pizza
Kodi Ramakrishna's Nagabharanam teaser launch
నాగభరణం టీజర్ విడుదల
ou are at idlebrain.com > News > Functions
Follow Us

04 June 2016
Hyderabad

కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ స్పెషల్ పాత్రలో(విజువల్ ఎఫెక్ట్స్) దిగంత్, రమ్య హీరో హీరోయిన్లుగా జయంతి లాల్ గాడా(పెన్ మూవీస్), సాజిద్ ఖురేషి(ఇన్ బాక్స్ పిక్చర్స్), సోహైల్ అన్సారీ(బ్లాక్ బస్టర్ స్టూడియో) బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నాగభరణం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో సహ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి టీజర్ ను విడుదల చేశారు. శ్యాంప్రసాద్ రెడ్డి, సాజిద్ ఖురేషి, ముకుట ప్రతినిధి దొరబాబు, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా...

శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ‘’తలంబ్రాలు చిత్ర సమయంలో నాకు కోడిరామకృష్ణగారితో పరిచయం ఉంది. మా మధ్య బంధం మూడు దశాబ్దాలుగా కొనసాగుతుంది. ఆయనతో ఇప్పటికీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సోషియోఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్ ఉన్న చిత్రాలు నాకు బాగా ఇష్టం. కామన్ మ్యాన్ ఇటువంటి చిత్రాలకు బాగా కనెక్ట్ అవుతాడు. ఈ చిత్రానికి మకుట కంపెనీ వారు విజువల్ ఎఫెక్ట్స్ చేయడం ఆనందంగా ఉంది. ఇండియాలోనే విజువల్ ఎఫెక్ట్ రంగంలో మకుట నెంబర్ వన్ కంపెనీ. టీజర్ చూశాను. గుండెలాదిరాయి. టీజర్ చూస్తుంటే తప్పకుండా తిరుగులేని విజయాన్ని సాధిస్తుంది’’ అన్నారు.

బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘’కోడి రామకృష్ణ నిర్మాతల దర్శకుడు. సాజిద్ ఖురేషిగారితో నాకు చాలా కాలంగా మంచి పరిచయం ఉంది. టీజర్ చాలా బావుంది. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

దొరబాబు మాట్లాడుతూ ‘’నేను కోడిరామకృష్ణగారి సినిమాలు చిన్నప్పటి నుండి చూసే పెరిగాను. చాలా కష్టపడి చేశాం. విష్ణువర్ధన్ గారిని తెరపై చూపడానికి చాలా కష్టపడ్డాం. మూడేళ్లుగా అలుపెరుగని కృషి చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన కోడి రామకృష్ణ, సాజిద్ ఖురేషిలకు థాంక్స్’’ అన్నారు.

సాజిద్ ఖురేషి మాట్లాడుతూ ‘’కోడి రామకృష్ణగారు లేకుంటే ఈ చిత్రం లేదు. మూడేళ్లుగా ఆయనెంతో కష్టపడ్డారు. జాన్ లో ఆడియో విడుదల చేసి జూలైలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.

కోడిరామకృష్ణ మాట్లాడుతూ ‘’నాకు, శ్యాంప్రసాద్ రెడ్డి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. మా కాంబినేషన్ లో ఎన్నో వండర్స్ క్రియేట్ చేశాం. దర్శకుడికి ఏం కావాలో తెలిసిన నిర్మాత ఆయన. శ్యాంప్రసాద్ రెడ్డి సీన్ ఎలా వచ్చిందని అడిగేవారు కానీ ఎన్ని సీన్స్ అయ్యిందని ఎప్పుడూ అడగలేదు. నాకు ఆయన నిర్మాతగా  కాదు, ఫ్రెండ్ గా మంచి పరిచయం ఉంది. నాగభరణం అనేది పూర్వజన్మ కథ ఇది. పూర్వజన్మలో ఓ అమ్మాయి పొగొట్టుకున్న ఎమోషన్ ను ఎలా సాధించిందనేదే ఈ చిత్రం. రమ్య కథ వినగానే నేను సూట్ అవుతాని ఆశ్చర్యంగా అడిగింది. కానీ మేం చూసుకుంటామని భరోసా ఇచ్చి సినిమా చేశాం. సినిమా క్లైమాక్స్ విషయంలో ఏదో చేయాలని ఆలోచిస్తున్నప్పుడు సాజిద్ ఖురేషి వచ్చి కన్నడ సూపర్ స్టార్ విష్ణు వర్ధన్ తో సినిమా చేయాలనుకుని చేయలేకపోయారు కదా, ఆయన్ని విజువల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేద్దామన్నారు. దానికి మకుట విజువల్ ఎఫెక్ట్స్ వారు బాగా సపోర్ట్ చేశారు. మేం ఏ నమ్మకంతో అయితే విష్ణువర్ధన్ ను క్రియేట్ చేశామో అదే నమ్మకం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించేలా చేస్తున్నాయి. సాజిద్ ఖురేషి శ్యాంప్రసాద్ రెడ్డిగారి లాంటి నిర్మాత కావడం ఖాయం’’ అన్నారు.

ములుల్ దేవ్, రవి కాలే, అమిత్, రాజేష్ వివేక్, సాదు కోకిల, రంగాయన రఘు తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి విఎఫ్.ఎక్స్: ముకుట విజువల్ ఎ.ఫెక్ట్స్, స్టంట్స్: రవి వర్మ, థ్రిల్లర్ మంజు, ఆర్ట్: నాగరాజ్, కొరియోగ్రాఫర్: చిన్ని ప్రకాష్, శివ శంకర్, ఇమ్రాన్ సర్దారియా, సాహిత్యం: కవిరాజ్, డైలాగ్స్: ఎం.ఎస్.రమేష్, ఎడిటర్: జానీ హర్ష, సినిమాటోగ్రఫీ: వేణు, మ్యూజిక్: గురుకిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలావుద్దీన్ యూసఫ్, ప్రాజెక్ట్ క్రియేటివ్ హెడ్: సాజిద్ ఖురేషి, దర్శకత్వం: కోడి రామకృష్ణ.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved