pizza
Thanks to audience for making "Ambajipeta Marriage Band" a blockbuster: Team at Success Meet
"అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు - సక్సెస్ మీట్ లో మూవీ టీమ్
You are at idlebrain.com > News > Functions
Follow Us


3 February 2024
Hyderabad

 

The young hero Suhas has added another super hit movie to his account. His latest movie, "Ambajipeta Marriage Band," in which he stars as the hero, was released today and received positive feedback from everyone. The film is a joint production by GA2 Pictures, director Venkatesh Maha's Mahayana Motion Pictures, and Dheeraj Mogilineni Entertainment banners, directed by Dushyanth Katikeni. Shivani Nagaram played the heroine role, while Sharanya Pradeep and Nithin played key roles. The success meet for "Ambajipeta Marriage Band" was held at the Geetha Arts office in Hyderabad. On this occasion,

Producer Allu Aravind said, "I was very happy when the 'Ambajipeta Marriage Band' team came to me and suggested that we should have success celebrations. After watching the rushes and the first copy of this movie yesterday, I felt that it was a very good movie and it deserved success. It's a pure story told without unnecessary action and other elements. There hasn't been a movie focusing on the emotions between an elder brother and a younger brother in recent times. Sharanya acted brilliantly in the role of Akka. While watching Suhas act during the interval, I was amazed and thought, 'How naturally does this boy can act?' Suhas is one of the few natural actors we have. He has a bright future ahead. He is also working on good projects in the upcoming films. Shivani also performed her roles well. Nitin impressed as the villain. As a producer, Dheeraj worked hard to bring this movie to life. Director Dushyant has shot every scene well. All productions that are part of Geetha Sanstha deserve to be successful. We seek the media's cooperation for that."

Hero Suhas said, "Watching 'Ambajipeta Marriage Band' at Sree Ramulu Theater yesterday, I was happy about the response. Thank you to the audience for giving me another hit movie. It's gratifying that they come to the theaters to watch the movie. Media friends have written good reviews for our film. Thank you to all of them."

Actress Sharanya Pradeep said, "Thank you to the media for supporting our film from the promotions to the success meet. Our director Dushyant believed that I could do the character of Padma well. I am happy that it has proven to be true in theaters today. Please come to the theaters and watch 'Ambajipeta Marriage Band.' You will definitely enjoy it."

Heroine Shivani Nagaram said, "We are thankful for the success of 'Ambajipeta Marriage Band.' I think that as a new actress, I am lucky to have the opportunity to work under such a big banner and in a good movie. I am receiving a good response for Lakshmi's character. All our co-stars and crew members gave their best. This movie has all the elements. When you come to the theater, you get the feeling of watching a good show. All age groups can enjoy our movie. The audience is connecting well with 'Ambajipeta Marriage Band."

Producer Bunny Vas said, "The audience should watch good movies like 'Ambajipeta Marriage Band' in the theatres. If we think that they will just wait for OTTs, we have no incentive to make such movies. We felt happy seeing the audience's response while watching this movie at Sree Ramulu Theatre. I told Dheeraj that the scenes where I predicted the audience would respond well, indeed, they did. Media friends gave genuine reviews. Suhas performed brilliantly. We all know how committed he is to this film. He is fully focused. He even shaved twice. The effect was seen on the screen. Sharanya and Shivani performed well. Dheeraj, me, and SKN are part of Allu Aravind's Geetha Arts Family. Aravind sir will be very happy about our success."

Producer Dheeraj Mogilineni said, "Thank you to the Telugu audience for making 'Ambajipeta Marriage Band' a success. When we made this film, we believed in its content only. Even if you didn't believe what we said before the release about good content, now, after the success, everyone knows. While watching the movie with the media at Sriramulu Theatre, we were happy to see the audience connecting and enjoying every scene. Good movies should be supported by the audience. Suhas, Sharanya, Shivani, and Nitin impressed with their performances. Enjoy 'Ambajipeta Marriage Band' in your nearest theater."

Director Dushyanth Katikeni said, "When we came to know that we were making a film with Geetha Arts, we felt a double responsibility. They supported us a lot. They said that this story should be screened without any deficiencies. I am happy with the audience's response today. The audience is relating to some element in this movie with their real life. A huge response comes when the sister scene arrives at the police station. The success of our film is due to the fact that each of the artists took ownership and acted. The success of this film has given me more responsibility as a director."

Actor Nithin said, "Thanks to producer Dheeraj and director Dushyanth for giving me a strong villain role in 'Ambajipeta Marriage Band.' I felt happy acting alongside Suhas. My character is receiving a good response."

Producer SKN said, "Thank you to the media for supporting 'Ambajipeta Marriage Band.' From today, we are going to talk about the collections of this movie. Go and watch the movie with your family. It's liked by audiences from all walks of life. We are happy that Dheeraj, who is like a family member in our Geetha organization, is achieving success. While watching this movie in the theater, a thousand audience members are responding to the scenes on the screen simultaneously. They liked the movie so much. Everyone's performance, including Suhas's, is good. All the departments gave their best output. This movie will not be coming to OTT anytime soon. Watch it in theaters."

"అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు - సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

యంగ్ హీరో సుహాస్ తన ఖాతాలో మరో సూపర్ హిట్ మూవీ చేర్చుకున్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చి అన్ని చోట్ల నుంచీ సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు దుశ్యంత్ కటికినేని రూపొందించారు. శివాని నాగరం హీరోయిన్ గా నటించగా..శరణ్య ప్రదీప్, నితిన్ కీ రోల్స్ చేశారు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" టీమ్ నా దగ్గరకు వచ్చి మనం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అన్నప్పుడు చాలా సంతోషమేసింది. ఈ సినిమా రషెస్ చూసినప్పుడు, నిన్న ఫస్ట్ కాపీ చూశాక ఇది చాలా మంచి సినిమా, సక్సెస్ కావాలి అనిపించింది. యాక్షన్, ఇతర అనవసర ఎలిమెంట్స్ లేకుండా స్వచ్ఛంగా ఒక కథ చెప్పారు. ఇటీవల కాలంలో అక్కా తమ్ముడి మధ్య ఎమోషన్స్ తో సినిమా రాలేదు. శరణ్య అక్క క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది. ఇంటర్వెల్ టైమ్ కు సుహాస్ యాక్టింగ్ చూస్తుంటే ఈ కుర్రాడు ఏం నటిస్తున్నాడు రా అనిపించింది. అంత సహజంగా నటించాడు. మనకున్న అతి కొద్ది మంది న్యాచురల్ యాక్టర్స్ లో సుహాస్ ఉంటాడు. చాలా పైకి వస్తాడు. ఇక చేయబోయే సినిమాలు కూడా గుడ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. శివాని కూడా తన క్యారెక్టర్స్ కు తగినట్లు చేసింది. విలన్ గా నితిన్ ఆకట్టుకున్నాడు. నిర్మాతగా ధీరజ్ నిర్మాతగా ఈ మూవీని బాగా తీసుకురావాలని ఎంతో ప్రయత్నించాడు. దర్శకుడు దుశ్యంత్ ప్రతి సీన్ ను చక్కగా తెరకెక్కించాడు. గీతా సంస్థలో భాగమైన ఈ ప్రొడక్షన్స్ అన్నీ సక్సెస్ కావాలి. అందుకు మీడియా సహకారం కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో సుహాస్ మాట్లాడుతూ - నిన్న శ్రీరాములు థియేటర్ లో "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా చూస్తున్నప్పుడు వచ్చిన రెస్పాన్స్ కు హ్యాపీగా అనిపించింది. నాకు మరో హిట్ సినిమా అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. థియేటర్స్ దాకా వచ్చి సినిమా చూస్తున్నారు. సంతోషంగా ఉంది. మీడియా మిత్రులు మా సినిమాకు మంచి రివ్యూస్ రాశారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.

నటి శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ - మా సినిమా ప్రమోషన్స్ నుంచి సక్సెస్ మీట్ దాకా సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి థ్యాంక్స్. పద్మ క్యారెక్టర్ ను నేను బాగా చేయగలను అని మా డైరెక్టర్ దుశ్యంత్ నమ్మారు. అది ఇవాళ థియేటర్స్ లో ప్రూవ్ అయినందుకు సంతోషంగా ఉంది. మీరు థియేటర్స్ కు వచ్చి "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

హీరోయిన్ శివాని నాగరం మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీకి మీరు ఇచ్చిన సక్సెస్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. నాలాంటి కొత్త యాక్ట్రెస్ కు ఇంత పెద్ద బ్యానర్, మంచి మూవీలో అవకాశం దక్కడం లక్ అనుకుంటాను. నేను చేసిన లక్ష్మీ క్యారెక్టర్ కు మంచి రెస్పాన్ వస్తోంది. మా కోస్టార్స్, క్రూ మెంబర్స్ అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. అన్ని ఎలిమెంట్స్ ఉన్న మూవీ ఇది. మీరు థియేటర్ కు వస్తే ఒక మంచి షో చూసిన ఫీల్ కు గురవుతారు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్లు మా మూవీని చూడొచ్చు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. అన్నారు.

నిర్మాత బన్నీవాస్ మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" లాంటి మంచి సినిమాలను ప్రేక్షకులు థియేటర్ లోనే చూడాలి. ఓటీటీలకి వస్తుందని కదా అనుకుంటే ఇలాంటి మూవీస్ చేసేందుకు మాకు ప్రోత్సాహం ఉండదు. శ్రీరాములు థియేటర్ లో ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆడియెన్స్ రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యాం. నేను ఏ సీన్స్ లో ఆడియెన్స్ బాగా రెస్పాండ్ అవుతారని ధీరజ్ కు చెప్పానో అక్కడే రెస్పాండ్ అవుతున్నారు. మీడియా ఫ్రెండ్స్ జెన్యూన్ రివ్యూస్ ఇచ్చారు.సుహాస్ అద్బుతంగా పర్ ఫార్మ్ చేశాడు. ఈ సినిమా కోసం అతను ఎంత కమిటెడ్ గా పనిచేశాడో మా అందరికీ తెలుసు. పూర్తి ఫోకస్ తో ఉన్నాడు. రెండు సార్లు గుండు చేసుకున్నాడు. తెరపై ఆ ఎఫెక్ట్ కనిపించింది. శరణ్య, శివానీ బాగా పర్ ఫార్మ్ చేశారు. ధీరజ్, నేను, ఎస్ కేఎన్ ..మేమంతా అల్లు అరవింద్ గారి గీతా ఆర్ట్స్ ఫ్యామిలీ. మా సక్సెస్ కు అరవింద్ గారు ఎంతో సంతోషిస్తారు. అని చెప్పారు.

నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాను సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. మేము ఈ సినిమా చేసేప్పుడు కేవలం కంటెంట్ నే నమ్మాం. మంచి కంటెంట్ అని రిలీజ్ ముందు మేము చెప్పిన మాటలు నమ్మకున్నా..ఇప్పుడు సక్సెస్ తర్వాత అందరికీ తెలిసింది. శ్రీరాములు థియేటర్ లో మీడియాతో కలిసి సినిమా చూస్తున్నప్పుడు ప్రతి సీన్ కు ప్రేక్షకులు కనెక్ట్ అయి ఎంజాయ్ చేయడం చూసి హ్యాపీగా ఫీలయ్యాం. మంచి సినిమాలను ప్రేక్షకులే ముందుకు తీసుకెళ్లాలి. సుహాస్, శరణ్య, శివాని, నితిన్ వీళ్లంతా తమ పర్ పార్మెన్సులతో ఆకట్టుకున్నారు. మీ దగ్గరలోని థియేటర్ లో "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

డైరెక్టర్ దుశ్యంత్ కటికనేని మాట్లాడుతూ - గీతా ఆర్ట్స్ లో సినిమా చేస్తున్నామని తెలిసినప్పుడే డబుల్ రెస్పాన్సిబిలిటీ ఫీలయ్యాం. వాళ్లు మాకు అంత సపోర్ట్ గా నిలిచారు. ఈ కథను ఎక్కడా లోటు లేకుండా తెరకెక్కించాలని చెప్పారు. ఇవాళ ఆడియెన్స్ చూపిస్తున్న రెస్పాన్స్ కు సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్ కు ప్రేక్షకులు తమ రియల్ లైఫ్ తో రిలేట్ చేసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ లో సిస్టర్ సీన్ వచ్చినప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు ఎంతో ఓన్ చేసుకుని నటించడం వల్లే మా సినిమా రీచ్ అయ్యింది. దర్శకుడిగా ఈ సినిమా విజయం నా మీద మరింత బాధ్యత పెంచింది. అన్నారు.

యాక్టర్ నితిన్ మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాలో నాకు స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ధీరజ్, డైరెక్టర్ దుశ్యంత్ గారికి థ్యాంక్స్. సుహాస్ గారితో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. నా క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్నారు

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి థ్యాంక్స్. ఇవాళ్టి నుంచి ఈ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీ ఫ్యామిలీతో కలిసి వెళ్లి సినిమా చూడండి. ప్రతి ఒక్కరు, అన్ని వర్గాల ఆడియెన్స్ ఇష్టపడతారు. మా గీతా సంస్థలో ఫ్యామిలీ మెంబర్ లాంటి ధీరజ్ కు సక్సెస్ రావడం హ్యాపీగా ఉంది. థియేటర్ లో ఈ సినిమా చూస్తుంటే ఒక వెయ్యి మంది ఆడియెన్స్ ఒకేసారి తెరపై వచ్చే సీన్స్ కు రెస్పాండ్ అవుతున్నారు. వారికి సినిమా అంతగా నచ్చింది. సుహాస్ తో సహా ప్రతి ఒక్కరి పర్ ఫార్మెన్స్ బాగుంది. అన్ని క్రాఫ్ట్ లు బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాయి. ఇప్పుడప్పుడే ఓటీటీలో ఈ సినిమా రావడం లేదు. థియేటర్స్ లోనే చూడండి. అన్నారు.

 


Photo Gallery

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved