pizza
Naa Saami Ranga Success Meet
Naa Saami Ranga Success: King Nagarjuna Thanks Fans And Audience For Unconditional Love
అన్‌ కండిషనల్‌ లవ్ తో ‘నా సామిరంగ’కు ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులు, అభిమానులకు ధన్యవాదాలు: నా సామిరంగ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో కింగ్ నాగార్జున అక్కినేని
You are at idlebrain.com > News > Functions
Follow Us


29 January 2024
Hyderabad

 

Nagarjuna Akkineni proves his versatility in 'Naa Saami Ranga,' a film produced by Srinivasa Chitturi with a substantial budget under the direction of Vijay Binny from Srinivasa Silver Screen. Presented by Pawan Kumar, the movie stars Ashika Ranganath alongside Nagarjuna, with notable roles played by Allari Naresh, Raj Tarun, Mirna Menon, and Ruksar Dhillon. Released on January 14 as a Sankranti gift, the film has triumphed as a perfect Sankranti entertainer, garnering acclaim from audiences, fans, and critics alike. Recognizing its success, the film unit organized a grand celebration, during which King Nagarjuna presented success shields to the team.

Addressing the gathering, King Nagarjuna shared his gratitude, saying, "Hello everyone. Thank you Akkineni fans and Telugu audience for unconditional love. You always spread love regardless of film success. You smile with joy when you see me. Your smile gives me courage. Thanks to all the distributors who have been very positive and given us theatres and releases. Missing our unit every moment. The journey of this movie has been amazing. Everyone worked with love. Not thanking everyone by name. I miss everyone so much. Thanks to everyone who gave me this wonderful feeling."

Reflecting on the commencement of the film, Nagarjuna reminisced, "After unveiling the statue on September 20, father's birthday, we started this film on the same day. No one in our family knew that the opening of the movie would take place. Amala asks where are you leaving for the shooting? I said, 'I have to start the movie, I have to go.' 'Can you go in the evening' means. 'It should be released by Sankranti. I have to go quickly,' I said. Then everyone looked at me with bewildered faces (laughing) and said, 'They are saying Sankranti release, are you crazy,' including the children. (Laughs) After starting the film, no one outside believes that Sankranti will come. But the faces of my team have that belief. Our belief came true. Successfully released."

Expressing gratitude to the team, Nagarjuna acknowledged, "Keeravani garu was a major reason for the completion on time. He made a timetable and encouraged us all. Excellent music was given. Thanks to Keeravani. Chandra Bose wrote beautiful songs. Thank you to everyone in the team. Thanks to all our media friends who wrote about us very positively. See you next Sankranti."

Oscar-winning composer MM Keeravani congratulated the team, stating, "Producer Srinivas decided to release the movie on Sankranti. Planned and work achieved. Congratulations to them. Congratulations to the director Vijay who made this film the fastest project. Thanks to Nagarjuna for believing in new talents and believing in teamwork. Such a sentiment was possible only because of Naresh."

Hero Allari Naresh expressed his joy, saying, "This Sankranti, Hanuman, and Naa Saami Ranga received blockbuster success. Working with Chhota Prasad was a great experience. Keeravani and Chandra Bose have an inseparable bond. I wish to always keep it up and give more good music. This movie has been supported a lot. Thanks to all the team. Vijay Binny Garu is very happy to receive success."

Director Vijay Binny, who felt fortunate for the success of his debut film, thanked the team, saying, "It is very rare that a film gets released and receives success meet shields. I feel very fortunate that this has happened for my first film. Thanks to all my direction team. Thanks to all the actors who acted in this movie. Our producer gave us every artist we asked for. That is why the movie is so lavish and beautiful. I am indebted to their trust. No matter how many times I thank Keeravani, it is not enough."

Heroine Ashika Ranganath expressed her joy and gratitude, saying, "I enjoyed my Samiranga journey a lot. Director Vijay has worked very hard. The result of his hard work has come with the success of this film. Thank you to everyone who worked on the team. Working with Keeravani is a pleasure. Thanks to the producers. Everyone calls me by the name of Varam and it is very pleasant. Nagarjuna is the main pillar of this movie. Acting with Nagarjuna was a wonderful experience. I want to do more films with him. Thank you all".

The ceremony was very grand with all the film unit members participating.

అన్‌ కండిషనల్‌ లవ్ తో ‘నా సామిరంగ’కు ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులు, అభిమానులకు ధన్యవాదాలు: నా సామిరంగ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో కింగ్ నాగార్జున అక్కినేని

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ కుమార్ సమర్పించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా ఘన విజయాన్ని సాధించింది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు ప్రసంశలు అందుకొని సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా అలరిస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని నిర్వహించింది. ఈ వేడుకలో కింగ్ నాగార్జున చేతులు మీదగా చిత్ర యూనిట్ కి సక్సెస్ షీల్డ్స్ ని అందించారు.

నా సామిరంగ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో కింగ్ నాగార్జున అక్కినేని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అన్ కండీషనల్ లవ్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్ కి, తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా మీరు ఎప్పుడూ ప్రేమని పంచుతూనే వుంటారు. నేను కనిపించగానే ఆనందంతో నవ్వుతూవుంటారు. వారి చిరునవ్వే నాకు ధైర్యం. ఎంతో పాజిటివ్ గా ఉంటూ మాకు థియేటర్స్, రిలీజ్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థాంక్స్. మా యూనిట్ ని ప్రతి క్షణం మిస్ అవుతున్నాను. ఈ సినిమా ప్రయాణం చాలా అద్భుతంగా జరిగింది. అందరూ ఎంతో ప్రేమతో పని చేశారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునమా థాంక్స్ చెప్పడం కాదు.. ప్రతిఒక్కరినీ చాలా మిస్ అవుతున్నాను. ఈ వండర్ ఫుల్ ఫీలింగ్ ఇచ్చిన అందరికీ థాంక్స్. సెప్టెంబర్ 20 నాన్నగారి పుట్టిన రోజున విగ్రహ ఆవిష్కరణ చేసిన తర్వాత అదే రోజున ఈ సినిమా మొదలుపెట్టాం. సినిమా ఓపెనింగ్ జరుగుతుందని మా ఫ్యామిలీ ఎవరికీ తెలీదు. షూటింగ్ కి బయలుదేరుతుంటే ఎక్కడికని అమల అడిగింది. ‘సినిమా మొదలుపెట్టాలి, వెళ్ళాలి’ అన్నాను. ‘సాయంత్రం వెళ్ళొచ్చు కదా’ అంటే.. ''సంక్రాంతికి విడుదల చేయాలి. త్వరగా వెళ్ళాలి' అన్నాను. అప్పుడు అందరూ నన్ను బిత్తరమొహాలు వేసుకొని చూశారు( నవ్వుతూ) 'సంక్రాంతి విడుదల అంటున్నారు, ఏమైనా పిచ్చెక్కిందా' అని పిల్లలతో సహా అందరూ అన్నారు. (నవ్వుతూ) సినిమా మొదలుపెట్టిన తర్వాత సంక్రాంతి వస్తుందనే నమ్మకం బయట ఎవరి మొహాల్లో లేదు. కానీ నా టీం మొహాల్లో మాత్రం ఆ నమ్మకం వుంది. మా నమ్మకం నిజమైయింది. విజయవంతంగా విడుదల చేశాం. అనుకున్న సమయానికి పూర్తి కావడానికి కీరవాణి గారు ఒక ప్రధాన కారణం. ఆయన ఒక టైం టేబుల్ వేసి మా అందరినీ ప్రోత్సహించారు. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కీరవాణి గారికి ధన్యవాదాలు. చంద్రబోస్ గారు చక్కని పాటలు రాశారు. టీం లో అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. చాలా పాజిటివ్ గా మా గురించి రాసిన మీడియా మిత్రులందరికీ థాంక్స్. సీ యూ నెక్స్ట్ సంక్రాంతి'' అన్నారు.

ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి మాట్లాడుతూ.. నిర్మాత శ్రీనివాస్ గారు సంక్రాంతి విడుదల చేయాలనీ నిర్ణయించుకున్నారు. అనుకున్న పని సాధించారు. వారికి అభినందనలు. ఫాస్టెస్ట్ ప్రాజెక్ట్ ఈ చిత్రాన్ని చేసి విజయం సాధించిన దర్శకుడు విజయ్ కి అభినందనలు. కొత్త ప్రతిభని నమ్ముతూ టీం వర్క్ ని నమ్మి ఇంత ఫ్రీడం ఇచ్చిన నాగార్జున గారికి ధన్యవాదాలు. ఇంత సెంటిమెంట్ నరేష్ గారి వలనే సాధ్యమైయింది. సినిమాలో చాలా బెస్ట్ మూమెంట్స్ వున్నాయి. చంద్రబోస్ గారితో ప్రయాణం ఇలానే కొనసాగాలి. మా మ్యూజిక్ టీం అంతా చాలా కష్టపడ్డారు. ఆరుగురు కీ బోర్డ్ ప్లేయర్స్ విరామం లేకుండా పదిరోజుల పాటు పని చేశారు. వారికి వినోదం ఇవ్వాలని ఒక ప్రత్యేక పాటని కూడా రికార్డ్ చేశాం. సినిమా ఘన విజయం సాధించిన సందర్భంలో ఆ పాటని మీతో పంచుకుంటున్నాను'' అన్నారు

హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. డీవోపీ శివ సంక్రాంతి అల్లుడు. ఈ సంక్రాంతి హనుమాన్, నా సామిరంగ విజయాలు అందుకున్నాడు. చోటా ప్రసాద్ గారితో వర్క్ చేయడం మంచి అనుభూతి. కీరవాణి గారు, చంద్రబోస్ గారిది విడదీయరాని బంధం. ఎప్పుడూ ఇలానే ఉంటూ మరింత మంచి సంగీతం అందించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. టీం అందరికీ థాంక్స్. విజయ్ బిన్నీ గారు సక్సెస్ అందుకోవడం చాలా అనందంగా వుంది. అషికా అద్భుతంగా నటించింది. వరాలు లాంటి కష్టమైన పాత్రని అవలీలగా చేశారు. సంక్రాంతి కింగ్ నాగార్జున గారు. ఆయనకి ఒక ఫ్యాన్ బాయ్ నుంచి కో స్టార్ స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. నాగార్జున గారితో కలసి నటించడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటాను''అన్నారు.

దర్శకుడు విజయ్ బిన్నీ మాట్లాడుతూ.. సినిమా విడుదలై సక్సెస్ మీట్ షీల్డ్స్ అందుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. నా తొలి చిత్రానికి ఇలా జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా డైరెక్షన్ టీం అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ ధన్యవాదాలు. మా నిర్మాత మేము అడిగిన ప్రతి ఆర్టిస్ట్ ని ఇచ్చారు. అందువలనే సినిమా ఇంత లావిష్ గా బ్యూటీఫుల్ గా వచ్చింది. వారి నమ్మకానికి రుణపడి వుంటాను. కీరవాణి గారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వడంతో పాటు మాకు ఎంతగానో ప్రోత్సహించారు. డీవోపీ శివ, ఎడిటర్ చోటా ప్రసాద్ గారు, ఆర్ట్ డైరెక్టర్, డ్యాన్స్, ఫైట్ మాస్టర్స్ అందరినీ పేరుపేరునా ధన్యవాదాలు. రాజ్ తరుణ్ గారికి థాంక్స్. నరేష్ గారితో వర్క్ చేసే అవకాశం రావడం చాలా లక్కీ. ఎమోషన్స్ సీన్స్., కామెడీ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ కి థాంక్స్. అషికా వరాలు పాత్రకు జీవం పోషించింది. తను అద్భుతమైన నటి. నాగ్జరున గారు ఇచ్చిన ప్రోత్సాహం వలనే ఈ రోజు ఈ వేదికపై వున్నాను. ఒక కొత్త దర్శకుడి నాగార్జున గారు లాంటి హీరో దొరకడం అదృష్టం. ఆయన చాలా గొప్పగా మార్గనిర్దేశం చేస్తారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మమ్మల్ని ఇంత గొప్పగా ఆదరించిన అందరికీ ధన్యవాదాలు' తెలిపారు

హీరోయిన్ అషికా రంగనాథ్ మాట్లాడుతూ.. నా సామిరంగ జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. దర్శకుడు విజయ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన కష్టానికి తగిన ఫలితం ఈ సినిమా విజయంతో వచ్చింది. టీంలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కీరవాణి గారితో వర్క్ చేయడం చాలా అనందంగా వుంది. నిర్మాతలకు ధన్యవాదాలు. అందరూ నన్ను వరాలు పేరుతో పిలవడం చాలా అనందంగా వుంది. నాగార్జున గారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. నాగార్జున గారితో నటించడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.


Photo Gallery

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved