pizza
Dora success meet
`డోర` చిత్రాన్ని ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ - మ‌ల్కాపురం శివ‌కుమార్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

31 March 2017
Hyderaba
d

ప్రముఖ కథానాయిక నయనతార ప్రధాన పాత్రలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన చిత్రం డోర. ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి దాస్ దర్శకుడు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

నిర్మాత మ‌ల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ - ``డోర సినిమా శుక్ర‌వారం విడుద‌లై మంచి స్పంద‌న రాబ‌ట్టుకుని హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన చిత్రాల్లో పిల్ల‌ల‌తో స‌హా అంద‌రూ క‌లిసి చూడ‌ద‌గ్గ చిత్రంగా మంచి పేరుసంపాదించుకుంది. మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంద‌ని అప్రిసియేట్ చేశారు. గ‌తంలో న‌యన‌తార న‌టించిన మ‌యూరి కంటే డోరలో చ‌క్క‌గా న‌టించిందని అంద‌రూ అంటున్నారు. క‌లెక్ష‌న్స్ కూడా ప్ర‌తి షో పెరుగుతూ వ‌స్తుంది. ఒక కారులో ఒక దెయ్యం ఏ విధంగా ఆవ‌హించింది. ఎలా ప్ర‌తీకారం తీర్చుకుంద‌నే క‌థ‌ను ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా తెరెక్కించాడు. రొటీన్‌కు భిన్నంగా రూపొందిన చిత్ర‌మిది. ప్రేక్ష‌కులు సినిమాను బాగా ఆద‌రిస్తున్నారు. తెలుగు ప్రేక్ష‌కులు సినిమా ఇంకా పెద్ద‌హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved