pizza
Trayam teaser launch
`త్రయం` టీజ‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

16 July 2016
Hyderabad

పంచాక్షరి పిక్చర్స్ బ్యానర్‌పై విష్ణురెడ్డి, అభిరాం, సంజ‌న హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం `త్రయం`. డా.గౌత‌మ్‌నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో ప‌ద్మ‌జా నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ...

డా.గౌత‌మ్ నాయుడు మాట్లాడుతూ ``ముగ్గురు భిన్న మ‌న‌స్త‌త్వాలున్న వ్య‌క్తులు మ‌ధ్య సాగే క‌థ‌. ల‌వ్‌, యాక్ష‌న్ ఎంర‌ట్ టైన‌ర్‌. క‌ష్ట‌ప‌డి సినిమాను తెర‌కెక్కించాం. నాలుగు సాంగ్స్ ఉంటాయి. అంద‌రికీ న‌చ్చేలా సినిమా ఉంటుంది`` అన్నారు.

ప‌ద్మ‌జా నాయుడు మాట్లాడుతూ ``ద‌ర్శ‌కుడు నా కొడుకు. డాక్ట‌రు చ‌దివినా సినిమా రంగంలోకి వ‌చ్చాడు. త‌న‌కు ఈ సినిమా స‌క్సెస్‌తో పాటు పేరును సంపాదించి పెట్టాలి. మంచి టెక్నిషియ‌న్స్ సినిమాకు ప‌నిచేశారు. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

బి.గోపాల్ మాట్లాడుతూ ``టీజ‌ర్ బావుంది. ద‌ర్శ‌కుడు గౌతమ్ తొలి చిత్ర‌మైనా యాక్ష‌న్ పార్ట్ బాగానే తెర‌కెక్కించారు`` అన్నారు.

నందు మాట్లాడుతూ ``విష్ణు, అభిరాం, నందుల‌కు, గౌతంగారికి మంచి పేరు తేవాలి. కొత్త టీం చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని అంద‌రూ ఆశీర్వ‌దించాలి`` అన్నారు.

రాజ‌కిర‌ణ్ మాట్లాడుతూ ``టీజ‌ర్‌తో ఆస‌క్తిని రేకెత్తించిన ద‌ర్శ‌కుడు సినిమాలో చూడాల‌ని కోరిక‌ను క‌లిగించాడు. క‌చ్చితంగా సినిమా మంచి విజ‌యాన్ని సాధిస్తుంది`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, రాజ్ కందుకూరి త‌దిత‌రులు పాల్గొన్నారు.

విష్ణురెడ్డి, అభిరాం, సంజ‌న, అశోక్ చంద‌నాని, జాకీ, సుబ్బ‌రాయ‌శ‌ర్మ‌, కోటేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి

ఫైట్స్ః కుంగ్ ఫూ శేఖ‌ర్‌, వై.ర‌వి, లిరిక్స్ః నాగ‌బాబు, రాంబ‌ట్ల శివ‌, రాంబ‌ట్ల శ్రీకాంత్‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ః విజ‌య్ భార‌తి, సంగీతంః య‌స్‌.వి.హెచ్‌, ఎడిట‌ర్ః రామారావు జె.పి., ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః రాజేష్ వాక‌, ప్రొడ్యూస‌ర్ః ప‌ద్మ‌జా నాయుడు, క‌థ‌, ద‌ర్శ‌క‌త్వంః డా.గౌత‌మ్ నాయుడు.

 

Sanjana Glam gallery from the event

 

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved