pizza
Krishnagadi Veera Premagadha Technicians press meet
పిభ్ర‌వ‌రి 12న విడుద‌ల‌వుతున్న ‘కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ‌’
You are at idlebrain.com > News > Functions
Follow Us

4 February 2016
Hyderabad

కృష్ణగాడివీరప్రేమగాథ’ టెక్నిషియన్స్ ప్రెస్ మీట్

‘భలే భలే మగాడివోయ్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత నాని హీరోగా మెహరీన్‌ హీరోయిన్‌గా 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లి. పతాకంపై ‘అందాలరాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన చిత్రం ‘కృష్ణగాడివీరప్రేమగాధ’. ఈ చిత్ర ఆడియోకి, ట్రైలర్స్‌ కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రం బిజినెస్‌పరంగా మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రం సూపర్‌హిట్‌ అవడంతో ‘కృష్ణగాడివీరప్రేమగాథ’పై ఎక్స్‌పెక్టేషన్స్‌ విపరీతంగా పెరిగాయి. అందరి అంచనాలకు ధీటుగా ఈ చిత్రాన్ని రూపొందించామని నిర్మాతలు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కాగా ఈ చిత్రానికి అందరూ కొత్త టెక్నీషియన్స్‌ వర్క్‌ చేయడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన టెక్నీషియన్స్‌ ని పరిచయంచేస్తూ ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, దర్శకుడు హను రాఘవపూడి, సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌, కెమెరామెన్‌ యువరాజ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌, మాటల రచయిత జయకృష్ణ, పాట రచయిత కె.కె., లైన్‌ ప్రొడ్యూసర్‌ హరీష్‌ పాల్గొన్నారు.

గోపీచంద్ ఆచంట మాట్లాడుతూ ` ‘‘ఈ సినిమాకి చాలా మంది కొత్త టెక్నీషియన్స్‌ చాలా ప్యాషన్‌తో వర్క్‌ చేశారు. టీమ్‌ అంతా కలిసి వైబ్రెంట్‌గా డే అండ్‌ నైట్‌ కష్టపడి చేశారు. అందరిలోనూ మంచి టాలెంట్‌ ఉంది. ఇలాంటి వారు ఇండస్ట్రీలో వుండడం చాలా మంచిది. ప్రతిఒక్కరూ ఈ చిత్రాన్ని అద్భుతమైన దృశ్య కావ్యంలా తీర్చిదిద్దారు’’ అన్నారు.

అనీల్‌ సుంకర మాట్లాడుతూ ` ‘‘ఫస్ట్‌ టైం యంగ్‌ టీమ్‌తో కలసి వర్క్‌ చేశాం. రియలిస్టిక్‌ లొకేషన్స్‌ లో అందరూ రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఆడియన్స్‌ కి విజువల్‌ ట్రీట్‌లా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.

కెమెరామెన్‌ యువరాజ్‌ మాట్లాడుతూ ‘‘ఇలాంటి ఒక అద్భుతమైన చిత్రానికి వర్క్‌ చేసే అవకాశం ఇచ్చిన రామ్‌, గోపి, అనీల్‌ గార్లకు నా థాంక్స్‌. హను ఫెంటాస్టిక్‌ స్క్రీన్‌ప్లే రాశారు. మంచి కథతో విజువల్‌ ట్రీట్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. అసిస్టెంట్లు, లైట్‌మెన్స్‌ ప్రతిఒక్కరూ ఎంతో కోపరేట్‌ చేశారు. రెగ్యులర్‌ లొకేషన్స్‌ కాకుండా కొత్త కొత్త లొకేషన్లలో ఈ చిత్రాన్ని పిక్చరైజ్‌ చేశాం. విజువల్స్‌ చాలా అద్భుతంగా వచ్చాయి. మా నిర్మాతు ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు’’ అన్నారు.

సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ‘‘14 రీల్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాకి వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సాంగ్స్‌ మంచి హిట్‌ అయ్యాయి. రీ రికార్డింగ్‌ చాలా బాగా వచ్చింది. ఎమోషనల్‌ సీన్స్‌, కామెడీ సీన్స్‌ చాలా గ్రేసీగా ఉన్నాయి. డెఫినెట్‌గా సినిమా మంచి హిట్‌ అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం’’ అన్నారు.

కళా దర్శకుడు అవినాష్‌ మాట్లాడుతూ ‘‘మా టీమ్‌ సపోర్ట్‌ తో ఈ చిత్రానికి బాగా వర్క్‌ చేయగలిగాను. ఈ సినిమా నాది అనే కాన్సెప్ట్‌తో ప్రతిఒక్కరూ పనిచేశారు. దర్శకుడు హను మంచి కాన్సెప్ట్‌ తో ఈ సినిమాని రూపొందించారు. ఆడియోకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. జై రాసిన డైలాగ్స్‌ అందరూ ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు.

మాటల రచయిత జయకృష్ణ మాట్లాడుతూ ‘‘ఇది నా ఫస్ట్‌ మూవీ. ఇంత మంచి మూవీకి వర్క్‌ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలు, దర్శకుడికు నా థాంక్స్‌’’ అన్నారు.

దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ ‘‘ఈ ప్రాజెక్ట్‌ సంవత్సరంన్నర నుండి జరుగుతోంది. ఫైనల్‌గా ఫిబ్రవరి 12న రిలీజ్‌కి రెడీ అయింది. స్టార్టింగ్‌ నుండి ఇప్పటి వరకు ఎంతో మంది ఫ్రెండ్స్‌ హెల్ప్‌ చేశారు. నాని మెయిన్‌ లీడ్‌ క్యారెక్టర్‌లో నటించారు. ఎమోషన్స్‌, లవ్‌, ప్రతీకారం మధ్య జరిగే స్టోరీ. కృష్ణ క్యారెక్టర్‌ నేను ఎలాగైతే ఊహించుకున్నానో దాన్ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లాడు నాని. అంత అద్భుతంగా ఆ క్యారెక్టర్‌ని చేశాడు. నేను ఎక్స్‌ పెక్ట్‌ చేసిన దానికంటే ఎక్కువ చేశారు. కెమెరామెన్‌ యువరాజ్‌ ఫస్ట్‌ నుండి నాతో ట్రావెల్‌ అవుతూ ప్రతి సీన్‌ని విజువల్‌గా చాలా కొత్తగా పిక్చరైజ్‌ చేశాడు. తనకి చాలా బ్రైట్‌ ఫ్యూచర్‌ ఉంది. విశాల్‌ శేఖర్‌తో టు ఇయర్స్‌ నుండి పరిచయం. ఎక్స్‌ట్రార్డినరీగా మ్యూజిక్‌ ఇచ్చారు. అతని కెరీర్‌కి ఇది ఒక టీజర్‌లాంటిది. ఇండస్ట్రీలో వన్‌ ఆఫ్‌ ది టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవుతాడు. ఎక్స్‌పెక్ట్‌ చేయని విధంగా రీ రికార్డింగ్‌ స్టన్నింగ్‌గా చేశాడు. అవినాష్‌ ఎంతో హార్డ్‌ వర్క్‌ చేసి సెట్స్‌ వేశాడు. కొత్త వాడిలా కాకుండా ఎంతో ఎక్స్‌ పీరియన్స్‌ ఉన్న కళా దర్శకుడిలా చేశాడు. ఈ సినిమాని చాలా డిఫికల్ట్‌ లొకేషన్లలో షూట్‌ చే
ాం. లైన్‌ ప్రొడ్యూసర్‌ హరీష్‌ ఎంతో కోపరేట్‌ చేశారు. డైలాగ్స్‌ ని జై అద్భుతంగా రాశాడు. ఎంతో పరిణితితో, విజ్ఞతతో రాశాడు. అలాగే కె.కె. బ్యూటిఫుల్‌ లిరిక్స్‌ రాశారు. మంచి సినిమా తీయాని ప్యాషన్‌తో ఒక డైరెక్టర్‌ ఎన్నో కలలు కంటాడు. ఆ కలల్ని సాకారం చేసేది నిర్మాతలు. నేను పేపర్‌ మీద ఏదైతే రాసుకున్నానో అది స్క్రీన్‌పై వచ్చేలా ఎంతో ఫ్రీడం ఇచ్చిన నా నిర్మాతకు థాంక్స్‌. ఒక ఫ్రెండ్‌లా ట్రీట్‌చేసి సినిమా బాగా రావడానికి ఎంతో ఇన్వాల్వ్‌ అయి ముగ్గురు నిర్మాతలు వర్క్‌ చేశారు. సినిమా బాగా వచ్చింది. ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌ ఈ సినిమా. తమల్ని తాము మరచిపోయి ఎంజాయ్‌ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు.

పాటల రచయిత కె.కె. మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో అన్ని పాటలు రాశాను. విశాల్‌ మంచి ట్యూన్స్‌ కంపోజ్‌ చేశాడు. హను బ్యూటిఫుల్‌ విజువల్స్‌ తో ఈ చిత్రాన్ని తీశాడు. అందరికీ ఈ చిత్రం నచ్చుతుంది’’ అన్నారు.

లైన్‌ ప్రొడ్యూసర్‌ హరీష్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాని అందరూ ఎంతో ఇష్టపడి కష్టపడి వర్క్‌ చేశారు. కొండు, ట్రావెల్‌ చేయలేని ప్రదేశంలో కూడా షూటింగ్‌ చేశాం. 14 రీల్స్‌ బ్యానర్‌లో 14 మందిలో నేను ఒకడ్ని. ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved