pizza
Shivalinga release on 14 April
ఏప్రిల్ 14న `శివ లింగ‌`
You are at idlebrain.com > News > Functions
Follow Us

4 April 2017
Hyderaba
d

అభిషేక్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రాఘ‌వేంద్ర లారెన్స్‌, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో ర‌మేష్ పి.పిళ్లై నిర్మించిన చిత్రం `శివ‌లింగ‌`. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో....

మ‌ల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ - ``శివ‌లింగ చిత్రం ఏప్రిల్ 14న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. వాసుగారి ద‌ర్శ‌క‌త్వంలో క‌న్న‌డంలో రూపొందిన ఈ చిత్రం అక్క‌డ పెద్ద స‌క్సెస్ కావ‌డంతో తెలుగు, త‌మిళంలో లారెన్స్‌, రితిక సింగ్‌ల‌పై చిత్రీక‌రించారు. అభిషేక్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ర‌మేష్ పిళ్ళైగారు ఈ సినిమాను క్వాలిటీగా నిర్మించారు. లారెన్స్ న‌ట‌న గురించి మ‌నం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న న‌టించిన కాంచ‌న‌, గంగ చిత్రాల స‌క్సెస్‌లే అందుకు ఉదాహ‌ర‌ణ‌లు. అలాగే రీసెంట్‌గా గురు చిత్రంతో స‌క్సెస్ సాధించిన రితిక సింగ్ హీరోయిన్‌గా న‌టించిన చిత్ర‌మిది. హ‌ర్ర‌ర్‌, స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్‌, యాక్ష‌న్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కులకు నచ్చేలా సినిమా ఉంటుంది`` అన్నారు.

ర‌మేష్ పిళ్ళై మాట్లాడుతూ - ``క‌న్న‌డ‌లో శివ‌లింగ పేరుతో శివ‌రాజ్‌కుమార్‌గారు న‌టించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో లారెన్స్‌, రితిక సింగ్‌ల‌తో రీమేక్ చేశాం. వాసుగారి ద‌ర్శ‌క‌త్వంలోనే సినిమా రూపొందింది. సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమాలో ఐదు సాంగ్స్ ఉన్నాయి. లారెన్స్‌గారికి కాంచ‌న కంటే మంచి పేరు తెచ్చే చిత్ర‌మ‌వుతుంది`` అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved