pizza
Abhinetri teaser launch
‘అభినేత్రి’ ట్రైలర్ విడుదల
ou are at idlebrain.com > News > Functions
Follow Us

03 June 2016
Hyderabad

ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ ప్రధాన తారాగణంగా కోన ఫిలిం కార్ొరేషన్, బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బి.ఎల్.ఎన్.సినిమా, ఎం.వి.వి.సినిమా బ్యానర్స్ పై సంయుక్తంగా రూపొందుతోన్న చిత్రం అభినేత్రి. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో ఈ సినిమాను ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాద్ లో విడుదల చేశారు. డ్యాన్సింగ్ టీజర్ ను సోనూసూద్ విడుదల చేశారు. ట్రైలర్ ను వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా...

వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘’టైటిల్ బావుంది. తమన్నాకు కరెక్ట్ గా సూటయ్యే టైటిల్. తనతో రెండు సినిమాలు వర్క్ చేశాను. ఈ సినిమాలో తనే హీరో. కోనవెంకట్ కొత్త విషయాలతో సినిమా చేయాలని తాపత్రయ పడుతుంటారు. కథను నాకు చెప్పగానే బాగా అనిపించింది. విజయ్ డైరెక్ట్ చేసిన మదరాసు పట్టణం సినిమా చూస్తే ఆయన గొప్ప దర్శకుడని తెలుస్తుంది. సోనూసూద్ మన టాలీవుడ్ నుండి వెళ్లి ఇప్పుడు హాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడు. అందుకు మనమంతా గర్వపడాలి. ప్రభుదేవాగారు డ్యాన్స్ ను ఇంకా మరచిపోలేకపోతున్నాం. ఆయన హైదరాబాద్ లో ఓ డ్యాన్స్ స్కూల్ పెట్టాలి. టీం అంతటికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ మాట్లాడుతూ ‘’2012లో పాల్ ఆరోన్ తో కలిసి ఈ స్క్రిప్ట్ ను రాసుకున్నాను. కొన్ని కారణాలతో సినిమా రూపొందనేలేదు. అయితే గణేష్ గారు సహకారంతో సినిమా ఈ స్టేజ్ కు వచ్చింది. ఇది హీరోయిన్ సెంట్రిక్ మూవీ. తమన్నా ఫస్ట్ హాఫ్ వినగానే చేస్తానని సెకండాఫ్ కూడా వినలేదు. తమన్నాకు స్పెషల్ మూవీగా ఆమె కెరీర్ లోనే నిలిచిపోయే చిత్రమవుతుంది. సోనూసూద్ గారు డిఫరెంట్ రోల్ చేశారు. తప్పకుండా అందరినీ థ్రిల్ చేసే సినిమా అవుతుంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

కోనవెంకట్ మాట్లాడుతూ ‘’మంచి సినిమా వల్ల అందరికీ మంచి జరుగుతుంది. మంచి సినిమా కోసం మంచి కథ అవసరం. ప్రభుదేవాగారికి ఓ కథను చెప్పడానికి ముంబై వెళ్లినప్పుడు ప్రభుదేవాగారు నాకు అభినేత్రి కథను వినిపించారు. కథ నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. 54 సినిమాల రచయితగా థ్రిల్ ఫీలైన కథ ఇది. ప్రభుదేవాగారి సలహాతో ఎ.ఎల్.విజయ్ గారిని కలిశాను. ఆయన చెప్పిన ఐదు నిమిషాల కథ విని థ్రిల్ అయ్యాను. ఓ ఇంటికి పునాది, పిల్లర్స్ ఎలా అవసరమో ఈ సినిమా విషయానికి వస్తే తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్, డైరెక్టర్ విజయ్ గారి పిల్లర్స్ లా నిలబడ్డారు. కథ పునాదిలా నిలబడింది. మంచి కథ కారణంగా ఇదొక పాన్ ఇండియా సినిమా అయ్యింది. తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ మినహా ఏ భాషకు చెందిన నటీనటులు ఆ భాషలో నటించారు. తెలుగు, తమిళం, హిందీల్లో ప్రతి సీన్ ను చిత్రీకరించాం’’ అన్నారు.

Tamanna Glam gallery from the event

డి.సురేష్ బాబు మాట్లాడుతూ ‘’ ఈ సినిమా కథను నేను విన్నాను. చాలా బావుంది. యూనిట్ కు ఆల్ ది బెస్ట్. పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘’సినిమ పోస్టర్ ను చూస్తుంటే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనిపిస్తుంది. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

శివ తుర్లపాటి మాట్లాడుతూ ‘’నేను కొరియోగ్రాఫర్ ని. పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాను. శంకరాభరణం సినిమాలో కోనవెంకట్ గారితో కలిసి పనిచేశాను. సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్స్’’ అన్నారు.

ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ‘’మా మ్యానర్ లో ఓ మంచి సినిమా రూపొందుతుందని కచ్చితంగా చెప్పగలను. సినిమా తప్పకుండా పెద్ద హిట్టవుతుంది’’ అన్నారు.

సోనూసూద్ మాట్లాడుతూ ‘’ప్రభుదేవా, తమన్నా, సత్యనారాయణగారితో మంచి రిలేషన్ ఈ సినిమా వల్ల ఏర్పడింది. బ్రిలియంట్ స్క్రిప్ట్ కాబట్టి ఈ సినిమా హిందీ వెర్షన్ కోసం నేను నిర్మాతగా మారాను. డైరెక్టర్ విజయ్ గారు సినిమాను ఎక్సలెంట్ గా డైరెక్ట్ చేశారు’’ అన్నారు.

ప్రభుదేవా మాట్లాడుతూ ‘’నాకు హైదరాబాద్ లక్కీ సిటీ. ఇక్కడకు వస్తేనే డ్యాన్స్ మాస్టర్ గా మారిపోతాను. అభినేత్రి విషయానికి వస్తే కథ బాగా నచ్చడంతో నేను, గణేష్ గారు ఈ సినిమాను తమిళంలో నిర్మిస్తున్నాం. ఈ సినిమా జర్నీ చాలా బాగా నచ్చింది. తమన్నా చాలా మంచి నటి. ఎక్సలెంట్ పెర్ ఫార్మెన్స్ చేసింది’’ అన్నారు.

తమన్నా మాట్లాడుతూ ‘’నాకు కోనవెంకట్ గారితో శ్రీ సినిమా నుండి పరిచయం ఉంది. నా లైఫ్ లో ఆయన స్పెషల్ పర్సన్. నా గ్రోత్ ను ఆయన ముందు నుండి చూసి ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా సక్సెస్ ఫుల్, పెద్ద సినిమాలు, పెద్ద స్టార్ మూవీస్ చేస్తాం. అయితే మన నుండి ఆడియెన్స్ కొత్తదనాన్ని ఎక్స్ పెక్ట్ చేస్తారు. అలాంటి కొత్తదనం ఈ సినిమాలో చూస్తారు. డైరెక్టర్ విజయ్ గారితో చాలాకాలంగా మంచి పరిచయం ఉంది. ఈ సినిమా కథను ఆయన చెప్పడానికి వచ్చినప్పుడు మొదటి పదినిమిషాల్లోనే ఓకే చెప్పేశాను. ఈ సినిమాతో ఆయన నన్ను ఇంకా బెటర్ హీరోయిన్ ను చేసి పంపుతున్నారు. అలాగే ప్రభుదేవాగారితో కలిసి ఈ సినిమా చేయడం నా అదృష్ఠం. ఆయన కింగ్ ఆఫ్ డ్యాన్స్ కాద. గాడ్ ఆఫ్ డ్యాన్స్. ఆయన్ను కలవడం కోసమే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే టైటిల్ మాత్రమే నాది కానీ హీరోయిన్ సెంట్రిక్ మూవీ కాదు, ప్రభుదేవాగారు లేకపోతే ఈ సినిమా లేదు. అలాగే సోనూసూద్ గారితో కలిసి యాక్ట్ చేయడం హ్యపీగా ఉంది. ఈ సినిమాతో ఆయన నిర్మాతగా మారుతున్నాను. అలాగే ఇది హర్రర్ మూవీ కూడా కాదు. పర్టికులర్ జోనర్ మూవీ అని కూడా చెప్పలేం. ఇందులో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్ కు థాంక్స్’’ అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సాజిద్-వాజిద్, జి.వి.ప్రకాష్, విశాల్, సినిమాటోగ్రఫీ: మనుష్ నందన్, డైలాగ్స్: కోన వెంకట్, కథ: విజయ్, పాల్ ఆరోన్, ఎడిటర్: ఆంటోని, స్టంట్స్: మనోహర్ వర్మ, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, పరేష్, ప్రవీణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశ్విన్ కుమార్, ఓమర్ లతీఫ్, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, దర్శకత్వం: విజయ్ ఎ.ఎల్.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved