pizza
Sahasam Seyara Dimbhaka song launch at Big FM
You are at idlebrain.com > News > Functions
Follow Us

17 June 2015
Hyderabad

‘సాహసం సేయరా డింభకా’ సాంగ్ లాంచ్..!

శ్రీ, హమీద, సమత, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో హంస వాహిని టాకీస్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘సాహసం సేయరా డింభకా’. తిరుమల శెట్టి కిరణ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎమ్‌.ఎస్‌.రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను చిత్రబృందం బుదవారం హైదరాబాద్ లోని బిగ్ ఎఫ్ఎమ్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హీరో శ్రీ మాట్లాడుతూ "బిగ్ ఎఫ్ఎమ్ ద్వారా మా సినిమాలో మొదటి పాటను విడుదల చేసాము. శ్రీవసంత్‌ మంచి ట్యూన్స్‌, బ్యాగ్రౌండ్‌స్కోర్‌ ఇచ్చారు. ఒక పిరికివాడిని దయ్యం ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆదిలాబాద్ ఫారెస్ట్ లో ఈ చిత్ర షూటింగ్ నిర్వహించాం. సినిమా హిలారియాస్ గా ఉంటుంది. ఆడియో, సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాం" అని చెప్పారు.

దర్శకుడు తిరుమల శెట్టి కిరణ్ మాట్లాడుతూ "విభిన్నమైన పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఓ అమాయకుడైన అబ్బాయికి ఫారెస్ట్ లో నైట్ డ్యూటీ చేసే ఉద్యోగం వస్తుంది. అక్కడ ఓ దయ్యం అతనిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంటుంది. ఇలాంటి అంశాలతో సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. ఈ నెల 19న ఆడియో విడుదల చేసి, జూలై నెలలో సినిమాను విడుదల చేయనున్నాం" అని చెప్పారు.

ఎమ్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ "సినిమాని కిరణ్ బాగా డైరెక్ట్‌ చేశాడు. శ్రీవసంత్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. జూలై నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.

శ్రీవసంత్ మాట్లాడుతూ "ఈ సినిమాకు మ్యూజిక్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అవుట్ పుట్ బాగా వచ్చింది. రీరికార్డింగ్ కంప్లీట్ అయింది. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది" అని చెప్పారు.

హీరోయిన్ హమిద మాట్లాడుతూ "సినిమాను అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

శ్రీ, హమీద, సమత, షకలక శంకర్, జబర్దస్త్ అప్పారావు, ఆలీ, జ్యోతి, పూర్ణిమ, రాజబాబు, గీతాంజలి ముఖ్యపాత్రదారులు.

కెమెరా: యోగి, శివ కె.నాయుడు, సంగీతం: శ్రీవసంత్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత: ఎమ్.ఎస్.రెడ్డి, రచన-దర్శకత్వం: తిరుమల శెట్టి కిరణ్.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved