pizza
Malupu release on 19 February
Veeri Veeri Gummadi Pandu release on 26 February
ఫిభ్రవరి 26న విడుదలవుతున్న ‘వీరి వీరి గుమ్మడిపండు’
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 February 2016
Hyderabad

దుగ్గిన్‌ సమర్పణలో శివకృతి క్రియేషన్స్‌ బ్యానర్‌పై రుద్ర, వెన్నె, సంజయ్‌, బంగారం ప్రధానతారాగణంగా రూపొందిన చిత్రం ‘వీరి వీరిగుమ్మడిపండు’. ఎం.వి.సాగర్‌ దర్శకత్వంలో కెల్లం కిరణ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిభ్రవరి 26న విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు ఎం.వి.సాగర్, నిర్మాత కెల్లం కిరణ్ కుమార్, హీరో రుద్ర, హీరోయిన్ వెన్నెల, రుశ్వేత, హార్డికేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

హీరో రుద్ర మాట్లాడుతూ ‘’’సినిమా ఫిభ్రవరి 26న విడుదలవుతుంది. సినిమాను అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాను‘’ అన్నారు.

హీరోయిన్ వెన్నెల మాట్లాడుతూ ‘’’సినిమా చాలా బాగా వచ్చింది. అన్నీ ఎలిమెంట్స్ తో అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టకుంటుంది. 26న సినిమా విడుదలవుతుంది. సినిమా అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను ‘’ అన్నారు.

Vennela Glam gallery from the event

 

నిర్మాత కెల్లం కిరణ్ కుమార్ మాట్లాడుతూ ’’సినిమాను 75 థియేటర్స్ కు పైగా విడుదల చేస్తున్నాం. మధురశ్రీధర్ గారు అందించిన సపోర్ట్ మరచిపోలేనిది. కంప్లీట్ ఫ్యామిలీ హర్రర్ ఎంటర్ టైనర్. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో 63 మంది కొత్త నటీనటులు నటిస్తున్నారు‘’ అన్నారు.

దర్శకుడు ఎం.వి.సాగర్ మాట్లాడుతూ’’సినిమాను చాలా కష్టపడి చేశాం. ఫైనల్ కాపీ చూశాం. చాలా బాగా వచ్చింది. 63 మంది నూతన నటీనటులు నటించారు. 2013లో ప్రేమకథాచిత్రమ్, 2014లో గీతాంజలి, 2015లో రాజుగారి గది తరహాలో 2016లో వీరి వీరి గుమ్మడి పండు మంచి పేరు తెచ్చుకుంటుంది’’ అన్నారు.

రుద్ర, వెన్నె, సంజయ్‌, బంగారం హార్దిక్‌, రుషిత, రఘుబాబు, శివన్నారాయణ, దీక్షిత్‌, అనంత్‌, ప్రవీణ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్‌: శక్తి స్వరూప్‌, మ్యూజిక్‌: పి.ఆర్‌, సినిమాటోగ్రఫీ: కె.యం.కృష్ణ, ప్రొడ్యూసర్‌: క్లెం కిరణ్‌కుమార్‌, దర్శకత్వం: ఎం.వి.సాగర్‌.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved