pizza
Geethanjali Malli Vachindhi Teaser Launch
Geethanjali Malli Vachindi should be a big hit - Hero Sree Vishnu at the teaser launch event
‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ పెద్ద హిట్ అవ్వాలి.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు
You are at idlebrain.com > News > Functions
Follow Us


24 February 2024
Hyderabad

The horror entertainer 'Geethanjali Malli Vachindhi,' starring the captivating beauty Anjali in the titular role, marks the sequel to the 2014 low-budget blockbuster 'Geethanjali.' Kona Venkat is producing the film under the banners of Kona Film Corporation and MVV Cinemas, with Siva Turlapati directing. The film is slated for release on March 22. In anticipation, the movie's teaser was released on Saturday, with Director Buchi Babu, Bobby, Gopichand Malineni, and hero Sree Vishnu gracing the teaser launch event as chief guests.

Hero Sri Vishnu shared, "I have been collaborating with Kona Venkat since last year and am excited about our upcoming film. He places a strong emphasis on the story, without rushing. I hope this movie achieves great success. I extend my best wishes to the entire film team and hope the director earns a good reputation. I eagerly await making the audience laugh and scaring them in theaters on March 22, ensuring a successful box office run. Anjali's accomplishment of acting in fifty films is no small feat. It's a matter of pride for a Telugu girl to have achieved such success. I wish her continued success, with another hundred or 150 films. I also have high hopes for Nandu and Bhanu to become top writers. With 'Om Bheem Bush' also releasing on March 22, I wish all films great box office success."

Anjali expressed, "This film is very special to me. 'Geethanjali' was my first lead role, and 'Geethanjali Malli Vachindhi' marks my 50th film, a significant milestone in my career. This sequel promises even more laughs and scares double this time, making for a delightful theater experience. I am thrilled to reach the 50-movie milestone. I foresee a bright future for Director Siva and am grateful to everyone involved in the film, including Srinivasa Reddy, Rajesh, Ali, Shakalaka Shankar, Avinash, and Rahul. The entire team has put in tremendous effort. Sidhu's visuals are stunning, and Praveen Lakkaraju's music complements the film beautifully. Nandu and Bhanu's writing stands out. Kona Garu played a crucial role in bringing this project to life, even a decade later. Although it took time to perfect the story, we managed to complete the shooting swiftly. I appreciate Directors Bobby and Gopichand, as well as Sree Vishnu, for their support, especially with his film also releasing. I hope both our films achieve great success. 'Geethanjali Malli Vachindhi' releasing on March 22, and I invite everyone to watch and enjoy the movie."

Kona Venkat said, "This is Anjali's 50th film, which is very special for her. 'Geethanjali,' which came out ten years ago, was a trendsetter and became a hit in all languages. With a budget of 3.5 crores, 'Geethanjali' was successful across languages. Music director Pravin Lakkaraju and lyricist Sreejo were introduced to the industry through 'Gitanjali.' A successful movie introduces many talents to the industry. It took ten years to bring 'Geethanjali' back to the screen. We had a concept four years ago, but it took this long to develop it fully. Thanks to Nandu and Bhanu, the film has reached the level it is at today. Technicians must be passionate; newcomers have that passion. Bobby and Gopi, who are here today, still have that hunger. Nandu and Bhanu are also driven. 'Geethanjali' started with Srinivas Reddy, who introduced director Raj Kiran to me. I transformed the horror story into a horror comedy. Srinu was instrumental in creating 'Geethanjali.' Anjali joined the film for a one-day shoot. Ali's role in this film is going to be extraordinary. Every character in this movie connects with the audience. DOP Sujatha Siddharth's visuals are impressive. We brought Shiva Turlapati from America along with many others like Praveen and Sreejo. This movie should earn a good reputation for Shiva. Sree Vishnu's 'Om Bheem Bush' is releasing on March 22, the same day as our film. Thanks to Sree Vishnu for attending our event. It's because of people like him that the industry thrives. I urge all the audience to watch our film and support it."

Director Siva Turlapati shared, "I began my career as a background dancer in the movie 'Badri' and went to America in between. I returned to the film industry thanks to Kona Venkat. I've done choreography for every film he has worked on. He encouraged me to direct this story as my first project, in line with Kona's style of movies. Working with such a vast cast was a pleasure, and all the actors supported me. I am satisfied that I have made a good film. Praveen Lakkaraju provided a wonderful score, and Sreejo penned great lyrics. I will always be indebted to Kona. Thanks to Mr. Vishnu came to support our film."

Buchibabu Sana said, "Kona Venkat was talking about this event and mentioned that the venue is a graveyard. I got scared. After that, he didn't pick up the phone. Then, he left a voice message saying the venue had been changed. If Kona Venkat's name is associated with a film, it elevates the project to another level. The dialogues he writes are something we take home with us. They are very logical. Ten years ago, we laughed and were frightened by 'Geethanjali.' Now, they are coming back. All the best to the film team."

Director Bobby said, "I watch Anjali's films. The way she spoke at the press meet was shocking. Nandu and Bhanu assist me with my script and dialogues. They contributed words and script for this movie as well. Being a friend and a writer alongside Kona Venkat is very easy. If he is producing a film, it can be said that Shiva is already a success. Kona Venkat thinks about the movie 24 hours a day. Shiva should earn a good reputation as a director. Everyone involved in the film should receive acclaim. Sri Vishnu's movie is also releasing on March 22. Nevertheless, they came to support this film. All the best to the film team."

Gopichand Malineni said, "Kona Venkat is my closest friend in the industry. At the beginning of our careers, he guided us. Many technicians were introduced through the 'Geethanjali' movie. This movie should also be as big a hit as those movies. Anjali is the quintessential Telugu girl. Making 50 good films is no small feat. The director deserves recognition. I laughed a lot at 'Samajavaragamana.' Nandu and Bhanu wrote the dialogues for that, as well as for this film. I hope this film becomes a massive hit."

Satyam Rajesh said, "Kona Venkat worked very hard on this film. We had a great time shooting. Kona Venkat took excellent care of us all. I have had a long-standing relationship with Srinivasa Reddy. Anjali is like a family member to me, always there for us. Director Shiva has many more scripts in store. Our film is releasing on March 22. Everyone should watch it.

Srinivas Reddy said, Geethanjali Malli Vachindhi releasing on March 22. The audience should watch our film and make it successful. We hope that both Sree Vishnu Gari's 'Om Bheem Bush' and our movie's success happens simultaneously. Shooting the movie was fun. Kona Venkat boosted our spirits by making this sequel after ten years."

‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ పెద్ద హిట్ అవ్వాలి.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు

అద్భుతమైన అభినయంతో ఆకట్టుకునే అందాల నటి అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ ఎంటర్‌టైనర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో తక్కువ బడ్జెట్‌తో రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్. కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమాస్ బ్యానర్స్‌పై కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ తుర్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 22న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను శనివారం రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌‌కు దర్శకుడు బుచ్చిబాబు, బాబీ, గోపీచంద్ మలినేని, హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ ఈవెంట్‌లో..

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘కోన వెంకట్ గారితో గత ఏడాది నుంచి పని చేస్తున్నాను. త్వరలోనే ఆయనతో ఓ చిత్రాన్ని చేస్తున్నాను. కథ మీద ఎక్కువగా దృష్టి పెడతారు. తొందర పెట్టరు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్ ఇలా అందరూ నాకు కావాల్సిన వాళ్లు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. దర్శకుడికి మంచి పేరు రావాలి. మార్చి 22న థియేటర్లో అందరినీ నవ్విస్తూ, భయపెట్టి కలెక్షన్లు కొల్లగొట్టాలని కోరుకుంటున్నాను. అంజలి గారు యాభై సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓ తెలుగమ్మాయి ఇన్ని సినిమాలు చేస్తూ సక్సెస్ సాధించడం గర్వంగా ఉంది. ఇంకా వంద, 150 ఇలా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. నందు, భాను టాప్ రైటర్లు కాబోతోన్నారు. మార్చి 22న ఓం భీం బుష్ కూడా రాబోతోంది. అన్ని చిత్రాలు మంచి కలెక్షన్లను సాధించాలి’ అని అన్నారు.

అంజలి మాట్లాడుతూ.. ‘ఇది నాకు చాలా ప్రత్యేకం. గీతాంజలి నాకు ఫస్ట్ సెంట్రిక్ మూవీ. ఇది నాకు 50వ సినిమా. నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది. గీతాంజలి మళ్లీ వచ్చింది మరింత ఎక్కువగా నవ్విస్తుంది. భయపెడుతుంది. థియేటర్లో మంచి అనుభూతిని పొందుతారు. 50 సినిమాలు అనేది స్పెషల్ నంబర్. నాకెంతో ఆనందంగా ఉంది. దర్శకుడు శివకు మంచి భవిష్యత్తు ఉంది. శ్రీనివాసరెడ్డి, రాజేష్, అలీ, షకలక శంకర్, అవినాష్, రాహుల్ ఇలా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. టీం అంతా చాలా కష్టపడి చేశాం. సిద్దు విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ బాగుంటుంది. ఆర్ఆర్, పాటలు బాగా ఇచ్చారు. నందు, భాను రైటింగ్ బాగుంది. ఈ చిత్రానికి అన్నీ చక్కగా కుదిరాయి. కోన గారు ఈ సినిమాకు చాలా ప్రత్యేకం. పదేళ్ల తరువాత కూడా ఈ సినిమాను తీయగలిగాం అంటే.. అది ఆయన వల్లే. నిశ్శబ్దం టైంలోనే ఈ మూవీ పాయింట్ చెప్పారు. కానీ కథను రెడీ చేయడానికి ఇంత టైం పట్టింది. కానీ షూటింగ్‌ను మాత్రం చాలా వేగంగా పూర్తి చేశాం. మా ఈవెంట్‌కు వచ్చిన దర్శకులు బాబీ, గోపీచంద్ గారికి థాంక్స్. శ్రీ విష్ణు తన సినిమా రిలీజ్ అవుతున్నా కూడా మా కోసం రావడం చాలా గ్రేట్. మా రెండు చిత్రాలు పెద్ద విజయాన్ని సాధించాలి. మార్చి 22న గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘అంజలికి ఇది 50వ సినిమా. ఇది ఆమెకు ఎంతో ప్రత్యేకం. పదేళ్ల క్రితం గీతాంజలి వచ్చింది. అదొక ట్రెండ్ సెట్టర్. అన్ని భాషల్లో ఈ చిత్రం అప్పట్లో హిట్ అయింది. 3.5 కోట్లతో తీసిన గీతాంజలి అన్ని భాషల్లో విజయవంతం అయింది. గీతాంజలి మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు, లిరిక్ రైటర్ శ్రీజో ఇలా ఎంతో మంది పరిచయం అయ్యారు. ఓ మూవీ సక్సెస్ అయితే ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అవుతారు. మళ్లీ గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాను తీయడానికి పదేళ్లు పట్టింది. నాలుగేళ్ల క్రితం ఓ పాయింట్ తట్టింది. దాన్ని డెవలప్ చేసేందుకు ఇంత టైం పట్టింది. నందు, భాను వల్ల ఈ సినిమా ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది. టెక్నీషియన్స్ అనే వాళ్లకి ఆకలి ఉండాలి. కొత్తలో ఆ ఆకలి ఉంటుంది. ఇక్కడకు వచ్చిన బాబీ, గోపీ ఇంకా ఆ ఆకలితోనే ఉన్నారు. నందు, భాను అలానే ఆకలితో ఉంటారు. శ్రీనివాస్ రెడ్డి వల్లే గీతాంజలి మొదలైంది. అతనే రాజ్ కిరణ్ దర్శకుడిని నా వద్దకు తీసుకొచ్చాడు. హారర్‌గా ఉన్న కథను.. హారర్ కామెడీగా మార్చాను. శ్రీను వల్లే గీతాంజలి పుట్టింది. గీతాంజలి సినిమాలో ఒక్క రోజు షూట్‌ కోసం వచ్చాడు. ఈ చిత్రంలో అలీ పాత్ర ఎక్స్‌ట్రార్డనరీగా ఉండబోతోంది. ఈ సినిమాలోని ప్రతీ పాత్ర ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. డీఓపీ సుజాత సిద్దార్థ్ విజువల్స్ బాగున్నాయి. శివ తుర్లపాటిని అమెరికా నుంచి పట్టుకొచ్చాం. ప్రవీణ్, శివ, శ్రీజో ఇలా చాలా మందిని ఇంపోర్ట్ చేశాం. శివకు ఈ సినిమా మంచి పేరు తీసుకు రావాలి. మార్చి 22న శ్రీ విష్ణు ఓం భీం బుష్ రిలీజ్ అవుతోంది.. మా సినిమా కూడా అప్పుడే వస్తోంది. అయినా కూడా మా ఈవెంట్‌కు వచ్చిన శ్రీ విష్ణుకి థాంక్స్. ఇలాంటి వారి వల్లే ఇండస్ట్రీ చాలా హెల్దీగా ఉంటుంది. ప్రేక్షకులందరూ మా సినిమాను చూసి ఆదరించండి’ అని అన్నారు.

దర్శకుడు శివ తుర్లపాటి మాట్లాడుతూ.. ‘బద్రీ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేశాను. మధ్యలో అమెరికాకు వెళ్లాను. కోనగారి వల్ల మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ఆయన చేసిన ప్రతీ సినిమాలో కొరియోగ్రఫీ చేశాను. దర్శకత్వం చేయాలని కథ రెడీ చేసుకున్నాను. ముందు ఈ కథ చేయమని అన్నారు. ఇది కోన గారి స్టైల్ ఆఫ్ మూవీస్‌లానే ఉంటుంది. ఇంత మంది భారీ తారాగణంతో పని చేయడం ఆనందంగా ఉంది. నటీనటులంతా కూడా నాకు సపోర్ట్ చేశారు. మంచి సినిమా చేశాననే సంతృప్తి కలిగింది. ప్రవీణ్ లక్కరాజు ఆర్ఆర్ అద్భుతంగా ఇచ్చారు. శ్రీజో మంచి సాహిత్యం అందించారు. కోన గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. మా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన శ్రీ విష్ణు గారికి థాంక్స్’ అని అన్నారు.

బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ‘కోన వెంకట్ గారు ఈ ఈవెంట్ గురించి చెబుతూ వేదిక స్మశానం అని చెప్పారు. నాకు భయం వేసింది. ఆ తరువాత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వేదిక మార్చాం అని మళ్లీ వాయిస్ మెసెజ్ పెట్టారు. కోన వెంకట్ గారి పేరు కనిపిస్తే సినిమా ఇంపాక్ట్ ఓ లెవెల్లో ఉంటుంది. ఆయన రాసిన డైలాగ్స్‌ను ఇంటికి పట్టుకెళ్తాం. ఎంతో లాజిక్స్‌గా పంచ్‌‌లు ఉంటాయి. పదేళ్ల క్రితం గీతాంజలితో నవ్వించారు. భయపెట్టారు. మళ్లీ ఇప్పుడు రాబోతోన్నారు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ‘అంజలి గారి సినిమాలు చూస్తుంటాను. ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడిన తీరుకి ఫిదా అయ్యాను. నందు, భాను నా స్క్రిప్ట్ విషయంలో, డైలాగ్స్ విషయంలో సహాయం చేస్తుంటారు. ఈ సినిమాకు వారు మాటలు, స్క్రిప్ట్‌లో సహాయం చేశారు. కోన వెంకట్ గారితో ఫ్రెండ్, రైటర్‌గా ఉండటం చాలా ఈజీ. ఆయన నిర్మాతగా ఉండి.. ఓ సినిమాను తీశాడంటే శివ అక్కడే సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. కోన వెంకట్ గారు 24 గంటలూ సినిమా గురించే ఆలోచిస్తుంటారు. దర్శకుడిగా శివకు మంచి పేరు రావాలి. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు రావాలి. శ్రీ విష్ణు సినిమా కూడా మార్చి 22న విడుదల అవుతోంది. అయినా కూడా ఈ చిత్రాన్ని సపోర్ట్ చేసేందుకు వచ్చారు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో కోన వెంకట్ గారు నాకు అత్యంత సన్నిహితులు. కెరీర్ ప్రారంభంలో మమ్మల్ని చేతులు పట్టుకుని నడిపించారు. గీతాంజలి సినిమాతో ఎంతో మంది టెక్నీషియన్స్ పరిచయం అయ్యారు. ఆ సినిమాలనే ఈ చిత్రం కూడా పెద్ద హిట్ అవ్వాలి. అంజలి అచ్చమైన తెలుగమ్మాయి. 50 మంచి చిత్రాలు చేయడం మామూలు విషయం కాదు. దర్శకుడికి మంచి పేరు రావాలి. సామజవరగమన చూసి చాలా నవ్వుకున్నా. నందు, భానులు డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి కూడా వారు డైలాగ్స్ రాశారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సత్యం రాజేష్ మాట్లాడుతూ.. ‘కోన వెంకట్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. కోన వెంకట్ గారు మా అందరినీ చక్కగా చూసుకున్నారు. శ్రీనివాసరెడ్డితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. అంజలి నా కుటుంబ సభ్యురాలు. ఎప్పుడూ మా అందరితో కలిసి ఉంటారు. దర్శకుడు శివ వద్ద ఇంకా చాలా స్క్రిప్ట్‌‌లున్నాయి. మార్చి 22న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది మార్చి 22న రాబోతోంది. మా సినిమాను ప్రేక్షకులు చూసి విజయవంతం చేయాలి. శ్రీ విష్ణు గారి ఓం భీం బుష్, మా సినిమా సక్సెస్ మీట్‌లు రెండూ ఒకేసారి జరగాలి. సినిమా షూటింగ్ అంతా సరదాగా సాగింది. పదేళ్ల తరువాత ఈ సీక్వెల్ తీసి కోన వెంకట్ గారు మా అందరికీ బూస్ట్ ఇచ్చారు’ అని అన్నారు.

 

Photo Gallery

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved