pizza
Ambajipeta Marriage Band Success Meet
"Ambajipeta Marriage Band" audience proved our faith by giving blockbuster success: team at success press meet
"అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాపై మేము పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టారు - సక్సెస్ మీట్ లో మూవీ టీమ్
You are at idlebrain.com > News > Functions
Follow Us


5 February 2024
Hyderabad

At the start of this year, the movie "Ambajipeta Marriage Band" became another super hit in Tollywood. Featuring Suhas and Shivani Nagaram in lead roles, the film is a joint production by GA2 Pictures, Venkatesh Maha's Mahayana Motion Pictures, and Dheeraj Mogilineni's Entertainment banners. Directed by Dushyant Katikeni, Sharanya Pradeep and Nithin played key roles. The success meet for "Ambajipeta Marriage Band," which is proving to be a blockbuster both domestically and overseas, was held in Hyderabad. On this occasion,

Actor Trinadh stated, "I portrayed a significant character named Erranna in this movie. Many artists in this film have delivered strong performances, all thanks to our director Dushyant’s talent. I wish 'Ambajipet Marriage Band' even greater success."

Actress Divya expressed, "'Ambajipeta Marriage Band' is not just a film to be remembered for a few days, but for years. Director Dushyant offered me a significant role. Shivani and Suhas were very supportive and friendly during the shoot. The audience has appreciated the performances of Shivani, Suhas, and Nithin in theaters. Congratulations to the entire team."

Editor Pawan Kalyan remarked, "I am thankful to have been part of such a wonderful film. Our editing room was always lively with Bunny Vas and Sandeep around. It was a privilege to work with Suhas, and Shivani has become a star with this movie. Congratulations to all the artists and the technical team who worked alongside me."

Cinematographer Wajid Baig said, "This is my debut movie. I would like to thank Geetha Arts and Dheeraj for believing in me and giving me a chance as a cinematographer. Everyone who worked on this movie collaborated as a team. Suhas brother will always be an inspiration to me."

Actor Nithin stated, "I think 'Ambajipeta Marriage Band' has fulfilled the desire of those who want good content movies, similar to those in Tamil and Malayalam, to be made in Telugu as well. Visiting theaters and seeing the response to this movie has been very gratifying. They have proved that Suhas is not just a hero but a good actor. The characters of Shivani and Sharanya elevate the story."

Heroine Shivani expressed, "Congratulations to our producer Dheeraj for the hit with 'Ambajipeta Marriage Band'. He deserves many more successes. After my parents, I am indebted to our director Dushyant. He introduced me as a heroine with a hit movie. This good movie came about today because of Suhas. I wish for Suhas's continued success. Not just the lead pair, but all the other artists received acclaim. Thanks to everyone who supported our film."

Director Dushyanth remarked, "It's not enough to write such stories; we need people who have the courage to produce them. Geetha Arts, Dheeraj, and Bunny Vas took that risk. Thanks to the hero Suhas, who believed in the story along with the producers. Everyone who has seen the movie is talking about every scene. From the hero-heroine breakup scene to the police station scene, everything is memorable. The audience is asking many questions through social media, like 'Why didn't you kill the villain?' It is a story between pride and self-love. We have conveyed in this movie that suicide is not a solution to problems. The audience, especially those with sisters, is getting emotional. Thanks to the audience for supporting our film so much. Thanks to Suhas, Shivani, Nithin, Sharanya, and all the team who supported in the making."

Producer Dheeraj Mogilineni said, "DJ Tillu and Baby, movies I co-produced, were hits by the time 'Ambajipeta Marriage Band' came out. Some asked why I chose this film after such big films, noting they are different genres. In my view, 'Ambajipeta Marriage Band' is a genuine movie. I felt the same when I first heard the story. Despite suggestions to cast a star hero, I believed Suhas was perfect for this role. We are satisfied to have given a platform to many newcomers. Along with myself, Suhas, and director Dushyanth, the audience placed their trust in this film. Thanks to all of them. We've held special shows in the two Telugu states and interacted with audiences who watched it. We're grateful for director Sai Rajesh's support. From script to the first copy, we've been careful to avoid any controversy regarding caste insult in this movie."

Hero Suhas said, "Thanks to the audience for giving me a hat-trick. I'm happy that your faith in me brings you to theaters. Even before the movie's release, Dheeraj and I believed we were making a hit. Today, I'm glad that belief has proven true. In this movie, not just the hero, but other characters are also important. That's the strength of this script. Even if others perform well, the hero receives the acclaim for the film's success. I'd like to thank every team member of 'Ambajipeta Marriage Band'. Anurag and Sarath are unforgettable in my life. Teja Kakumanu was our teacher. I always aim to grow, and Teja Kakumanu is a big reason for the acclaim my acting has received. With good collections in just three days, we aim for a bigger hit. Tours start tomorrow. See you all."

"అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాపై మేము పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టారు - సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

ఈ ఇయర్ బిగినింగ్ లోనే టాలీవుడ్ కు మరో సూపర్ హిట్ ఇచ్చింది "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా. సుహాస్, శివాని నాగరం జంటగా నటించిన ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు దుశ్యంత్ కటికినేని రూపొందించారు. శరణ్య ప్రదీప్, నితిన్ కీ రోల్స్ చేశారు. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తున్న "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా

యాక్టర్ త్రినాథ్ మాట్లాడుతూ - ఈ సినిమాలో ఎర్రన్న అనే మంచి క్యారెక్టర్ చేశాను. నాకే కాదు ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులకు చాలా బలమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇదంతా మా డైరెక్టర్ దుశ్యంత్ గారి ప్రతిభే అని చెప్పాలి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు మరింత పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటి దివ్య మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" కొన్ని రోజులకు గుర్తుండిపోయే సినిమా కాదు కొన్ని ఏళ్లు గుర్తుండే మూవీ. ఈ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చారు డైరెక్టర్ దుశ్యంత్ గారు. మూవీ చేస్తున్నప్పుడు శివాని, సుహాస్ ఎంతో సపోర్ట్ చేసి ఫ్రెండ్లీగా ఉన్నారు. థియేటర్ లో శివాని, సుహాస్, నితిన్ పర్ ఫార్మెన్స్ లకు ఆడియెన్స్ బాగా రెస్పాండ్ అవుతున్నారు. టీమ్ అందరికీ నా కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

ఎడిటర్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ - ఇలాంటి మంచి మూవీలో నన్ను పార్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతున్నా. మా ఎడిటింగ్ రూమ్ బన్నీవాస్ గారు, సందీప్ గారు వీళ్లతో కళకళలాడుతూ ఉండేది. సుహాస్ తో పనిచేయడం లక్కీగా భావిస్తున్నా. శివాని ఈ మూవీతో స్టార్ అయ్యింది. నాతో పాటు పనిచేసిన టెక్నికల్ టీమ్ అందరికీ ఆర్టిస్టులు అందరికీ కంగ్రాట్స్. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ వాజిద్ బేగ్ మాట్లాడుతూ - ఇది నా డెబ్యూ మూవీ. నన్ను నమ్మి సినిమాటోగ్రాఫర్ గా ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్, ధీరజ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాకు పనిచేసిన వాళ్లంతా ఒక టీమ్ గా వర్క్ చేశారు. సుహాస్ బ్రదర్ నాకు ఎప్పటికీ ఒక ఇన్సిపిరేషన్ గా నిలిచిపోతాడు. అన్నారు.

యాక్టర్ నితిన్ మాట్లాడుతూ - తమిళం, మలయాళంలో వస్తున్న మంచి కంటెంట్ మూవీస్ తెలుగులోనూ రావాలని అనుకునేవారి కోరికను "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" తీర్చిందని అనుకుంటున్నా. థియేటర్స్ విజిటింగ్ చేస్తున్నప్పుడు హాల్స్ లో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది. సుహాస్ హీరోను కాదు మంచి యాక్టర్ ను అని ప్రూవ్ చేసుకున్నారు. శివాని, శరణ్య క్యారెక్టర్స్ కథలో హై తీసుకొచ్చాయి. అన్నారు.

హీరోయిన్ శివాని మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" తో హిట్ అందుకున్న మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి కంగ్రాట్స్. ఆయన ఇలాంటి మరెన్నో సక్సెస్ లు అందుకోవాలి. అమ్మా నాన్న తర్వాత నేను రుణపడి ఉండేది మా డైరెక్టర్ దుశ్యంత్ గారికే. ఆయన నన్ను హిట్ సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేశారు. సుహాస్ వల్లే ఇవాళ ఇలాంటి మంచి సినిమా వచ్చింది. సుహాస్ కు సక్సెస్ కంటిన్యూ కావాలి. లీడ్ పెయిర్ కే కాదు మిగతా ఆర్టిస్టులందరికీ మంచి పేరొచ్చింది. మా సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.

డైరెక్టర్ దుశ్యంత్ మాట్లాడుతూ - ఇలాంటి కథలు రాయడంతోనే సరిపోదు ప్రొడ్యూస్ చేసే ధైర్యం గల వాళ్లు కావాలి. గీతా ఆర్ట్స్, ధీరజ్ గారు, బన్నీ వాస్ గారు ఆ ధైర్యం చేశారు. ప్రొడ్యూసర్స్ తో పాటు కథను నమ్మిన హీరో సుహాస్ కు థ్యాంక్స్. సినిమా చూసిన వాళ్లంతా ప్రతి సీన్ గురించి మాట్లాడుతున్నారు. హీరో హీరోయిన్ బ్రేకప్ సీన్, పోలీస్ స్టేషన్ సీన్..ఇలా ప్రతి ఒక్కటీ గుర్తుపెట్టుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులు చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు. విలన్ ను ఎందుకు చంపలేదు అంటూ. ఇది అహంకారానికి, ఆత్మాభిమానికి మధ్య జరిగే కథ. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు అని ఈ మూవీలో చెప్పాం. సిస్టర్స్ ఉన్న ఆడియెన్స్ అయితే ఎమోషనల్ అవుతున్నారు. మా సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. సుహాస్, శివాని, నితిన్, శరణ్య తో పాటు మేకింగ్ లో సపోర్ట్ గా ఉన్న టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.

ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా ఒప్పుకునే టైమ్ కు నేను కో ప్రొడ్యూస్ చేసిన డీజే టిల్లు, బేబి మూవీస్ హిట్ అయ్యాయి. అంత పెద్ద సినిమాలు చేసిన నువ్వు ఈ సినిమా ఎందుకు చేస్తున్నావు అని కొందరు అడిగారు. అవి వేరే జానర్ మూవీస్..ఈ సినిమా జానర్ వేరు అని చెప్పా. నా దృష్టిలో "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" ఒక జెన్యూన్ మూవీ. ఈ కథ విన్నప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది. కొందరు స్టార్ హీరోను తీసుకో అని చెప్పినా..నేను సుహాస్ అయితేనే ఈ కథకు కరెక్ట్ అని నమ్మాను. చాలా మంది కొత్త వాళ్లకు మేము ఒక ప్లాట్ ఫామ్ ఇచ్చామనే సంతృప్తి ఏర్పడింది. నాతో పాటు సుహాస్, డైరెక్టర్ దుశ్యంత్ ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టారు. వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షో వేసి..చూసిన ఆడియెన్స్ తో మా మూవీ టీమ్ కు ఇంటరాక్షన్స్ చేయిస్తున్నాం. మాకు సపోర్ట్ గా ఉన్న డైరెక్టర్ సాయి రాజేశ్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ సినిమా ద్వారా ఫలానా కులాన్ని కించపరిచారనే కాంట్రవర్సీ జరగకూడదని స్క్రిప్ట్ నుంచి ఫస్ట్ కాపీ వరకు ప్రతి సందర్భంలో జాగ్రత్తలు తీసుకున్నాం. అన్నారు.

హీరో సుహాస్ మాట్లాడుతూ - నాకు హ్యాట్రిక్ ఇచ్చిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. నన్ను నమ్మి థియేటర్స్ కు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. సినిమా రిలీజ్ ముందే నేను, ధీరజ్ గారు అనుకున్నాం ఈ సినిమాతో హిట్ కొడుతున్నామని. ఇవాళ ఆ మాట నిజమైనందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో హీరోతో పాటు మిగతా క్యారెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఉంది. అదే ఈ స్క్రిప్ట్ లో ఉన్న స్ట్రెంత్. మిగతా వారు బాగా పర్ ఫార్మ్ చేసినా సినిమా హిట్టైన పేరు హీరోకే పేరొస్తుంది. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు"కు పనిచేసిన ప్రతి ఒక టీమ్ మెంబర్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అనురాగ్, శరత్ ..వీళ్లిద్దరు నా లైఫ్ లో మర్చిపోలేని వ్యక్తులు. తేజ కాకుమాను మా గురువు. నేను ఎదగాలని ఎప్పుడూ కోరుకునే వ్యక్తి. నా యాక్టింగ్ కు ఇంత మంచి పేరు వచ్చిందంటే కారణం తేజ కాకుమాను. మూడు రోజుల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా. రేపటి నుంచి టూర్స్ వస్తున్నాం. మీ అందరినీ కలుస్తాం. అన్నారు.

 

 

 


Photo Gallery

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved