pizza
Indhra Ram, Nikhil Gollamari, Trinadha Rao Nakkina, Nakkina Narratives’ Chaurya Paatam Captivating First Look & Hilarious Teaser Unveiled
టీజర్ లానే ‘చౌర్య పాఠం' సినిమా కూడా అదిరిపోతుంది. ‘న‌క్కిన న‌రేటివ్స్’ బ్యానర్ కు మంచి భవిష్యత్ ఇవ్వాలని ప్రేక్షకులని కోరుతున్నాను: బ్లాక్ బస్టర్ డైరెక్టర్, ‘న‌క్కిన న‌రేటివ్స్’ అధినేత త్రినాధ రావు నక్కిన
You are at idlebrain.com > News > Functions
Follow Us


7 February 2024
Hyderabad

Director Trinadha Rao Nkkina who delivered a massive blockbuster with Dhamaka has turned producer with the upcoming crime comedy drama Chaurya Paatam. Indhra Ram plays the lead role in the movie directed by Nikhil Gollamari under the banner of Nakkina Narratives. N.V.S.S. Suresh is the co-producer. The makers started the promotional activities by unveiling the film’s first look and teaser. The first look poster captivates, while the teaser amuses us thoroughly.

The teaser begins with the protagonist preparing his gang for a heist in the village. He tells them 4 important things in the mission. 1. They need to make the villagers believe that they are documentary filmmakers. 2. Walkie-Talkie is the only communication system. 3. Need to talk in code language only. 4. Their hidden weapons should be visible only to them. How they execute their mission forms the crux of the story.

Cinematographer Karthik Gattamneni provided an intriguing story for the movie, whereas Nikhil Gollamari crafted it amusingly. The character design and presentation stand out. Indhra Ram who looked cool and stylish impressed with his comic timing. Payal Radhakrishna played the lead actress, whereas Rajeev Kanakala and Mast Ali will be seen in vital roles.

Karthik Gattamneni’s camera work is exceptional as usual, whereas Davzand of Eagle fame gave a fun touch with his background score. The production values of Nakkina Narratives are high for the genre. Sri Nagendra Tangala is the production designer, while Uthura is the editor.

The makers have announced to release the movie soon.

Cast: Indhra Ram, Payal Radhakrishna, Rajeev Kanakala, Mast Ali, Madee Manepalli, Anji Valguman, Edward Pereji, Supriya Aysola, Kreash Raj, Sahadev and others.

Technical Crew:
Director – Nikhil Gollamari
Producer – Trinadha Rao Nakkina
Banner: Nakkina Narratives
Story & Dop – Karthik Gattamneni
Production Design - Sri Nagendra Tangala
Music Director – Davzand
Editor – Uthura
Co Producer – N.V.S.S. Suresh
Lyrics – Baskara Batla, Kalyana Chakravarthy, Roll Rida, Krishna Kanth(Kk)

టీజర్ లానే ‘చౌర్య పాఠం' సినిమా కూడా అదిరిపోతుంది. ‘న‌క్కిన న‌రేటివ్స్’ బ్యానర్ కు మంచి భవిష్యత్ ఇవ్వాలని ప్రేక్షకులని కోరుతున్నాను: బ్లాక్ బస్టర్ డైరెక్టర్, ‘న‌క్కిన న‌రేటివ్స్’ అధినేత త్రినాధ రావు నక్కిన

ధమాకాతో మ్యాసీవ్ బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు త్రినాధరావు నక్కిన అప్ కమింగ్ క్రైమ్ కామెడీ డ్రామా 'చౌర్య పాఠం' తో నిర్మాతగా మారారు. నక్కిన నెరేటివ్స్ బ్యానర్‌పై నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో ఇంద్ర రామ్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్.వి.ఎస్.ఎస్. సురేష్ సహ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ని గ్రాండ్ గా లాంచ్ చేసి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటే, టీజర్ అద్భుతంగా అలరిస్తుంది.

గ్రామంలో దోపిడీకి తన ముఠాను హీరో సిద్ధం చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. అతను మిషన్‌లోని 4 ముఖ్యమైన విషయాలను వారికి చెప్పాడు. 1. వారు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్ అని గ్రామస్తులను నమ్మించేలా చేయాలి. 2. వాకీ-టాకీ లో మాత్రమే మాట్లాడుకోవాలి. 3. కోడ్ భాషలో మాత్రమే వాడాలి. 4. వారి దాచిన ఆయుధాలు వారికి మాత్రమే కనిపించాలి. వారు తమ మిషన్‌ను ఎలా అమలు చేస్తారు అనేది కథ ముఖ్యాంశం.

సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి ఆసక్తికరమైన కథను అందించగా, నిఖిల్ గొల్లమారి అద్భుతంగా రూపొందించారు. క్యారెక్టర్స్ డిజైన్, ప్రజంటేషన్ ఆకట్టుకున్నాయి. కూల్‌గా, స్టైలిష్‌గా కనిపించిన ఇంద్ర రామ్ తన కామిక్ టైమింగ్‌తో అలరించాడు. పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటించగా, రాజీవ్ కనకాల, మస్త్ అలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. ఈగిల్ ఫేమ్ దావ్‌జాంద్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఫన్ టచ్ ఇచ్చారు. న‌క్కిన న‌రేటివ్స్ నిర్మాణ విలువలు అత్యున్నతంగా వున్నాయి. శ్రీ నాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఉత్తర ఎడిటర్. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఫ‌స్ట్ లుక్ & టీజర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాధ రావు న‌క్కిన మాట్లాడుతూ.. న‌క్కిన న‌రేటివ్స్ బ్యానర్ ఈ రోజు ప్రారంభమైయింది. ఈ వేడుకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన నిర్మాతలు, దర్శకులు, రచయితలు, స్నేహితులు, మీడియా అందరికీ ధన్యవాదాలు. అందరూ నిర్మాత అంటుంటే వినడానికి చాలా కొత్త ఆనందంగా వుంది. దీనికి కొనసాగిస్తాను. చౌర్య పాఠం కథ ధమాకా షూటింగ్ సమయంలో నేను, కార్తిక్ లంచ్ సమయంలో మాట్లడుకున్నపుడు పుట్టింది. కార్తిక్ చెప్పిన కథ చాలా నచ్చింది. అప్పుడే ఇంద్రకి రెడీ అవ్వమని చెప్పాను. ఈ సినిమా కోసం తను చాలా ప్యాషన్ తో వర్క్ చేసాడు. చాలా పరిణితితో నటించాడు. దర్శకుడు నిఖిల్ చాలా కష్టపడ్డాడు. కార్తిక్ తో కలసి పని చేశాడు. చాలా ప్రతిభగల నటీనటులని ఎంపిక చేశాం. డేవ్ జాండ్ అద్భుతమైన మ్యూజిక్ చేశాడు. పాయల్ తెలుగమ్మాయి. చాలా చక్కగా నటించింది. ఈ సినిమా తర్వాత తను చాలా బిజీ అవుతుంది. ఇందులో పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. రవితేజ గారితో ఈగల్ లాంటి పెద్ద సినిమా చేస్తున్నప్పటికీ మామీద అభిమానంతో కార్తిక్ ఈ చిత్రానికి అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. ఇది చిన్న సినిమాలా ఎక్కడా అనిపించదు. కార్తీక్ ఘట్టమనేని, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, డేవ్ జాంద్ ఇలాంటి పెద్ద టెక్నిషియన్స్ పని చేశారు. ఉత్తర సూపర్ ఎడిటర్. ఈ చిత్రంతో హీరో ఇంద్ర, దర్శకుడు నిఖిల్ కి చాలా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. చౌర్య పాఠం టీజర్ అదిరింది. సినిమా కూడా ఇలానే అదిరిపోతుంది. న‌క్కిన న‌రేటివ్స్ ఇప్పుడే పుట్టింది. దానికి ప్రేక్షకులు ఊపిరి, భవిష్యత్ ని ఇవ్వాలి'' అని కోరారు.

హీరో ఇంద్ర రామ్ మాట్లాడుతూ.. 'చౌర్య పాఠం' టైటిల్ చెప్పినప్పుడే చాలా కొత్తగా అనిపించింది. ఇది ఖచ్చితంగా హిట్ సినిమా. దాదాపు రెండేళ్ళు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. త్రినాధ రావు న‌క్కిన గారి నిర్మాణంలో చేయడం నా అదృష్టం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నక్కిన గారికి కృతజ్ఞతలు. ఈ కథలో నన్ను అంగీకరించిన కార్తీక్ ఘట్టమనేని గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నిఖిల్ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తీశారు. చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఈ సినిమాకి కథ, త్రినాధరావు గారు, కార్తీక్ అన్న, దర్శకుడు నిఖిల్ బిగ్గెస్ట్ స్టార్స్. డేవ్ జాండ్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నాగేంద్ర గారు 14 భారీ సెట్స్ వేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' తెలిపారు.

చిత్ర దర్శకుడు నిఖిల్ గొల్లమారి మాట్లాడుతూ.. టీజర్ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. త్రినాధరావు గారు అందరూ కొత్తవాళ్ళతో సినిమా చేద్దామని ఈ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టారు. అయితే కార్తీక్ ఘట్టమనేని, శ్రీ నాగేంద్ర, డేవ్ జాండ్ ఇలా స్టార్ టెక్నిషియన్స్ ని ఇచ్చారు.కార్తీక్ ఘట్టమనేని కథతో పాటు విజువల్స్ అద్భుతంగా వుంటాయి. డేవ్ జాండ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. త్రినాధరావు గారు ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్' తెలిపారు.

డైరెక్టర్ చందూమొండేటి మాట్లాడుతూ.. న‌క్కిన న‌రేటివ్స్ బ్యానర్ చాలా బావుంది. ఈ సినిమా కథతో పాటు యూనిట్ అంతా నాకు బాగా తెలుసు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలి'' అని కోరారు

నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. త్రినాధరావు గారు డైరెక్షన్ చేస్తేనే కుర్చీలు లేచిపోతాయి. ఇక నిర్మాతగా చేస్తే టాపులులేచిపోతాయి( నవ్వుతూ). త్రినాధరావు గారి నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం అందరికీ మంచి పేరు తీసుకురావాలి. టీజర్ చాలా బావుంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకొంటున్నాను.

నిర్మాత కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ.. త్రినాధరావు గారితో మాకు మంచి స్నేహం వుంది. ఆయన నిర్మాతగా సినిమాలు చేయడం చాలా ఆనందంగా వుంది. త్రినాధరావు గారి సినిమాలు చాలా బావుంటాయి. ఆయన నిర్మాతగా చేస్తున్న చిత్రాలు కూడా అద్భుతంగా వుంటాయి'' అని తెలిపారు

నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. త్రినాధరావు గారు తన మనసులోని ఆలోచనని అద్భుతంగా తెరపై చూపించే దర్శకుడు. ఆయన నిర్మాతగా చిత్రాలు చేయడం ఆనందంగా వుంది. ఆయన కోరుకున్న బాటలో ఈ బ్యానర్ వెళ్ళాలని కోరుకుంటున్నాను . టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' తెలిపారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్, బెక్కం వేణుగోపాల్, లగడపాటి శ్రీధర్, రచయిత ప్రసన్న కుమార్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

తారాగణం: ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల, మస్త్ అలీ, మాడి మానేపల్లి, అంజి వల్గుమాన్, ఎడ్వర్డ్ పెరేజీ, సుప్రియ ఐసోలా, క్రీష్ రాజ్, సహదేవ్ తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం - నిఖిల్ గొల్లమారి
నిర్మాత - నక్కిన త్రినాధరావు
బ్యానర్:న‌క్కిన న‌రేటివ్స్
కథ & డీవోపీ - కార్తీక్ ఘట్టమనేని
ప్రొడక్షన్ డిజైన్ - శ్రీ నాగేంద్ర తంగాల
సంగీతం - డేవ్ జాంద్
ఎడిటర్ - ఉత్తర
సహ నిర్మాత - ఎన్.వి.ఎస్.ఎస్. సురేష్
సాహిత్యం - బాస్కర భట్ల, కళ్యాణ చక్రవర్తి, రోల్ రిడా, కృష్ణకాంత్ (కెకె)

Photo Gallery

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved