
13 October 2026
Hyderabad
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా "రణబాలి" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
యాక్టర్ మైమ్ మధు మాట్లాడుతూ - ఈ చిత్రంలో ప్రతాపుడు అనే పాత్రలో నటించాను. ఇది చాలా కీలకమైన పాత్ర. జుట్టు గడ్డం పెంచుకుని మీరు గుర్తుపట్టలేనంత కొత్త లుక్ లో నా క్యారెక్టర్ ఉంటుంది. దర్శకుడు రాహుల్ ఈ సినిమాను ఎంతో డీటెయిలింగ్ గా రూపొందించారు. మీరు మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
యాక్టర్ వినోద్ సాగర్ మాట్లాడుతూ - ఈ సినిమా కోసం మేమంతా ఏడాదిన్నరగా కష్టపడుతున్నాం. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మా డైరెక్టర్ రాహుల్ గారికి, మైత్రీ ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. అన్నారు.
యాక్టర్ కంచెరపాలెం కిషోర్ మాట్లాడుతూ - సినిమాలను మనం వినోదం కోసం చూస్తాం. కానీ రణబాలి సినిమా ఒక పర్పస్ కోసం చేసిన సినిమా. మరుగున పడిన చరిత్రను మనకు తెలియజేసే ప్రయత్నంగా రూపొందిన సినిమా. లక్షల మంది ఆకలి కేకల నుంచి పుట్టిన కథ ఇది. ఈ సినిమాను ప్రేక్షకులంతా పెద్ద సక్సెస్ చేయాలని కోరుతున్నా. అన్నారు.
యాక్టర్ వ్లాదిమిర్ మాట్లాడుతూ - రణబాలి సినిమాలో నటించడం బ్యూటిఫుల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ రాహుల్, మైత్రీ ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. అన్నారు.
లిరిసిస్ట్ సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ - రణబాలి చిత్రంలో నేను రాసిన ఏందయ్యా సామీ పాట ఇంత ఆదరణ పొందడం సంతోషంగా ఉంది. ఈ పాట రచయితగా నేను గర్వపడేలా చేసింది. ఈ పాటలో రణబాలి, జయమ్మ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. మరుగున పడిన చరిత్రను మనకు తెలియజేసేలా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఎంతో శ్రమించి ఈ సినిమా రూపొందించాడు. ఆయనకు మంచి విజయం దక్కాలి. సినిమా మేకింగ్ లో ఎక్కడా రాజీ పడని మైత్రీ సంస్థకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
లిరిసిస్ట్ డాక్టర్ చక్రవర్తుల మాట్లాడుతూ - ఈ చిత్రంలో పాలెగాళ్లు అనే పాటను రాశాను. ఈ పాట నేను రాయగలను అని నమ్మి అవకాశం కల్పించిన మా డైరెక్టర్ రాహుల్ గారికి థ్యాంక్స్. అన్నారు.
లిరిసిస్ట్ కేశవాదిత్య మాట్లాడుతూ - ఈ చిత్రంలో కోబలి అనే పాట రాశాను. ఈ పాటకు ఇంత బాగా ఆదరణ దక్కుతుందంటే కారణం రణబాలి కథలోని బలమే. ఇలాంటి గొప్ప చిత్రంలో నా తొలి పాట రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ శివంరావు నాగసాని మాట్లాడుతూ - మా ఆర్ట్ వర్క్ కు లైఫ్ ఇచ్చేంత బాగా సినిమాను రూపొందించారు మా డైరెక్టర్ రాహుల్. విజయ్, రశ్మిక బ్యూటిఫుల్ గా పర్ ఫార్మ్ చేశారు. ఇలాంటి ఒక హ్యూజ్ మూవీకి వర్క్ చేసే అవకాశం కల్పించిన మా మైత్రీ సంస్థకు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
డీవోపీ జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ మాట్లాడుతూ - రణబాలి ఒక లైఫ్ టైమ్ మూవీ. ఇలాంటి అవకాశం అరుదుగా వస్తుంటుంది. రాహుల్ ఈ కథ గురించి చెప్పినప్పుడు విజువలైజ్ చేసుకునేందుకు కొంత టైమ్ తీసుకున్నాను. ఆ తర్వాత అంతా బ్యూటిఫుల్ గా జరిగింది. ఈ సినిమాను గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేసిన రవి గారికి, నవీన్ గారికి థ్యాంక్స్. అన్నారు.
కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకీ మాస్టర్ మాట్లాడుతూ - ఎవరైనా ఆకలితో కనిపిస్తేనే మనం ఎమోషనల్ అవుతాం. అలాంటిది లక్షలాది మంది ప్రజలు ఆకలితో చనిపోయారంటే ఎంత భావోద్వేగానికి గురవుతామో ఊహించండి. రణబాలి సినిమా చూస్తూ మీరు థియేటర్స్ లో కంటతడి పెట్టుకుంటారు. విజయ్ గారు ఈ సినిమాకు ఎంతో కష్టపడ్డారు. ఆయన ఎంత మంచివారో ఆయనను కలిసివారికే తెలుస్తుంది. మైత్రీ సంస్థలో వరుసగా మూవీస్ చేస్తున్నాను. డైరెక్టర్ రాహుల్ ఈ చిత్రంలో నాకు పాటకే కాదు మాంటేజ్ సాంగ్ కు కూడా కొరియోగ్రాఫ్ చేసే అవకాశం కల్పించారు. అన్నారు.
రైటర్ ప్రమోద్ మాట్లాడుతూ - రైటర్ గా ఈ చిత్రానికి వర్క్ చేసే అవకాశం కల్పించిన డైరెక్టర్ రాహుల్ కు థ్యాంక్స్. మంచి కథను ఈ సినిమా కోసం సిద్ధం చేశాం. ఈ మూవీ టేకప్ చేసిన మైత్రీ సంస్థకు థ్యాంక్స్. అన్నారు.
కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ - అనురాగ్ పర్వతనేని అనే నా పేరులో కొండ ఉంది. నేను విజయ్ దేవరకొండ మనిషిని. అందులోనూ కొండ ఉంది. ఈ సినిమాతో నేను కో ప్రొడ్యూసర్ గా మారానంటే అందుకు విజయ్ గారికి, గోవర్ధన్ గారికి , మైత్రీ ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. విరోష్ ఒక పోస్ట్ పెడితే ఇండియాస్ మోస్ట్ లైక్డ్ పోస్ట్ అయ్యింది. ఒక యాడ్ చేస్తే గ్లోబల్లీ మోస్ట్ లైక్డ్ యాడ్ అయ్యింది. వారు కలిసి చేస్తున్న ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలి. ఒక్క ముద్ద అన్నం విలువ ఏంటో మా పిల్లలకు తెలియాలంటే ఈ సినిమా చూపిస్తా. మన పూర్వీకులు పిడికెడు మెతుకుల కోసం ఎంత ఇబ్బందిపడ్డారో తెలుస్తుంది. అన్నారు.
డైరెక్టర్ రవికిరణ్ కోలా మాట్లాడుతూ - రణబాలి సినిమా టైమ్ లో విజయ్ అన్నను కలిసేందుకు వెళ్తే ఆయన ఈ సినిమా గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పారు. మన మట్టిలో పుట్టిన ఇలాంటి ఒక వీరుడి కంటే గొప్ప వ్యక్తి ఎవరుంటారు అనిపించింది. మనల్ని కొన్ని దశాబ్దాల పాటు వేధించిన బ్రిటీషర్స్ ను ఎదురించిన గొప్ప వీరుడు రణబాలి. ఇలాంటి గొప్ప చారిత్రక నేపథ్య చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న రాహుల్ అన్నకు థ్యాంక్స్. మైత్రీ లాంటి గొప్ప సంస్థ ఈ సినిమాను రాజీ పడకుండా నిర్మించింది. రశ్మిక తన మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు యాడ్ చేశారు. ఇలాంటి హానెస్ట్, ఇంటెన్స్ కథ దొరికితే విజయ్ లాంటి గొప్ప నటులు ఎంత బాగా పర్ ఫార్మ్ చేస్తారో మనం రణబాలి సినిమాలో చూడబోతున్నాం. అన్నారు.
డైరెక్టర్ శౌర్యువ్ మాట్లాడుతూ - రణబాలి ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమాను ఈ నెల 16న థియేటర్స్ లో చూసేందుకు వెయిట్ చేస్తున్నా. నేను విజయ్ తో చేస్తున్న సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. రౌడీ జనార్థన తర్వాత మా మూవీ మొదలుపెడతాం. ఈ సినిమాను గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రీ సంస్థకు నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు.
డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ - డైరెక్టర్ రాహుల్ 2015లో నాకొక కథ చెప్పారు. ఆయన మంచి దర్శకుడు అవుతారని అప్పుడే ఊహించాను. అదే ఇయర్ లో విజయ్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించి ఆకట్టుకున్నారు. మైత్రీ సంస్థ కూడా దాదాపు అదే టైమ్ లో ఇండస్ట్రీలోకి వచ్చింది. రశ్మిక కెరీర్ కూడా అదే టైమ్ లో స్టార్ట్ అయ్యింది. ఈ రోజు వీళ్లంతా కలిసి ఇంత పెద్ద ప్రెస్టీజియస్ మూవీ చేయడం హ్యాపీగా ఉంది. రణబాలి చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ - విజయ్ దేవరకొండ ఎప్పుడూ స్టారే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ విజయ్ కు ఉంది. రశ్మిక నటిస్తే ఒక హీరో నటించినంత క్రేజ్ ఏర్పడుతుంది. రశ్మిక, విజయ్ ఈ సినిమాను తమ వెడ్డింగ్ గిఫ్ట్ గా ప్రేక్షకులకు ఇవ్వబోతున్నారు. రాహుల్ ఈ సినిమాను ఎంతో గొప్పగా రూపొందించారు. మా మైత్రీ సంస్థకు ఇరుముడి తర్వాత రణబాలి మరో పెద్ద విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ - విజయ్ గురించి మాట్లాడాలంటే నాకు ఖుషి సినిమా రోజులు గుర్తొస్తాయి. రణబాలి రిలీజైన 16వ తేదీన విజయ్ ఇంటికి వెళ్లి ఆయనకు కంగ్రాట్స్ చెప్పాలని ఉంది. రణబాలి లాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అప్పట్లో అల్లూరి సీతారామరాజు, మన జనరేషన్ లో ఆర్ఆర్ఆర్..అలా ఒక గొప్ప దేశభక్తి ఉన్న చిత్రమిది. టెక్నికల్ గా, స్క్రిప్ట్ పరంగా ఈ సినిమాను ఎంతో క్వాలిటీగా రూపొందించారు డైరెక్టర్ రాహుల్. రాహుల్ లోని ప్యాషన్ ఈ సినిమాలో కనిపిస్తోంది. రణబాలి లాంటి సినిమా చేయడం ఈజీ కాదు. ఒక్క వీఎఫ్ఎక్స్ షాట్ రాకున్నా రెండు మూడు నెలలు సినిమా ఆగిపోతుంది. ప్రతి దర్శకుడు రశ్మికతో సినిమా రూపొందించాలని కోరుకుంటున్నారు. అంత గొప్ప పర్ ఫార్మర్ రశ్మిక. మీ కోసం ఒక గ్రేట్ స్క్రిప్ట్ రెడీ చేస్తాను. మైత్రీ రవి గారు, నవీన్ గారు ఉండటం వల్లే మాలాంటి ఎంతోమంది దర్శకులు తమ విజన్ ను తెరపైకి తీసుకురాగలుగుతున్నారు. అన్నారు.
ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని మాట్లాడుతూ - రణబాలి లాంటి సినిమాను నిర్మించే అవకాశం అరుదుగా వస్తుంటుంది. మాకు ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రమిది. ఇలాంటి గొప్ప కథను మా దగ్గరకు తీసుకొచ్చిన డైరెక్టర్ రాహుల్ కు థ్యాంక్స్. విజయ్, రశ్మిక వివాహం తర్వాత ఫస్ట్ చేస్తున్న సినిమా మాదే కావడం అదృష్టంగా భావిస్తున్నాం. మా మూవీకి వర్క్ చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. ఈ నెల 16న థియేటర్స్ కు వచ్చి మా సినిమా చూడాలని కోరుతున్నాం. అన్నారు.
ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ - రణబాలి సినిమా ఎందుకు చూడాలంటే ఇది మన కథ, మన కల్చర్ తో రూపొందిన సినిమా. మనకు తెలియని చరిత్రను చూపించే సినిమా. మన తెలుగు వీరుడి గొప్పదనం చెప్పే సినిమా. ఒక అల్లూరి, ఒక కొమరం భీమ్ లా మన తెలుగు హీరో రణబాలి. ఆ సినిమాల రేంజ్ లో మా రణబాలిని కూడా హిట్ చేయాలని కోరుకుంటున్నా. జానపదంతో మొదలయ్యే ఈ సినిమా అదే జానపదంతో ముగుస్తుంది. మా విజయ్, రశ్మిక మధ్య వచ్చే డ్రామా, కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంటుంది. ఇరుముడిలా ఒక డివైన్ ఎలిమెంట్ కూడా ఉంది. ఇవన్నీ కలిసి రణబాలి మీ అందరికి బాగా నచ్చుతుంది అందులో సందేహం లేదు. మా బంగారుకొండ విజయ్ దేవరకొండకు ఆయన పడిన కష్టానికి ఈ సినిమాతో పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాం. రశ్మికతో మా సంస్థకు పాన్ ఇండియా హిట్స్ ఉన్నాయి. వీళ్లతో మళ్లీ మళ్లీ మూవీస్ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా. అన్నారు
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ - నేను ఫస్ట్ కథ చెప్పిన హీరో విజయ్. ఆయన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి హిట్స్ తర్వాత కూడా మాతో అంతే ప్రేమగా స్నేహంగా ఉండేవారు. సక్సెస్ లో మారని హీరో విజయ్. నేను ఆయన కలిసి చేసే సినిమా స్పెషల్ గా ఉంటుంది. విజయ్, రశ్మిక జంట చాలా బాగున్నారు. రణబాలి లాంటి కథను రాసి, దాన్ని విజువల్ గా ఊహించి తెరపైకి తీసుకురావడం చాలా గ్రేట్. అందుకు రాహుల్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నా. మైత్రీ సంస్థకు ఈ సినిమా మరో మంచి విజయం అందించాలి. అన్నారు.
డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ - మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒక సముద్రం. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక బిగ్ పార్ట్ గా ఈ ప్రొడక్షన్ హౌస్ ఉందంటే కేవలం వ్యాపారమే కాదు అంతకుమించిన మంచితనం, అనుబంధం అందరితో ఏర్పర్చుకోవడం వల్లే. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలి, అన్నం అనే దగ్గర ఈ కథ మొదలైంది. ఆకలి తీరితే జననం, లేకుంటే మరణం. ఈ ఆకలిని ఆయుధంగా మలుచుకుని పరాయి దేశం వాళ్లు మనల్ని 250 ఏళ్లు ఇష్టం వచ్చినట్లు పాలించారు. ఆ చరిత్రను మనకు తెలియకుండా చేశారు. ఆ మరుగున పడిన చరిత్ర గురించి చదివినప్పుడు ఇలాంటి కథను మన ప్రజలకు చెప్పాలి, లేకుంటే దర్శకుడిగా నా ప్రయత్నం వృథా అనిపించింది. ఆ మరుగున పడిన చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో డిస్ట్రబ్ అయ్యాను. ఎవడో మన చరిత్రను మార్చేసి, చెప్పినట్లు మనం బతుకుతున్నాం. మనం మనల్ని తక్కువ చేసుకుని చూస్తుంటాం. కానీ ఈ చరిత్రను తెలుసుకుంటే మనం ఎంత గొప్పవాళ్లమో అర్థమవుతుంది. మన పాఠ్యపుస్తకాల్లోనూ మన చరిత్రను సరిగ్గా చెప్పలేదు. అందుకే మన చరిత్రను మనమే చెప్పుకుందాం. మన చరిత్రను మనమే షేర్ చేసుకుందాం. అలా మొదలైన ప్రయాణమే రణబాలి. నా బ్రదర్ ప్రమోద్ ఈ కథ గురించి నాకు మొదట చెప్పాడు. సీమలో పుట్టిన వ్యక్తిని నేను. మనం పుట్టిన నేల గురించి ప్రతి ఒక్కరికీ జ్ఞాపకాలు ఉంటాయి. ఆ జ్ఞాపకాలను ఒక సినిమా చేద్దామని అనుకున్నాను. ఆ క్రమంలో నాలుగేళ్లు గడిచిపోయాయి అనేది కూడా నాకు తెలియలేదు. పిచ్చిపట్టినట్లు నన్ను కదిలించే కథ కావాలనుకున్నాను. అలాంటి కథ రణబాలితో దొరికింది. ఈ సినిమాకు మైత్రీ సంస్థ నుంచి మొదలు మా అదృష్టం కొద్దీ మంచి కాస్ట్ అండ్ క్రూ దొరికారు. విజయ్, రశ్మిక పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయం నాకు రణబాలి సినిమా కొంత షూట్ జరిగే వరకు తెలియదు. అప్పటికే మా సినిమాలో వీళ్ల పెళ్లి చేశాం. ఆ పోస్టర్ రిలీజ్ చేశాం. ఆ పోస్టర్ చూసి సెట్ లో ఉన్న అందరూ చూడముచ్చటగా ఉన్నారు జంట అన్నారు. విజయ్, రశ్మిక ఈ చిత్రంలో భార్యా భర్తల్లా నటించారు. వాళ్ల నటన ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. జయమ్మగా రశ్మిక అద్భుతమైన నటనను ఈ సినిమాలో చూస్తారు. నా ఫస్ట్ సినిమా టాక్సీవాలా హీరో విజయ్, ఇప్పుడు నా రణబాలి. ఈ కథ అనుకున్నప్పుడు ఒక వీరుడి లాంటి కటౌట్ కావాలి. ఆ హీరో ఎవరంటే విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటవిశ్వరూపం చూస్తారు. రాయలసీమ యాస చెప్పడం కష్టం. కానీ రణబాలిగా విజయ్ చెప్పే డైలాగ్స్ ఎంత బాగా చెప్పాడు అనిపిస్తాయి. మా సినిమాకు యు ఎ సర్టిఫికెట్ వచ్చింది. మీ పిల్లలకు రణబాలి చూపించండి. అన్నారు.
హీరోయిన్ రశ్మిక మందన్న మాట్లాడుతూ - కొన్ని నెలల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. జయమ్మగా మీరు చేస్తున్న రీల్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. రణబాలి సెట్ లో టీమ్ అంతా నెలలు నెలలు హార్డ్ వర్క్ చేసేవారు. నేను నా క్యారెక్టర్ పర్ ఫార్మ్ చేసేందుకు నాలుగైదు రోజులు షెడ్యూల్ కోసం వెళ్లాను. అలాంటి టైమ్ లో వాళ్లు చేసే హార్డ్ వర్క్ చూస్తే భయమేసేది. రణబాలి కోసం ఈ టీమ్ ఎంత కష్టపడ్డారో చూసిన మొదటి ఆడియెన్ ను నేను. ఈ సినిమా కోసం థియేటర్ కు వెళ్తే మీరు మరో ప్రపంచంలో అడుగుపెడతారు. ఏ సినిమా చేయాలన్నా అది రాసిపెట్టి ఉండాలని నమ్ముతాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు అదృష్టంగా భావించా. నాకు, విజయ్ కు ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం. నేను విజయ్ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చేశాం. అవి లవ్ స్టోరీస్ కానీ రణబాలి లో లవ్ స్టోరీ ఉండదు. కానీ అద్భుతమైన లవ్ ట్రాక్ ఉంటుంది. రణబాలి లవ్ స్టోరీ మూవీ కంటే చాలా చాలా పెద్దది. మేము లవ్ స్టోరీ మూవీ కూడా చేస్తాం. జయమ్మ అనే పాత్ర మీ మనసుల్లో ఉండిపోతుంది. రణబాలి నెక్ట్స్ లెవెల్ సక్సెస్ అందుకోనుంది. మైత్రీ సంస్థ మా హోమ్ బ్యానర్ లాంటిది. మనం మరిన్ని మూవీస్ చేయాలి. అన్నారు.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ఈ రోజు ఈవెంట్ కు వచ్చిన నా డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్స్. వాళ్లలో కొందరితో వర్క్ చేశా. మరికొందరితో చేయబోతున్నా. మీలాంటి మంచి డైరెక్టర్స్ వల్లే నేను రోజూ హ్యపీగా షూట్ కు వెళ్తున్నా. తిరుపతి బ్రహ్మోత్సవాలు, తెలంగాణలో బతుకమ్మ పండుగ, విజయవాడలో ఉత్సవాలు మొదలయ్యాయి, పిల్లలకు హాలీడేస్ మొదలయ్యాయి. అంతటా ఒక పండుగ వైబ్ ఉంది. ఈ నెల 16న తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడేలా రణబాలి వస్తోంది. రాహుల్ తన నెక్ట్స్ మూవీ రూరల్ పీరియాడిక్ యాక్షన్ మూవీ చేయాలనుకున్నప్పుడు ఆయన ఊరికి వెళ్లి అక్కడ కథలు వింటూ, జాతరలు, పండుగలు చూస్తూ. ఆ జాతరలో చెప్పే బుర్రకథలు, జానపదాలు వింటూ అందులోని వీరుల గురించి తెలుసుకున్నాడు. వాటి నుంచి ఒక భారీ నేపథ్యమున్న సినిమాను ఊహించాడు. ఈ సినిమా గురించి వర్క్ చేస్తుంటే చరిత్రలో దాచిన కొన్ని అధ్యాయాల గురించి రాహుల్ తెలుసుకున్నాడు. అప్పుడు ఈ రణబాలి సినిమాకు ఒక గొప్ప పర్పస్ ఏర్పడింది. రాహుల్ నాతో ఒక రూరల్ మాస్ సినిమా చేసినా, ఒక హిస్టారికల్ యాక్షన్ సినిమా చేసినా ఇంత మజా వచ్చి ఉండేది కాదేమో. రాహుల్ తను చెప్పాలనుకున్న పీరియడ్ యాక్షన్ ఫిలిం, ఒక పర్పస్ ఫుల్ ఎలిమెంట్ ఏదీ వదలకుండా బ్యూటిపుల్ గా స్క్రిప్ట్ చేసి రణబాలి సినిమా రూపొందించాడు. రాహుల్ తన కెరీర్ కొనసాగించడానికి సినిమాలు చేయడు, కొన్ని గొప్ప కథలు చెప్పేందుకు సినిమాలు రూపొందిస్తాడు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు సూపర్ ఎల్ నినో ప్రభావం గురించి చెప్పారు. ప్రజల్ని జాగ్రత్తగా ఉండమన్నారు. సరిగ్గా 150 ఏళ్ల క్రితం సూపర్ ఎల్ నినో వచ్చింది. అదే గ్రేట్ మద్రాస్ ఫామైన్. ఆ టైమ్ లో బ్రిటీషర్స్ చేసిన ఘోరాల వల్ల ఆ మహా కరువు 80 లక్షల మంది చావుకు కారణమైంది. ఒక సైకిల్ లా ఆ ఎల్ నినో రిపీట్ అవుతున్నా, మనం మన పూర్వీకులు చూసిన బాధలు చూడకూడదు. అందుకే మనం నీళ్లు, కరెంట్, ఫుడ్ ను జాగ్రత్తగా వృథా చేయకుండా చూసుకోవాలి. సీఎం గారు చెప్పారంటే అది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించండి. ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్లే దమ్ము మన ఇండియన్స్ లో ఉంది. టాక్సీవాలా సినిమాను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. అయితే రిలీజ్ టైమ్ కు చాలా ఇబ్బందులు ఎదురొచ్చాయి. అప్పటికి నా నోటా మూవీ సరిగ్గా ఆడలేదు. నేను మళ్లీ పుంజుకుంటా అని ఒక లేఖ రాశాను. ఆ మాట నిలబెట్టుకుంటూ టాక్సీవాలా సక్సెస్ మీట్ లో మాట్లాడాను. రాహుల్.. రణబాలితో నాకు అలాంటి మరో వేదిక ఇవ్వబోతున్నావు. మన మీద మనకు నమ్మకం, చేసే పనిలో ప్రాణం పెట్టి కష్టపడటం ఈ రెండే మన చేతిలో ఉంటాయి. తెలుగు సినిమా గ్లోబల్ గా పేరు తెచ్చుకోవడంలో మైత్రీ సంస్థ పాత్ర కీలకంగా ఉంది. కథ నచ్చితే చాలు గొప్పగా స్క్రీన్ మీదకు ప్రాడక్ట్ తీసుకొస్తారు. మా కెరీర్ లో అజయ్ అతుల్ ఏందయ్యా సామీ అనే ఫరెవర్ క్లాసికల్ సాంగ్ ఇచ్చారు. రశ్మికతో నేను చేస్తున్న మూడో చిత్రమిది. నటిగా, పర్సన్ గా తను ఎంతో ఎదిగింది. రశ్మిక ఒక రోబోలా కష్టపడుతుంది. రశ్మిక సంపాదించిన గుర్తింపు చూసి గర్వపడుతుంటా. ఈ సినిమాకు రశ్మిక అవసరం. ఈ చిత్రంలో రణబాలి, రశ్మిక జంట ఇచ్చే ఇంపాక్ట్ కు రశ్మిక అయితేనే న్యాయం చేయగలుగుతుంది. ఈ నెల 16న థియేటర్స్ లో కలుద్దాం. సినిమా రిలీజ్ తర్వాత విజయవాడ, అనంతపూర్ వస్తాం. అన్నారు.
నటీనటులు - విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ, తదితరులు
టెక్నికల్ టీమ్
బ్యానర్ - మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ - గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్
ప్రొడ్యూసర్స్ - నవీన్ యెర్నేని, రవిశంకర్
స్టోరీ, డైరెక్షన్ - రాహుల్ సంకృత్యన్
కో ప్రొడ్యూసర్స్- అనురాగ్ పర్వతనేని, శివ్ చనన
సీఈవో - చెర్రి
మ్యూజిక్ - అజయ్ - అతుల్
డీవోపీ - నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ
రైటర్ - ప్రమోద్ తమ్మినేని
ప్రొడక్షన్ డిజైనర్ - శివం రావు నాగసాని
ఎడిటర్ - కార్తీక శ్రీనివాస్ ఆర్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఆర్ చంద్రశేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - చెంబోలు సాయి ఆదిత్య
కొరియోగ్రఫీ - కృతి మహేశ్
కాస్ట్యూమ్ డిజైనర్ - అర్చన రావు
ఆర్ట్ డైరెక్టర్ - విఠల్ కోసనం
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ - సునీల్ రాజు చింత
యాక్షన్ కొరియోగ్రాఫర్స్ - యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు
సౌండ్ డిజైనర్ - రఘునాథ్ కెమిశెట్టి
పబ్లిసిటీ డిజైనర్ - కబిలన్ చెల్లయ్య
