించిన సినిమా సీసా. ఈ సినిమాను కేవలం ఒక షాట్ లోనే పూర్తి చేశారు. దర్శకుడు ఇషాక్ ఈ విషయం చెప్పగానే థ్రిల్ అయ్యాను. ఆయన మెరీనా బీచ్ లో ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత షూట్ కు వెళ్ళారు. డ్రామా, టెన్షన్ అన్నీ ఎలిమెంట్స్ ఉండే హర్రర్ మూవీ. సినిమాను మార్చి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. అందరూ సినిమా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘’సినిమాను ప్రేమించే వాళ్ల సినిమా. రెండున్నర గంటల సినిమాను ఒకే షాట్ లో తీయడమంటే మాటలు కాదు. హిందీలో కూడా సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అన్నారు.

నిర్మాత జగదీష్ మాట్లాడుతూ ‘’సపోర్ట్ అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.

ఈ చిత్రానికి రచన: భాషా శ్రీ, కెమెరా: నౌషత్, సంగీతం: రాజ్ భాస్కర్, ఎడిటింగ్: హరి, నిర్మాత: జగదీష్ , దర్శకత్వం: ఇషాక్.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved