pizza
Yuva Tejam teaser launch
‘యువతేజం’ టీజర్ లాంచ్
You are at idlebrain.com > News > Functions
Follow Us

6 February 2016
Hyderabad

శ్రీ వెంకటసాయి ఫిలిస్ సమర్పణలో ఎస్‌.శ్రీనివాస్ హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘యువ‌తేజం’. శిల్ప‌, మేఘ‌న హీరోయిన్స్‌. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం శనివారం హైద‌రాబాద్‌లోజ‌రిగింది. ఈ సంద‌ర్భంగా....

హీరో, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఎస్‌.శ్రీనివాసులు మాట్లాడుతూ ``సినిమా మీద ప్యాష‌న్ తో సినిమాను తెర‌కెక్కించాం. సినిమా మంచి మెసేజ్‌తో కూడుకున్నది. ఈ సినిమా బాగా రావ‌డానికి వేట‌పాలెం ద‌ర్శ‌క‌డు వెంక‌ట్ రెడ్డి, రాంబాబుగారు ముఖ్య కార‌ణం. శిల్ప,మేఘ‌న చ‌క్క‌గా న‌టించారు. గాంధీ త‌త్వం గురించి చెప్పే చిత్ర‌మిది`` అన్నారు.

రాంబాబు మాట్లాడుతూ ``సినిమాల‌పై ఆస‌క్తితో మార్ష‌ల్ ఆర్ట్స్‌లో మంచి  ఎఫిసియెట్ అయిన శ్రీనివాసులు ఈ చిత్రానికి హీరోగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడుగా చేసిన చిత్ర‌మిది. సందేశాత్మ‌క  చిత్రం, అంద‌రి ప్రేక్ష‌కుల‌కు న‌చ్చింది.`` అన్నారు.

వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ ``మంచి ఉద్దేశంతో చేసిన చిత్ర‌మిది. శిల్ప‌,మేఘ‌న చ‌క్క‌గా న‌టించారు. సినిమా బాగా వ‌చ్చింది. అంద‌రూ ఆద‌రించే చిత్ర‌మిది``అన్నారు.

ఎ.ఆర్‌.సన్ని మాట్లాడుతూ``సినిమాలో ఆరు పాట‌లుంటాయి. సినిమా చ‌క్క‌గా వ‌చ్చింది. అంద‌రూ ఆద‌రించాలి`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో శిల్ప‌,మేఘ‌న‌, వెంక‌ట్,తేజో శ్రీనివాస్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

రాంబాబు, శ్రీకుమారి, వీర‌భ‌ద్రం, నిర్మ‌ల‌, తేజో శ్రీనివాస్ ఇతర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిట‌ర్ః స‌ర్ధాజ్‌, పాట‌లుః కృష్ణారావు, ఫోటోగ్ర‌ఫీః డి.యాద‌గిరి, సంగీతంః ఎ.ఆర్‌.స‌న్ని, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వంః య‌స్‌.శ్రీనివాసులు.  

 

Glam galleries from the event

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved