pizza
Bava Maradalu teaser launch
`బావ‌-మ‌ర‌ద‌లు` టీజ‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 August 2016
Hyderaba
d

మాణిక్య మూవీస్ బ్యాన‌ర్‌పై నామ‌న లోహిత్ స‌మ‌ర్ప‌ణ‌లో మోహ‌న్‌కృష్ణ‌, శిరీష‌, సౌజ‌న్య హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం `బావ‌-మ‌ర‌ద‌లు`. గంగార‌పు ల‌క్ష్మ‌ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వంలో రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. మోష‌న్ పోస్ట‌ర్‌ను క‌ల్యాణ్‌కృష్ణ విడుద‌ల చేయ‌గా, బ్యాన‌ర్‌లోగోను ల‌గ‌డపాటి శ్రీనివాస్‌, స‌ముద్ర త‌దిత‌రులు ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా...

త‌మ్మారెడ్డి భ‌రద్వాజ మాట్లాడుతూ ``కొత్త ద‌ర్శ‌క నిర్మాత‌లు, హీరో హీరోయిన్లు అంతా కొత్త టీం క‌లిసి చేసిన ప్ర‌య‌త్నం. సినిమా పెద్ద హిట్ అయ్యి అంద‌రికీ మంచి పేరు తీసుకు రావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

క‌ల్యాణ‌కృష్ణ మాట్లాడుతూ ``5-10 సంవ‌త్స‌రాల్లో ఒక చిన్న చిత్రం పెద్ద స‌క్సెస్ అవుతుంది. దాన్ని ఫాలో అవుతూ చాలా చిన్న సినిమాలు వ‌స్తుంటాయి. ఈ మ‌ధ్య కాలంలో చాల చిన్న చిత్రాలు పెద్ద స‌క్సెస్‌ను సాధించాయి. ఈ సినిమా హీరో మోహ‌న్‌కృష్ణ నాకు బాగా తెలుసు. ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

స‌ముద్ర మాట్లాడుతూ ``చిన్న సినిమాలు పెద్ద హిట్స్ అవుతున్నాయి. అయితే మంచి అవ‌గాహ‌న‌తో చేసే చిన్న సినిమాలు మాత్ర‌మే మంచి విజ‌యాల‌ను సాధిస్తాయి. అలాగే ఈ సినిమా కూడా పెద్ద స‌క్సెస్ సాధించాలి`` అన్నారు.

నిర్మాత రాజు మాట్లాడుతూ ``సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో, బ‌డ్జెట్‌లో పూర్తి చేస్తున్నాం. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

ద‌ర్శ‌కుడు గంగార‌పు ల‌క్ష్మ‌ణ‌మూర్తి మాట్లాడుతూ ``అత‌డు ఆమె ఓ స్కూట‌ర్ త‌ర్వాత నేను డైరెక్ట్ చేసిన చిత్ర‌మిది. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌గారికి థాంక్స్‌. హీరో, హీరోయిన్స్‌, ఇత‌ర న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ బాగా స‌పోర్ట్ చేశారు`` అన్నారు.

అఖిల్ స‌ర్ త‌క్‌, ర‌వివ‌ర్మ‌, దిలీప్‌, వైజాగ్ శ్రీనివాస్‌, త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఎడిట‌ర్ః నంద‌మూరి హ‌రి, కెమెరాః సాహిద్‌, ఎగ్జిక్యూటివ్ః కొనికినేని ధ‌ర‌ణేష్‌, క‌థ‌-మాట‌లుః మాణిక్యం మూవీస్‌, సంగీతంః బండారు దాన‌య్య క‌వి, నిర్మాతః రాజు(ఎన్‌.బి.ఆర్‌), స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః గంగార‌పు ల‌క్ష్మ‌ణ‌మూర్తి.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved