12 March 2024
Hyderabad
Allari Naresh is coming up with the wholesome family entertainer Aa Okkati Adakku which marks the directorial debut of Malli Ankam. Rajiv Chilaka is producing the movie under the banner of Chilaka Productions, while Bharath Laxmipati is the co-producer. Faria Abdullah is the leading lady in the movie which is slated for release this summer.
While the title glimpse assured the movie is going to be an out-and-out entertainer, the first single Oh Madam was also well-received. Today, they unleashed the film’s teaser. It begins on a funny note with an astrologer revealing the horoscope of the protagonist that he needs to get married within a date or else he will remain to be a bachelor for the rest of his life.
True to his words, he is unable to find a match for marriage. In the meantime, he starts seeing Faria Abdullah. She too loves his company. However, when he puts in the proposal of marriage, he simply says, ‘Aa Okkati Adakku’.
The plotline looks very interesting and Malli Ankam who chose the Pan India problem i.e. marriage has made this entertainingly. Allari Naresh is back with his Allari. He enthralls thoroughly with his comic timing. Faria Abdullah is cool as Naresh’s girlfriend. The presence of comedians such as Vennela Kishore, Viva Harsha, etc. guarantees adequate hilarity.
The visuals captured by Suryaa look bright and colorful, whereas the background score by Gopi Sundar upraises the fun quotient. The production design of Chilaka Productions is perfect for the genre.
This hilarious teaser sets good expectations for the movie that has dialogues by Abburi Ravi. Chota K Prasad is the editor of the movie, while J K Murthy is the art director.
Cast: Allari Naresh, Faria Abdullah, Vennela Kishore, Jamie Lever, Viva Harsha, Ariyana Glory And Others.
Technical Crew:
Director- Malli Ankam
Producer - Rajiv Chilaka
Co-producer - Bharath Laxmipati
Banner - Chilaka Productions
Writer - Abburi Ravi
Editor - Chota k Prasad
DOP - Suryaa
Music director - Gopi Sundar
Art director - J K Murthy
Executive producer - Akshita Akki
Marketing Manager - Sravan Kuppili
Marketing Agency - Walls and Trends
Pro - Vamsi Shekar
Publicity design - Anil Bhanu
అల్లరి నరేష్, మల్లి అంకం, రాజీవ్ చిలక, చిలక ప్రొడక్షన్స్ 'ఆ ఒక్కటీ అడక్కు' హిలేరియస్ టీజర్ లాంచ్
హీరో అల్లరి నరేష్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది.
టైటిల్ గ్లింప్స్ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని హామీ ఇవ్వగా, మొదటి సింగిల్ ఓ మేడమ్ కూడా మంచి ఆదరణ పొందింది. ఈరోజు మేకర్స్ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు. హీరో జాతకాన్ని ఒక జ్యోతిష్కుడు చెప్పడంతో ఫన్నీ నోట్‌తో ప్రారంభమవుతుంది. హీరో ఒక తేదీలోపు వివాహం చేసుకోవాలి, లేకపోతే అతను తన జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడని జ్యోతిష్కుడు చెప్తాడు. జ్యోతిష్కుడు చెప్పినట్లే అతని సరిపోయే అమ్మాయి దొరకదు. అలాంటి సమయంలో అతను, ఫరియా అబ్దుల్లాను చూస్తాడు. ఆమె కూడా అతని కంపెనీని ఇష్టపడుతుంది. అయితే పెళ్లి ప్రపోజల్ పెట్టగానే ‘ఆ ఒక్కటీ అడక్కు’ అని సింపుల్ గా చెప్పేస్తుంది.
ప్లాట్‌లైన్ చాలా ఆసక్తికరంగా ఉంది, పాన్ ఇండియా లాంటి సమస్య పెళ్లిని ఎంచుకున్న మల్లి అంకం దీనిని వినోదాత్మకంగా రూపొందించాడు. అల్లరి నరేష్ తన అల్లరితో మళ్ళీ అలరించారు. తన కామిక్ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. నరేష్ గర్ల్ ఫ్రెండ్ గా ఫరియా అబ్దుల్లా కూల్ గా కనిపించారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష మొదలైన హాస్యనటులు మరింత వినోదాన్ని పంచారు. సూర్య క్యాప్చర్ చేసిన విజువల్స్ బ్రైట్, కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి, గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినోదాన్ని పెంచింది. చిలక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ డిజైన్ జానర్‌కి సరిగ్గా సరిపోతుంది. నవ్వించే ఈ టీజర్ నిమాపై మంచి అంచనాలను నెలకొల్పింది. అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ముందుగా 'ఆ ఒక్కటీ అడక్కు' గురించి ఓ వివరణ ఇవ్వాలి. నాన్నగారి 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాకి, ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఎలాంటి సీక్వెల్ కాదు. నాన్నగారి సినిమాలో జీవితంలో సెటిల్ కాకుండా పెళ్లి చేసుకునేవాడి కథ. ఇందులో సెటిల్ అయినా పెళ్లి కాని వాడి కథ. చాలా హిలేరియస్ గా సినిమాని చేశాం. వింటేజ్ నరేష్ రావాలని చాలా మంది అడుగుతున్నారు. మళ్ళీ కామెడీ సినిమాలు చేయాలని కోరారు. చాలా ఆరోగ్యకరమైన కామెడీ చేయాలనే ఉద్దేశంతో కథపై చాలా శ్రద్ధ తీసుకొని ఈ సినిమాని చేశాం. నా బలం కామెడీ. ఈసారి మరింత నవ్వించాలని ఈ సినిమా చేశాం. మంచి కంటెంట్ వున్న కామెడీ ఎంటర్ టైనర్ ఇది. ఫారియా మంచి కామెడీ టైమింగ్ వున్న యాక్టర్. ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. వెన్నెల కిశోర్, వైవా హర్ష, హరితేజ ఇలా ఇందులో పాత్రలన్నీ అలరిస్తాయి. జామీ లివర్ తొలిసారి తెలుగులో నటిస్తున్నారు. ఈ సినిమాతో తను చాలా మంచి పేరు వస్తుంది. దర్శకుడు మల్లి గారు చాలా క్లియర్ విజన్ తో సినిమా తీశారు. కొత్త నిర్మాత రాజీవ్ గారు చాలా ప్యాషన్ సినిమాని నిర్మించారు. ఇలాంటి పాషన్ వున్న నిర్మాతని ప్రోత్సహించాలి. రాజీవ్ భరత్ చాలా స్నేహభావంతో వుంటారు. చికలా ప్రొడక్షన్ సక్సెస్ ఫుల్ బ్యానర్ గా నిలబడాలి' అని కోరారు
నిర్మాత రాజీవ్ చిలక మాట్లాడుతూ.. ఈవీవీ గారి టైటిల్ ని వాడుతున్నాం. మా మీద పెద్ద భాద్యత వుంది. ఆ టైటిల్ ఇచ్చిన నరేష్ గారికి ధన్యవాదాలు. చిలకా ప్రొడక్షన్స్ తొలి చిత్రమిది. నిర్మాత కావాలనే నా ఇరవై ఏళ్ళ కల. అది ఈ సినిమాతో తీరింది. మల్లి గారు చెప్పిన కథ చాలా నచ్చింది. అల్లరి నరేష్ గారి ఈ కథని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు. నరేష్ గారు గ్రేట్ యాక్టర్. ఆయన ప్రతిభ చూసి సర్ప్రైజ్ అయ్యాను. ఆయనతో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని వుంది. ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది'' అన్నారు.
దర్శకుడు మల్లి అంకం మాట్లాడుతూ.. నరేష్ గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు. టీజర్ ఎలా అయితే నవ్వుకుంటూ చూశారో ఈ సినిమా కూడా అలానే వుంటుంది. ఫ్యామిలీతో కలసి అనందంగా నవ్వుకుంటూ చూడదగ్గ చిత్రమిది' అన్నారు
అబ్బూరి రవి మాట్లాడుతూ.. ఈ సినిమా రాస్తున్నపుడు, చేస్తున్నపుడు ఒక కిక్ వచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది. రాజీవ్, భరత్ చాలా మంచి సమన్వయంతో సినిమాని నిర్మించారు. మల్లి అంకం ఎప్పటినుంచో పరిచయం.ఈ సినిమాలో మాటలు రాసే అవకాశం ఇచ్చారు. నరేష్ గారితో ఇది నాలుగో సినిమా. చాలా భాద్యతగా ఈ సినిమా చేశారు. టీజర్ లానే సినిమా అంతా నవ్వుకుంటూ ఆనందంగా చూసే సినిమా అవుతుంది'' అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం - మల్లి అంకం
నిర్మాత - రాజీవ్ చిలక
సహ నిర్మాత - భరత్ లక్ష్మీపతి
బ్యానర్ - చిలక ప్రొడక్షన్స్
రచయిత - అబ్బూరి రవి
ఎడిటర్ - చోటా కె ప్రసాద్
డీవోపీ - సూర్య
సంగీతం - గోపీ సుందర్
ఆర్ట్ డైరెక్టర్ - జె కె మూర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అక్షిత అక్కి
మార్కెటింగ్ మేనేజర్ - శ్రావణ్ కుప్పిలి
మార్కెటింగ్ ఏజెన్సీ - వాల్స్ అండ్ ట్రెండ్స్
పీఆర్వో - వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్ - అనిల్ భాను