pizza
Malupu release on 19 February
Terror release on 26 February
ఫిభ్రవరి 26న విడుదలవుతున్న ‘టెర్రర్’
You are at idlebrain.com > News > Functions
Follow Us

21 February 2016
Hyderabad

భారత క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీకాంత్, నికిత హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం టెర్రర్. షేక్ కరీమ్ సమర్పణలో సతీష్ కాశెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిభ్రవరి 26న విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. అల్లరి నరేష్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో.....

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘’ఈ యూనిట్ తో వండర్ ఫుల్ జర్నీ చేశాను. స్క్రిప్ట్ నెరేషన్ విధానం నచ్చగానే సినిమాపై కాన్ఫిడెంట్ వచ్చింది. దాంతో చేయడానికి సిద్ధపడ్డాను. కచ్చితంగా కమర్షియల్ గా సినిమా విజయం సాధిస్తుంది. నిర్మాత షేక్ మస్తాన్ గారు కథపై నమ్మకంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఆయనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి ఫ్యూచర్ లో మరిన్ని మంచి సినిమాలు సాధించాలని కోరుకుంటున్నాను. దర్శకుడు సతీష్ సినిమాను క్లీన్, నీట్ గా డైరెక్ట్ చేశారు. సాయికార్తీక్ అద్భుతమైన రీరికార్డింగ్ ఇచ్చాడు. ఫిభ్రవరి 26న మీ ముందుకు వస్తున్నాం. మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘’ఇండస్ట్రీలో అందరికీ కావాల్సిన హీరో శ్రీకాంత్ గారు. ఆయన నటించిన ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలి. దర్శకుడు సతీష్, నిర్మాత మస్తాన్ గారికి సహా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

Nikhita Glam gallery from the event

 

నిర్మాత షేక్ మస్తాన్ మాట్లాడుతూ ‘’నేను ఇండస్ట్రీకి కొత్త. కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. శ్రీకాంత్ సహా నటీనటులు, డైరెక్టర్ సతీష్ గారు మిగతా టెక్నిషియన్స్ సపోర్ట్ తో మంచి సినిమా తీయగలిగాం. ఫిభ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. సినిమాను తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు.

దర్శకుడు సతీష్ కాశెట్టి మాట్లాడుతూ ‘’నేను దర్శకుడుగా మారడానికి హరినాథ్ పొలిచెర్ల, మోహన్ వడ్లపట్లగారికి థాంక్స్. ఈకాలంలో సినిమా చేయడమనేది పెద్ద విషయం కాదు. కానీ సినిమాను రిలీజ్ చేయడం చాలా కష్టమైన విషయం. కానీ నిర్మాతగారు ఇచ్చిన సపోర్ట్ తో సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఫాస్ట్ ఫేస్డ్ థ్రిల్లర్. ఫిభ్రవరి 26న విడుదలవుతుంది. సినిమా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో రవివర్మ, చిట్టి, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ ప్రసాద్, లక్ష్మీ భూపాల్, రవివర్మ సహా చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

శ్రీకాంత్, నికితా, కోటశ్రీనివాసరావు, నాజర్, సుధ, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీ భూపాల్, సంగీతం: సాయికార్తీక్, కెమెరా: శ్యామ్ ప్రసాద్, ఎడిటింగ్: బస్వా పైడిరెడ్డి, స్టంట్స్: జాషువా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి అయినీడి, నిర్మాత: షేక్ మస్తాన్, దర్శకత్వం: సతీష్ కాశెట్టి.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved