pizza
Prasanna Vadanam teaser launch
'Prasanna Vadanam': Unique concept, sure-shot thrills, gripping narration!
'ప్రసన్న వదనం' టీజర్ అదిరిపోయింది. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ సాయి రాజేష్
You are at idlebrain.com > News > Functions
Follow Us


07 March 2024
Hyderabad

Actor Suhas has been synonymous with films that don't stick to the conventional path. Right from 'Colour Photo' to the recent 'Ambajipeta Marriage Band', his resolve has been strong. Yet another time, the versatile actor has teamed up with a debutant director. Arjun YK is his name. 'Prasanna Vadanam' is the title of their upcoming collaboration. Manikanta JS and Prasad Reddy TR have jointly produced this suspense thriller. Little Thoughts Cinemas and Arha Media are bringing out the film.

The film's teaser is fascinating right from the word go. With minimal dialogues, the teaser creates the maximum impact. There is a conversation at the start and the end. The rest of the teaser is designed to convey to the viewer the nature of the disability that the male lead is suffering from. He can't recognize any face. And this proves to be a fatal handicap. The teaser doesn't reveal anything about the motives of the characters around the male lead. That's what makes the teaser uniquely tense. It seems it is a sort of a survival thriller wherein the male lead has to defend himself despite his terrifying disease, a neuro-ophthalmic disorder in which a patient has difficulty perceiving or recognizing faces.

Director Arjun YK, speaking at the film's teaser launch event, said, "I want to thank my guru, Sukumar garu. I will always be grateful to him for the knowledge he bestowed me with. Nobody else could have headlined 'Prasanna Vadanam' better than Suhas. Once Suhas believes in a script, he gives his all. He is a director-friendly hero. He never disobeys and submits to the vision of the director. The producers supported me in making this film a big one. I got to work with the technicians I had wanted. Thanks to the technicians and artists, I could execute my vision." The director praised his composer, Vijay Bulganin, and others.

Suhas attributed the film's concept and his presentation in the movie to director Arjun's talent. "This is a thriller with a novel touch. When the trailer is out, the film's potential and how intriguing it is will become clear. I thank Sai Rajesh anna for always supporting him. It was he who made me a male lead with 'Colour Photo'. The producers provided us with all the resources. Payal and Rashi have done a great job," the hero said.

Cas: Suhas, Payal Radhakrishna, Rashi Singh Nandu, Viva Harsha, Nitin Prasanna, Sai Swetha, Kushalini

Crew:
Producers: Manikanta J S, Prasad Reddy T R
Written & Directed By: Arjun Y K
DoP: S. Chandrasekaran
Music Director: Vijay Bulganin
Executive Producers: Edward Stevenson Pereji, Kandala Nitish
Editor: Karthika Srinivas R
Art Director: Kranthi Priyam
Costume Designer: Ashwanth & Prathibha Reddy
Line Producer: Varada Venkatramana

'ప్రసన్న వదనం' టీజర్ అదిరిపోయింది. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ సాయి రాజేష్

యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. డైరెక్టర్ సాయి రాజేష్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

సుహాస్ తన అమ్మ నాన్నల ఫోటోని గుర్తుపట్టని హాస్పిటల్ సీన్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ప్రేక్షకులని కట్టిపడేసింది. టీజర్ లో చూపించిన పాత్రల మొహాలపై బ్లర్ ఎఫెక్ట్ తో ప్రజెంట్ చేసి, తర్వాత ఈ కథ వెనుక వున్న అసలు కాన్సెప్ట్ ని రివిల్ చేశారు. 'ఫేస్ బ్లైండ్ నెస్' నేపధ్యంలో ఈ కథ ఉండబోతుంది. దర్శకుడు కాన్సెప్ట్, క్రైమ్ ఎలిమెంట్స్ ని స్క్రీన్ ప్లే లో బ్లెండ్ చేసిన విధానం చాలా ఆసక్తికరంగా వుంది. సుహాస్ గతంలో ఎన్నడూ చేయని ఇంటెన్స్ పాత్రలో కనిపించారు. తన సహజమైన నటనతో మెస్మరైజ్ చేశారు. వైవా హర్ష, నందు, నితిన్, హర్ష వర్ధన్ పాత్రలు కూడా కీలకంగా కనిపించాయి. టీజర్ కి విజయ్ బుల్గానిన్ అందించిన నేపధ్య సంగీతం సస్పెన్స్ ని మరింత ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి టీజర్ యూనిక్ కాన్సెప్ట్, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో చాలా క్యురియాసిటీ పెంచింది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ.. టీజర్ అద్భుతంగా వుంది. కథలోని పాయింట్ అదిరిపోయింది. టీజర్ చాలా నచ్చింది. సుకుమార్ గారి అసోసియేట్ అర్జున్ ఈ సినిమాని డైరెక్టర్ చేయడం చాలా ఆనందంగా వుంది. టీజర్ చాలా నమ్మకాన్ని ఇచ్చింది. టీజర్ లో అందరూ బాగా చేశారు. విజయ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. కథ నచ్చితే మ్యూజిక్ చేసే కంపోజర్ తను. మణికంఠ కలర్ ఫోటోకి సహా నిర్మాతగా చేశాడు. తనకి సినిమా అంటే పాషన్. ఈ సినిమా విజయం సాధిస్తే తను మరింత దూకుడుగా సినిమాలు చేస్తాడు. సుహాస్ కి చాలా కీలకమైన సినిమా ఇది. తను చాలా బిజీగా సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు.

హీరో సుహాస్ మాట్లాడుతూ..'ప్రసన్న వదనం' సినిమా చాలా బావుటుంది. ఇందులో నాకు నేనే కొత్తగా అనిపించాను. దర్శకుడు అర్జున్ కి ధన్యవాదాలు. తను సుకుమార్ గారి అసోసియేట్. అర్జున్ నరేషన్ సుకుమార్ గారిలానే వుంది. ఫేస్ బ్లైండ్ నెస్ మీద చేస్తున్న చాలా మంచి థ్రిల్లర్ ఇది. సినిమా చాలా బావొచ్చింది. అవుట్ పుట్ అదిరిపోయింది. టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. సాయి రాజేష్ గారికి ధన్యవాదాలు. నిర్మాతలు మణికంఠ, ప్రసాద్ గారు సినిమా కోసం చాలా కష్టపడ్డారు. పాషన్ తో నిర్మించారు. సినిమాకి కావాల్సినది సమకూర్చారు. పాయల్, రాశి మంచి నటన కనబరిచారు. విజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది పక్కాగా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా. అందులో డౌట్ లేదు' అన్నారు.

దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ.. ముందుగా మా గురువు గారు సుకుమార్ గారికి ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన నాలెడ్జ్ నాకు చాలా హెల్ప్ అయ్యింది. ప్రసన్న వదనం కథకు సుహాస్ యాప్ట్. నన్ను చాలా సపోర్ట్ చేశారు. సుహాస్ లాంటి హీరో దొరకడం నా అదృష్టం. నిర్మాతలు సినిమాకి బ్యాక్ బోన్ లా నిలబడి కావాల్సిన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు. రాశి, పాయల్, నితిన్ అందరూ చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. టెక్నికల్ టీం అంతా ది బెస్ట్ ఇచ్చారు. సినిమా చాలా సూపర్ గా వచ్చింది. అందరికీ నచ్చుతుంది.'' అన్నారు.

హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. ప్రసన్న వదనం కథ వినప్పుడే చాలా కొత్తగా అనిపించింది. చాలా మలుపులు వున్నాయి. ఇందులో నా పాత్ర కూడా కొత్తగా వుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సుహాస్ అద్భుతమైన నటుడు. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది’’ అన్నారు.

నిర్మాతల మాట్లాడుతూ.. ముందుగా సాయి రాజేష్ గారికి ధన్యవాదాలు. అర్జున్ ఈ కథ చెప్పినపుడు చాలా కొత్తగా అనిపించింది. తను సుకుమార్ గారి అసోసియేట్. కథ సుకుమార్ గారి మీటర్ లో ఉన్నప్పటికీ అర్జున్ కి అంటూ ఒక స్పెషల్ స్టయిల్ వుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. సుహాస్ గారు మరింత కొత్తగా కనిపిస్తారు. ప్రేక్షకులు ఆద్యంతం ఎంజాయ్ చేసేలా సినిమా వుంటుంది. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. త్వరలోనే సినిమాని థియేటర్స్ లో విడుదల చేస్తాం.’ అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది

Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved