pizza
Venkatapuram release on 12 May
మే12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా 'వెంకటాపురం' విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

04 May 2017
Hyderabad

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం. హ్యాపీడేస్ ఫేం యంగ్ హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లవుతుంది. ఇటీవ‌లే అచ్చు అందించిన ఆడియో మంచి విజ‌యాన్ని సాదించింది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... ఈరోజుల్లో చిత్రం తో గుడ్ సినిమా గ్రూప్ ని మారుతి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేశాము. ఇది మా నాలుగో చిత్రం. మా గ‌త చిత్రాల‌న్ని క‌థ‌ల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుని చేసాము. అలాగే వెంక‌టాపురం ఇంకా జాగ్ర‌త్త‌లు తీసుకుని ప్రేమించి చేశాము. ఈ చిత్ర‌క‌థ విష‌యానికోస్తే ఓ యువతి హత్య నేపథ్యంలో ఊహకందని మలుపులతో స‌రికొత్త క‌థ‌నంతో ఆధ్యంతం ఆసక్తి కరంగా తెర‌కెక్కించిన చిత్రం మా వెంక‌టాపురం. వైజాగ్ నెప‌ధ్యంలో సాగే యూత్‌ఫుల్ థ్రిల్ల‌ర్ గా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. హీరో రాహుల్ న్యూ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. చాలా అందంగా పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా ఓదిగిపోయాడు రాహుల్, చిత్రం చూసిన త‌రువాత రాహుల్ కంటే ఆనంద్ గా అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంటాడు. దర్శకుడు వేణు అద్భుతమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించాడు. మా చిత్రానికి సాయిప్ర‌కాష్ కెమెరా వ‌ర్క్ హైలెట్ గా నిలుస్తుంది. అచ్చు అందించిన ఆడియో మంచి విజ‌యం సాదించింది. అన్ని కార్య‌క్ర‌మాలూ పూర్తిచేసుకున్న మా వెంక‌టాపురం మే 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నాము. అని అన్నారు

హీరో రాహుల్ మాట్లాడుతూ.. ముందుగా తెలుగువారి స‌త్తాని ప్ర‌పంచానికి తెలియ‌జెప్పిన భాహుబ‌లి టీం కి నా త‌రుపుకున మా చిత్రం త‌రుపున ధ‌న్య‌వాదాలు. కంటెంట్ ని న‌మ్ముకుని తీస్తే ఏ చిత్రం అయినా ఏ రేంజి కి వెలుతుందో తెలియ‌జెప్పిన రాజ‌మౌళి గారికి మా హ్రుద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ఇప్ప‌డు మాలాంటి కంటెంట్ ని న‌మ్ముకున్న చిత్రాల‌కి ఊపిరి పోసారు. తెలుగు ప్ర‌జ‌లంద‌రూ సినిమా చూడ‌టానికి బ‌య‌ట‌కి వ‌చ్చారు. మా వెంక‌టాపురం మే12న విడుద‌ల చేస్తున్నాం. త‌ప్ప‌కుండా కొత్త చిత్రం అంద‌రిని ఆక‌ట్టుకునే చిత్రం అని చెప్ప‌గ‌లం. భాహుబ‌లి త‌రువాత వ‌స్తున్న క‌మ‌ర్షియ‌ల్ కంటెట్ బెస్డ్ చిత్రంగా అంద‌రి ఆద‌ర‌ణ పొందుతుంది. మా హీరోయిన్ చాలా బాగా న‌టించింది. ఈ చిత్రం కి అచ్చు ఆడియో , కెమెరా వ‌ర్క్ చాలా పెద్ద ఎసెట్ గా నిలుస్తాయి. మా నిర్మాత‌ల‌కి ధ‌న్య‌వాదాలు.. అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. నాకు ఈ అవ‌కాశాన్ని ఇచ్చిన నిర్మాత‌లు శ్రీనివాస్‌, ఫ‌ణిగార్ల‌కి నా ధ‌న్య‌వాదాలు. కాన్సెప్ట్‌డ్ ఫిల్మ్ చాలా కొత్త‌గా వుంటుంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించాము. న‌టీన‌టులు చాలా ఒదిగి న‌టించారు. పాత్ర‌లు మాత్ర‌మే క‌నిపిస్తాయి. త‌ప్ప‌కుండా ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ అందుకుంటుంద‌ని న‌మ్ముతున్నాం. ఆడియో చాలా పెద్ద హిట్ అవ‌టంతో అంచ‌నాలు పెరిగాయి. అదే రేంజి లో చిత్రం వుంటుంది. కెమెరా వ‌ర్క్ సూప‌ర్డ్ గా వుంది. అన్నారు.

నటీనటులు -
రాహుల్, మహిమా మక్వాన్, అజయ్, జోగిబ్రదర్స్, శశాంక్ తదితరులు
సాంకేతిక నిపుణులు -
ప్రొడక్షన్ కంట్రోలర్: వాసిరెడ్డిసాయిబాబు, డ్యాన్స్ మాస్టర్: అనీష్ విజ్ఞేష్, అనిత నాథ్, కెమెరా: సాయిప్రకాష్ ఆర్ట్: జె.మోహన్, మ్యూజిక్: అచ్చు, కొ-ప్రోడ్యూస‌ర్: ఉమాదేవి కున‌ప‌రాజు ప్రొడ్యూసర్స్: శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్, స్టోరీ, డైరెక్టర్: వేణు మాధికంటి.

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved